రోగర్ రోడస్ ఫ్యామిలీపై 1.8. మి. డాలర్లకు కేస్ ఫైల్ చేసిన పౌల్ వాకర్ తండ్రి
డిసెంబర్ 2013 నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు పాల్ వాకర్ (Paul Walker) తన స్నేహితుడు రోగర్ రోడస్‌తో పాటుగా మరణించిన సంగతి తెలిసినదే. ప్రమాద సమయంలో రోగర్ రోడస్ తన పోర్షే కరెరా జిటి స్పోర్ట్స్ కారును నడుపుతుండగా, పౌల్ వాకర్ కో ప్యాసింజర్ సీట్లో కూర్చుని ఉన్నాడు.
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రాల ద్వారా మంట్ క్రేజ్ దక్కించుకున్న పౌల్ వాకర్, కాలం చేసి రెండేళ్లు పూర్తయింది. తాజాగా పౌల్ వాకర్‌కు చెందిన మరో హాట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. పౌల్ వాకర్ తండ్రి ఇప్పుడు రోగర్ రోడస్ కుటుంబంపై ఓ కేసు ఫైల్ చేయటం.

వాస్తవానికి రోగర్ రోడస్, పౌల్ వాకర్ స్నేహితులే కాదు వ్యాపార భాగస్వాములు కూడాను. వీరిద్దరి బిజినెస్‌లో భాగంగా.. ఓ మంచి కార్ కలెక్షన్ ఉంది. వీరిద్దరూ కాలం చేసిన ఆరు నెలల తర్వాత ఈ కార్ కలెక్షన్ వేలానికి వచ్చింది. అయితే, ఇందులో తమ కుమారుడు పౌల్ వాకర్‌కు కూడా వాటా ఉందని, అతని తండ్రి రోడస్ ఫ్యామిలీపై 1.8 మిలియన్ డాలర్లకు కేసు ఫైల్ చేశారు.
పౌల్ వాకర్ మరణంతో అతని ఆస్తికి యజమాని అయిన తన తండ్రి పేర్కొన్న పిటిషన్ ప్రకారం, రోడస్ ఫ్యామిలీ ఇంకా కార్లను తమ వద్దే ఉంచుకొందని, అందుకే అతను రోడస్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా 1.8 మిలియన్ డాలర్లను క్లెయిమ్ చేస్తూ పిటిషిన్ దాఖలు చేశామని చెప్పారు. మరి ఈ కేసు ఎప్పుడు ఓ కొలిక్కి వస్తుందో వేచి చూడాలి.
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాతో అటు హాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇండియన్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన ప్రముఖ హాలీవుడ్ నటుడు పాల్ వాకర్ గడచిన డిసెంబర్ 2013లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసినదే. ఫిలీప్పిన్స్ తుఫాను బాధితులకు సాయం చేయటం కోసం నిధుల సేకరణకు శాంతా క్లారిటాలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్నేహితుడి పోర్షే కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


Click it and Unblock the Notifications








