విరిగిన చక్రంతో 10 కి.మీ ప్రయాణించిన రైలు.. అలా చేయకపోతే ఘోర ప్రమాదమే జరిగి ఉండేది.!
ప్రతి రోజూ లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలను చేరుస్తుంది రైల్వే శాఖ. ఈ నేపథ్యంలో ఇటీవల ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ప్రమాదం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ప్రమాదంలో వందల కొద్దీ మరణాలు నమోదు కాగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. ఆ ఘటనను మరిచిపోకముందే మరో సంఘటన భయాందోళనకు గురిచేసింది.
ఇటీవల ఒడిశాలో భారీ రైలు ప్రమాదాన్ని చవిచూసిన రైల్వే శాఖ మరో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. రైలు చక్రం విరిగిపోయినా ఎలాంటి ప్రమాదం జరగకుండా 10 కిలోమీటర్లు నిర్విఘ్నంగా ప్రయాణించింది. చక్రం విరిగిన శబ్దంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

గత నెల 2న బాలాసోర్ రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సరిగ్గా నెల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. మూడు రైళ్లు ఢీకొని జరిగిన ఘోర ప్రమాదంలో 300 మందికి పైగా మరణించారు. 1,000 మందికి పైగా గాయపడ్డారు. గత రెండు దశాబ్దాల్లో జరిగిన ఘోర రైలు ప్రమాదాల్లో ఇది అత్యంత ఘోరమైనదిగా పరిగణించబడింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన మరో సంఘటన రైల్వేశాఖను మరోసారి షాక్‌కు గురిచేసింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి ముంబయికి పవన్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు ప్రయాణికులు చాకచక్యంతో తప్పించుకున్నారు. ముంబయికి బయలుదేరిన పవన్ ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో విరిగిన చక్రంతో 10 కిలోమీటర్లు ప్రయాణించింది.
రైలు చక్రం విరిగిపోవడంతో శబ్దాన్ని విన్న ప్రయాణికులు సమయపాలన పాటించడంతో పెనుప్రమాదం తప్పిందని సమాచారం. ఆదివారం(జూలై 2) అర్ధరాత్రి భగవాన్‌పూర్ రైలులోని ముజఫర్‌పూర్ - హాజీపూర్ సెక్షన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. చక్రం విరిగిపోయినా రైలు 10 కిలోమీటర్ల మేర ప్రయాణించినట్లు సమాచారం.
ముంబయికి వెళ్తున్న పవన్ ఎక్స్‌ప్రెస్ ముజఫర్‌పూర్ జిల్లాలో చక్రం విరిగి 10 కి.మీ నడిచింది. రైలు భగవాన్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరినప్పుడు చక్రం విరిగిన శబ్దం విని చైన్ లాగి ఆపివేసినట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. అనంతరం ప్రయాణికులు ఈ శబ్దం గురించి లోకో పైలట్, సిబ్బందికి సమాచారం అందించారు. S11 కోచ్‌లో ఇది జరిగినట్లు సమాచారం.
రైలు ప్రయాణికులతో ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుండగా, ప్రయాణికులకు S11 కోచ్‌లో పెద్ద శబ్దం వినిపించింది. అయితే రైలు వేగంగా వెళ్తుండటంతో భగవాన్‌పూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకునేవరకూ సమస్యను గుర్తించే ప్రయత్నం జరగలేదని సమచారం. ఆ తర్వాత మాత్రమే ప్రయాణికులు శబ్దాన్ని గుర్తించినట్లు తెలిపారు.
భగవాన్‌పూర్ స్టేషన్ నుంచి బయలుదేరాక శబ్దం విన్న ప్రయాణికులు చైన్ లాగిన అనంతరం సమాచారం ఇవ్వడంతో రైల్వే ఇంజినీర్లు, ఉద్యోగులు స్టేషన్‌కు చేరుకున్నారు. తనిఖీలో ఎస్11 బోగీ చక్రం విరిగిపోయినట్లు గుర్తించారు. పవన్ ఎక్స్‌ప్రెస్‌లో చక్రం విరిగిందని సమాచారం అందిందని, తమ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని లోపాన్ని సరిదిద్దినట్లు తూర్పు మధ్య రైల్వే, హాజీపూర్ CPRO వీరేందర్ కుమార్ వెల్లడించారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








