పవన్ కళ్యాణ్ ప్రచారానికి సిద్దమైన 'వారాహి'.. నివ్వెరపోయే వాహన విశేషాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగటానికి ఇంక కేవలం కొన్ని నెలల కాలం మాత్రమే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు సరైన కసరత్తులు ఇప్పటినుంచే మొదలెట్టేశాయి. ఇందులో భాగంగానే జనసేన పార్టీ ప్రచారానికి ఒక ప్రత్యేకమైన వాహనం తయారైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

జనసేన అధినేత సినీ నటుడు అయిన పవన్ కళ్యాణ్ పార్టీ ప్రచారం కోసం ఒక వాహనం తయారైంది, ఇది చూటడానికి ఒక యుద్ధవాహనాన్ని తలపిస్తుంది. త్వరలో బస్సు యాత్ర ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్ ఈ వెహికల్ ఉపయోగించనున్నారు. ఈ వాహనం ద్వారానే రాష్ట్రము మొత్తం తిరగనున్నారు. ఈ ప్రచార వాహనానికి సంబంధించిన ఫోటోలను స్వయంగా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.

పవన్ కళ్యాణ్ ప్రచారానికి సిద్దమైన వారాహి

ఫోటోలు మాత్రమే కాకుండా దీనికి సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో షేర్ చేస్తూ ఎన్నికల యుద్దానికి 'వారాహి' సిద్ధం అంటూ పోస్ట్ చేశారు. ఈ వాహనానికి వారాహి అని పేరు పెట్టడం వెనుక కూడా ఒక స్టోరీ ఉంది. సప్త మాతృకల్లో ఒకరైన వారాహి (దుర్గాదేవి) అమ్మవారు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ వాహనానికి వారాహి అని పేరు పెట్టారు.

ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే వాహనం చుట్టూ బాడీ గార్డ్స్ నడుచుకుంటూ, వాహనానికి రెండువైపులా ఇద్దరు నిల్చుని ఉన్నారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు. ఇది చూడటానికి మిలటరీ వాహనం మాదిరిగా రూపొందించారు. దీని ట్రయల్ రన్‌ను పవన్ కళ్యాణ్ నిన్న (బుధవారం) హైదరాబాద్‌లో పరిశీలించారు. వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను కూడా ఆ పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు తెలిపారు.

పవన్ కళ్యాణ్ కోసం సిద్దమైన ఈ వాహనం చాలా ప్రత్యేకంగా రూపొందించబడి ఉంది. ఈ వాహనంలో ఒక సిట్టింగ్ రూమ్ కూడా రూపొందించారు. వాహనం చుట్టూ ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉండేలా కెమెరాలు ఏర్పాటు చేసారు. ప్రచారంలో వాహనం పైకి ఎక్కి మాట్లాడటానికి లోపలే మెట్లు కూడా ఉన్నాయి. అదే సమయంలో లైటింగ్ కోసం లైట్స్ మరియు అద్భుతమైన సౌండ్ సిస్టం కూడా ఇందులోనే ఏర్పాటు చేయబడ్డాయి.

వారాహి వాహనానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తరువాత ప్రచారానికి ఈ వాహనాన్ని ఉపయోగిస్తారు. ఈ వాహనం శత్రువుల భారీ నుంచి రక్షించడానికి కూడా తగిన విధంగా రూపొందించబడింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఒక పటిష్టమైన వాహనం రూపుదిద్దుకుంది. అయితే ఈ వాహనం నిర్మాణకి ఎంత ఖర్చు అయిందనే విషయం వెల్లడి కాలేదు.

ఈ ప్రచార రథం సోషల్ మీడియాలో కనిపించగానే చాలామంది అభిమానులు అప్పుడే విజయం సాధించిన ఆనందాన్ని పొందుతున్నారు. అంతే కాకుండా కొంతమంది వచ్చే ఎన్నికల్లో కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే ఏ రాష్ట్ర రాజకీయ ఫలితాలను ఎవరూ అప్పుడే నిర్దేశించే అవకాశం లేదు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ వచ్చే ఎన్నికల్లో నెగ్గుతుందో ప్రస్తుతం ఖచ్చితంగా చెప్పలేరు.

ఇదిలా ఉండగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ 8 మహీంద్రా స్కార్పియో కార్లను కొనుగోలు చేశారు. ఈ కార్లు ధర రూ. 1.5 కోట్లు వరకు ఉంటుంది అని తెలుస్తోంది. ఈ వాహనాలు కూడా పార్టీ ప్రచారంలో భాగంగానే ఉపయోగించబడతాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తన హవా చాటడానికి కృషి చేస్తున్నట్లు అనిపిస్తుంది. 2019 లో ఆశించిన ఫలితాలు రాలేదు. కాగా రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రాకీయాల్లో నిలదొక్కుకోగలడా.. లేదా అనేది తెలియాల్సిన విషయం.

Most Read Articles

English summary
Pawan kalyan election campaign vehicle varahi details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X