కార్లు, బస్సులను తోసినట్లు రైలుని నెట్టిన ప్రయాణికులు.. అసలేం జరిగిందంటే, వైరల్‌ వీడియో!!

సాధారణంగా కార్లు, బస్సులు రోడ్లపై ఆగితే వాహనాలను తోసిన సందర్భాలు గమనించాం. అలాగే రోడ్లపై ఏళ్ల తరబడి నిలిచిపోయిన వాహనాలను స్టార్ట్ చేసేందుకు బండ్లను తోస్తారు. అయితే ప్రస్తుతం బీహార్ లో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న రైలును తోసేసిన ఘటన జరిగింది. ఇలాంటి సంఘటన ఇదివరకు ఎక్కడ జరగలేదు. దీంతో రైలుని నెట్టడం ఏంటని నెటిజన్లు తమదైన స్టైల్‌లో కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆగి ఉన్న రైలును ప్రజలు నెట్టడానికి కారణం ఏమిటి? ఈ ఘటన పూర్తి వివరాలు మీ కోసం..

తాజాగా బీహార్ రాష్ట్రంలో ట్రాక్‌పై నిలిచి ఉన్న రైలును తోసేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విడుదలై వైరల్ అవుతోంది. ఇలాంటి సంఘటన దేశంలో చోటు చేసుకోవడంపై పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రైలును ఎందుకు తోస్తున్నారో తెలియక చాలా మంది అయోమయంలో ఉన్నారు. దీనికి వెనక జరిగిన సంఘటనతో ఒక్కసారిగా అందరు షాక్‌ అయ్యారు. అసలేం జరిగిందంటే..

Passengers-Pushing-Train-In-Bihar

జూన్‌ 6వ తేదీన (గురువారం) సాయంత్రం 5:25 గంటలకు పాట్నా నుంచి ఝార్ఖాండ్‌కి వెళ్లే మెమో రైలు ప్రయాణికులకు తీసుకువెళ్లేందుకు కియుల్‌ (Kiul Junction)లో సిద్ధంగా ఉంది. అంతా బాగానే ఉంది. రైలు కదిలేందుకు సిద్ధంగా ఉంది. అంతలోనే జరిగిన సంఘటనతో అక్కడి వారంతా ఉలిక్కి పడ్డారు. అక్కడే ట్రైన్‌లోని ఒక భోగి నుంచి పొగలు వచ్చాయి. దీంతో రైలులోని ప్రయాణికులు కేకలు వేస్తూ కోచ్‌ నుంచి బయటకు వచ్చారు.

ఆ తర్వాత కొన్ని సెకన్లలో పొగ కాస్త పెద్ద అగ్నిగా మారింది. విషయాన్ని అక్కడి స్టేషన్‌ అధికారులకు చేరవేశారు. దీంతో వారు సిబ్బందితో కలిసి రంగ ప్రవేశం చేశారు. మంటలు వేగంగా వీచే అవకాశం ఉండటంతో చేసేదేమి లేక మంటలు చెలరేగిన రైలు భోగిని వేరు చేశారు. ఇంజిన్‌ వైపు ఉన్న భోగిని వేరు చేయడంతో వెనక భాగంలోని భోగిలను ముందుకు జరిపేందుకు అందరు చర్యలు చేపట్టారు.

Passengers-Pushing-Train

అయితే వేరు చేసిన కోచ్‌లను తరలించడం అంత తేలికైన పని కాదని వారు గమనించారు. దీంతో చాకచక్యంగా వ్యవహరించి రైలును కాలిపోతున్న కంపార్ట్‌మెంట్‌ నుంచి దూరంగా తరలించారు. ఇందుకోసం స్టేషన్‌లోని ప్రయాణికుల సహాయం తీసుకున్నారు. దీంతో భోగిలను అందరూ తోస్తూ వేరు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ రైల్వేలో ఏం జరుగుతోందని దీనిని ట్యాగ్ చేసి ప్రశ్నించారు. దీనిపై తూర్పు రైల్వే సమాధానం ఇచ్చింది.

ఇది బీహార్ రాష్ట్రంలో జరిగిన ఘటన అని, రైలును కాపాడేందుకు ప్రజలు సహకరించారని వారు తెలిపారు.అగ్ని ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. కోచ్‌లోని ఎలక్ట్రికల్ సర్క్యూట్‌లో లోపం వల్ల మంటలు వ్యాపించాయా? లేక దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మంటలు చెలరేగిన రైలు కోచ్‌ను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

మంటలు వ్యాపించడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పౌరులు రైలును నెట్టుతున్న వీడియోలో రైలుకు మంటలు అంటుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే మంటలు ఎక్కువగా వ్యాపించకుండా ఆర్పివేశామని రైల్వే యంత్రాంగం తెలిపింది. వీడియో ప్రకారం భారీ ప్రమాదాన్ని తప్పించిన అక్కడి ప్రయాణికులను, సకాలంలో చాకచక్యంగా వ్యవహరించిన రైల్వే సిబ్బందిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, June 10, 2024, 18:13 [IST]
English summary
Passengers pushing train on track in bihar video gone viral
Read more on: #off beat #rail #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+