ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 చిత్రంలో పౌల్ వాకర్!
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది, ఇటీవలే కారు ప్రమాదంలో మరణించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు పౌల్ వాకర్. అతని మరణం కారణంగా నిర్మాణంలో ఉన్న ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 చిత్రం మధ్యలో ఆగిపోయిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, పౌల్ వాకర్‌ను సజీవంగా తెరపై చూపించేదుకు చిత్ర నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రంలో పౌల్ వాకర్ క్యారెక్టర్ ఇంకా మిగిలి ఉండగానే, అతను కాలం చేశాడు. దీంతో సినిమాలో పౌల్ వాకర్ లోటును భర్తీ చేసేందుకు కంప్యూటర్ గ్రాఫిక్స్ సాయంతో పౌల్ వాకర్‌ను తిరిగి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పౌల్ వాకర్ బాడీ డబుల్స్ (పౌల్ వాకర్‌కు డూప్లికేట్స్)ను ఉపయోగించనున్నారు.

అంతేకాకుండా.. పౌల్ వాకర్ గొంతును అనుకరించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో పౌల్ వాకర్ క్యారెక్టర్ బ్రియాన్ ఓ కార్నర్. అబుదాబిలో వచ్చే నెల నుంచి ఈ చిత్రం రీషూటింగ్ ప్రారంభం కానుంది. కారు ప్రమాదంలో పౌల్ వాకర్ మరణించి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది.
ఇప్పటికే పౌల్ వాకర్ బాడీని పోలి ఉండే నలుగుర్ని ఈ చిత్రం కోసం సెలక్ట్ చేసుకున్నట్లు సమాచారం. వారిని కదలికలు మరియు బేస్ కోసం ఉపయోగిస్తారు. ముఖాన్ని మాత్రం సిజిఐను ఉపయోగించి పౌల్ వాకర్‌లా చూపిస్తారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 సినిమా ఏప్రిల్ 10, 2015వ తేదీన విడుదల కావచ్చని సమాచారం.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/o8UCI7r1Aqw?list=UUJCx8aQrdx_ueXPmxTD2odQ" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








