జూ ఎన్టీఆర్ కన్నా ముందే పవన్ హార్లీ డేవిడ్‌సన్ యజమాని

Pawan Kalyan - Jr NTR
దేశంలో ధనవంతుల సంఖ్య పెరిగిపోతుండటం, అలాగే సెలబ్రిటీలకు విలాసాలపై మోజులు పెరుగుతుండటంతో.. ఈ అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు విదేశీ కంపెంనీలు టక్కున భారత్‌లో వాలిపోతున్నాయి. ఈ అంశంలో ముఖ్యంగా ఆటోమొబైల్ రంగాన్ని పరిశీలిస్తే.. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న మార్పులే నిలువెత్తు నిదర్శనలు. ఒకప్పుడు ఫారిన్ కారు లేదా బైక్ కొనాలంటే నేరుగా కంపెనీ నుంచి భారత్‌లోకి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. కానీ నేడు ఆ సమస్య లేకుండా.. ఫారిన్ కంపెనీలే తమ దుకాణాలను భారత్‌లోకి తెస్తున్నాయి.

అమెరికాకు చెందిన విలాసవంతమైన మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ హ్యార్లీ డేవిడ్‌సన్ భారత్‌లో తమ తొలి అవుట్‌లెట్ కేంద్రాన్ని ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చేతులు మీదుగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఓ సరికొత్త డీలర్‌షిప్ కేంద్రాన్ని గతేడాదిలో ప్రారంభించింది. ఆ తర్వాతి కాలంలో న్యూఢిల్లీ, బాంబే, బెంగుళూరు, ఛత్తీస్‌ఘడ్‌లలో కూడా డీలర్‌షిప్ కేంద్రాలను ప్రారంభించింది. కాగా.. హైదరాబాద్‌లో షోరూమ్‌ను ప్రారంభించిన జూ.ఎన్టీఆర్ దాదాపు రూ. 19 లక్షలు వెచ్చించి హార్లీ డేవిడ్‌సన్ నైట్ రాడ్ స్పెషల్ బైక్‌ను కొనుగోలు చేసిన తొలి వినియోగదారుడుగా నిలిచారు.

ఆ సమయంలో హార్లీ డేవిడ్‌సన్ బైక్‌ను కొన్న తొలి హైదరాబాదీగా జూ.ఎన్టీఆర్‌ను చెప్పుకొన్నారు. వాస్తవానికి జూ.ఎన్టీఆర్ కన్నా ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మొట్టమొదటిసారిగా హార్లీ డేవిడ్‌సన్ బైకును దుబాయ్ నుంచి చాలా కాలం క్రితమే సుమారు రూ. 40 లక్షలు పోసి దిగుమతి చేయించుకున్నారు. పవన్ కళ్యాన్ ఇటీవల నటించిన కొమరం పులి చిత్రంలో కూడా ఈ బైక్‌ను ఉపయోగించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో తొలి హార్లీ డేవిడ్‌సన్ యజమానిగా పవన్, తొలి వినియోగదారుడిగా ఎన్టీఆర్‌లు నిలిచారు. వీరి నేనేం తీసిపోనంటూ.. నాగార్జున తనయుడు నాగచైతన్య కూడా ఇటీవలే రూ. 9.50 లక్షల విలువ చేసే ఓ హోండా బైకును, అంతకు ముందు రూ. 12.40 లక్షల విలువ చేసే ఓ యమహా వైజెడ్ఎఫ్ ఆర్ 1 స్పోర్ట్స్ బైక్‌ను కొనుగోలు చేశారు.

More from DriveSpark

Article Published On: Thursday, April 7, 2011, 17:43 [IST]
English summary
Tollywood raising film star Jr. NTR and Power star Pawan Kalyan are the first owners of Harley-Davidson bike. Bur questions is who is first. Apparently, Pawan Kalyan was the first importer of the Harley Davidson bike. Jr. NTR became the first Harley-Davidson customer in AP market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+