రోడ్డెక్కనున్న 50 కొత్త సిఎన్‌జి బస్సులు.. ఎక్కడో తెలుసా..?

భారతదేశంలో వాయు కాలుష్యం రోజు రోజుకి ఎక్కువవుతోంది. ఈ కారణంగా వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు బీహార్ రాష్ట్ర రవాణా శాఖ బీహార్ రాజధాని పాట్నాలో 50 కొత్త సిఎన్‌జి బస్సులను ఏర్పాటు చేస్తోంది.

రోడ్డెక్కనున్న 50 కొత్త సిఎన్‌జి బస్సులు.. ఎక్కడో తెలుసా..?

ఈ కొత్త సిఎన్‌జి బస్సులు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించనున్నాయి. కానీ ఈ కొత్త సిఎన్‌జి బస్సులు ప్రయాణించే మార్గం ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతం, బీహార్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పాట్నాలో 20 సిఎన్‌జి బస్సులను నడుపుతోంది. ఈ బస్సులు బెయిలీ - దానపూర్ మార్గంలో నడుస్తాయి. ఇప్పుడు కొత్తగా జనవరిలో 50 కొత్త సిఎన్‌జి బస్సులు చేర్చబడతాయి.

రోడ్డెక్కనున్న 50 కొత్త సిఎన్‌జి బస్సులు.. ఎక్కడో తెలుసా..?

దీనిపై స్పందించిన బీహార్ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు కొత్త సిఎన్‌జి బస్సులు సమర్థవంతంగా పనిచేస్తాయని చెప్పారు. పాట్నాలో వాయు కాలుష్య సమస్యను నియంత్రించడానికి ఈ బస్సులు సహాయపడతాయి. ఢిల్లీలో మాదిరిగా పాట్నాలో కూడా సిఎన్‌జి బస్సులను ప్రవేశపెడతామని చెప్పారు.

MOST READ:రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్.. తమిళ్ తలైవా కార్లు ఎలా ఉన్నాయో చూసారా !

రోడ్డెక్కనున్న 50 కొత్త సిఎన్‌జి బస్సులు.. ఎక్కడో తెలుసా..?

ఇప్పుడు ఇది మాత్రమే కాకుండా డీజిల్‌తో నడిచే కార్లను సిఎన్‌జిగా మార్చాలని రవాణా శాఖ ప్రతిపాదిస్తోంది. అధికారుల యొక్క నివేదికల ప్రకారం, డీజిల్‌తో నడిచే కార్లను సిఎన్‌జిగా మార్చడం లేదా బదులుగా కొత్త కార్లను కొనుగోలు చేయడం గురించి చర్చ జరుగుతోంది.

రోడ్డెక్కనున్న 50 కొత్త సిఎన్‌జి బస్సులు.. ఎక్కడో తెలుసా..?

పాట్నాలో ప్రస్తుతం సుమారు 5,000 సిఎన్‌జి ఆటోలు నడుస్తుండటం గమనార్హం. కానీ సిఎన్‌జి కేంద్రాల కొరత ఎక్కువగా ఉంది. సిఎన్‌జి తక్షణమే అందుబాటులో ఉందని నిర్ధారించడానికి, పాట్నాలో 12 కొత్త సిఎన్‌జి కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి.

MOST READ:కొత్త హోండా హార్నెట్ 2.0 రెప్సోల్ ఎడిషన్ వీడియో.. మీరు చూసారా ?

రోడ్డెక్కనున్న 50 కొత్త సిఎన్‌జి బస్సులు.. ఎక్కడో తెలుసా..?

పాట్నా ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరాల్లో ఒకటి. ఈ కాలస్యానికి ప్రధాన కారణం వాహనాల నుంచి వెలువడే పొగ. కాబట్టి వాయు కాలుష్య సమస్యను తగ్గించడానికి పాట్నాలో పర్యావరణ అనుకూల వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

రోడ్డెక్కనున్న 50 కొత్త సిఎన్‌జి బస్సులు.. ఎక్కడో తెలుసా..?

పాట్నాలోనే కాకుండా భారతదేశం అంతటా పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు మరియు ఎలక్ట్రిక్ మరియు సిఎన్‌జి వంటి వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడం ముడి చమురు దిగుమతుల పరిమాణాన్ని తగ్గిస్తుండటం గమనార్హం.

MOST READ:డ్రైవర్‌రహిత వాహనాల టెస్ట్ కోసం తయారవుతున్న కొత్త కృత్రిమ నగరం.. ఎక్కడో తెలుసా ?

Note: Images used are for representational purpose only.

Most Read Articles

English summary
Patna To Get 50 CNG Buses. Read in Telugu.
Story first published: Saturday, December 12, 2020, 11:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X