పవన్‌ కళ్యాణ్‌ పవర్‌ఫుల్‌ కార్లు, బైకులు.. దేశంలోనే ఆ లగ్జరీ కారుని కొనుగోలు చేసిన తొలి సెలబ్రిటీ

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుబెట్టబోతున్నారు. ఆయన స్థాపించిన జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో 100% స్ట్రైక్‌ రేట్‌తో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ పార్టీ గుర్తుగా ఉన్న గాజు గ్లాస్‌ సింబల్‌ ఫ్రీ సింబల్స్‌ జాబితా నుంచి తొలగిపోనుంది. టీడీపీ, బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో పవన్‌ కళ్యాణ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది ఏపీ ఎలక్షన్స్‌గా రికార్డు తిరగరాశాడు. కూటమి ప్రభుత్వం సాధించిన విజయంలో పవర్‌ స్టార్‌ కీలక పాత్ర పోషించాడు. ఆయన తీసుకున్న నిర్ణయమే నేటి ఫలితాలకు అద్ధం పడుతున్నాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్టార్‌ హీరో నిజ జీవితంలో అరుదైన లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. వాటి వివరాలు మీకోసం..

ఈ స్టార్‌ హీరో టయోటా న్యూ జెనరేషన్‌ ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీని కలిగి ఉన్నాడు. ఈయన గ్యారేజీలో తాజా కారు ఇదే. ఈ కారుని గత ఏడాది మార్చిలో పవర్‌ స్టార్‌ కొనుగోలు చేశారు. టయోటా నుంచి ఎస్‌యూవీ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఖరీదైన కార్లలో ల్యాండ్‌ క్రూయిజర్‌ LC300 ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.10 కోట్లుగా ఉంది.

Pawan-Kalyan-Cars-Collection

ఫార్చ్యూనర్ మాదిరిగానే టయోటా ల్యాండ్ క్రూయిజర్‌ కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్‌ని కలిగి ఉంది. ఈ కారుని పొందాలంటే దాదాపు 12-24 నెలలు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ కారుని కొనుగోలు చేసిన తొలి సెలబ్రిటీగా పవర్‌ స్టార్‌ నిలిచారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ ఈ కారులోనే ప్రయాణిస్తున్నారు. అత్యంత ఖరీదైన కారులో అభివాదం చేస్తూ ఫ్యాన్స్‌కి మంచి కిక్కు అందిస్తున్నాడు.

ఈ ఎస్‌యూవీ సూపర్ వైట్, డార్క్ రెడ్ మైకా మెటాలిక్, బ్లాక్, డార్క్ బ్లూ మైకా కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. పవన్‌ కళ్యాణ్‌ సూపర్‌ వైట్‌ కలర్‌ కారుని కొనుగోలు చేశారు. టయోటా ఫ్లాగ్‌షిప్‌లో ల్యాండ్ క్రూయిజర్ LC 300 ప్రీమియం ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో ఆల్-LED హెడ్ ల్యాంప్స్, 12.3 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, 14 స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Pawan-Kalyan-Land-Cruiser-LC300

అంతర్జాతీయంగా ఈ ఎస్‌యూవీ టయోటా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. భారత్‌లో కేవలం డీజిల్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ SUV డీజిల్ వెర్షన్ 3.3 లీటర్ V6 టర్బో డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 309 Ps మరియు 700 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అదే విధంగా ఎన్నికల ప్రచారం కోసం 'వారాహి' వాహనాన్ని పవన్‌ కళ్యాణ్‌ తన పేరున రిజిస్టర్‌ చేయించుకున్నారు. దీనిపై రాజకీయంగా సాంకేతింగా పలు విమర్శలు వచ్చాయి. ఈ అంశం దేశవ్యాప్తంగా వైరల్‌ అయ్యింది. మిలటరీ వాహనాలను పోలిన కలర్‌ ఉండటంతో వారాహి వైరల్‌గా మారింది. పలువురు సినీ నటులు, నటీమణుల కోసం ఇచ్చే 'క్యాంపర్ వ్యాన్ ఫర్ ప్రైవేట్ యూజ్'కింద అధికారులు దీనిని రిజిస్టర్ చేశారు.

Pawan-Kalyan-Varahi-Truck

ఇంకా ఈ పవర్‌ స్టార్‌ వద్ద లగ్జరీ కార్లు ఉన్నాయి. వోల్వో XC 90, మెర్సిడెస్ బెంజ్ R క్లాస్, టయోటా ఫార్చ్యూనర్‌తో పాటు మరికొన్ని కార్లు కూడా పవర్‌స్టార్‌ గ్యారేజీలో ఉన్నాయి. ఈ కార్ల విలువ సుమారు రూ.5 కోట్లు పైనే ఉంటుందని తెలిసింది. అంతే కాకుండా రూ.18 లక్షలకు పైగా విలువ చేసే హార్లీ డేవిడ్ సన్ హెరిటేజ్ సోఫ్టైల్ క్లాసిక్ బైక్‌ని కలిగి ఉన్నాడు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, June 5, 2024, 13:34 [IST]
English summary
Pawan kalyan cars and bikes collections
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+