మెర్సిడెస్ బెంజ్ జి55లో చరణ్ నిశ్చితార్థానికి విచ్చేసిన పవన్

రామ్ చరణ్ నిశ్చితార్థానికి పవన్ కళ్యాన్ హాజరవుతుండగా కెమరాకు చిక్కిన దృశ్యమిది. పవన్ తన మెర్సిడెస్ బెంజ్ జి55 ఎస్‌యూవీని తానే స్వంతంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఇలా కెమరాలకు చిక్కిపోయాడు. అక్కడికి వచ్చిన అభిమానులంతా తమ తమ ఫోన్లు/కెమరాల్లో పవన్‌ను బంధించేందుకు ప్రయత్నించారు. విలావంతమైన కార్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ గడచిన ఆగస్టు నెలలో ఈ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది.
మెర్సిడెస్ బెంజ్ జి55 ఎస్‌యూవీలో ఉపయోగించిన 5.5 లీటర్ వీ8 ఇంజన్ 507 పిఎస్‌ల గరిష్ట శక్తిని మరియు 700 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. భారత మార్కెట్లో ఈ ఎస్‌యూవీ ధర రూ. 1.10 కోట్ల (ఎక్స్-షోరూమ్) నుండి రూ.1.50 (ఎక్స్-షోరూమ్) కోట్ల మధ్యలో ఉంటుంది. తొలుత ఈ వాహనాన్ని సైన్యం యొక్క అవసరాల కోసం తీర్చిదిద్దారు. ఆ తర్వాతి కాలంలో ఎస్‌యూవీ విభాగంలో ఒక కొత్త మోడల్‌గా దీన్ని పరిచయం చేయడం జరిగింది.


Click it and Unblock the Notifications