Varahi Vehicle పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ విషయాలు!!
ఏపీలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పవన్ ఈ ఎన్నికల రథాన్ని సిద్ధం చేయించుకున్నారు. ఈ క్రమంలో ఈ వారాహి వాహనం డిజైన్, ఫీచర్లు హాట్ టాపిక్‌గా మారింది. వారాహికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ కథనంలో..
ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల రథం బుధవారం అన్నవరంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రచారాన్ని ప్రారంభించింది. అనేక వివాదాల తర్వాత ఈ వాహన రిజిస్ట్రేషన్ పూర్తయింది. తాజాగా వారాహి వెహికల్ రిజిస్ట్రేషన్‌పై డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నవరం నుంచి బుధవారం వారాహి యాత్ర ప్రారంభించారు.

ఏపీలో కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం రథం వారాహి హాట్ టాపిక్‌గా మారిన సంగతి మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ అత్యంత ఆర్భాటంగా తీర్చిదిద్దుకున్న ఎన్నికల ప్రచారరథం ప్రజల్లో ఆసక్తిని పెంచింది. ఈ వాహనం రంగు, ఇతర విషయాలు, నిబంధనలకు విరుద్ధంగా ఉందనే ట్రోలింగ్‌తో వివాదం రాజుకుంది.
ఇదిలా ఉండగా వారాహి రిజిస్ట్రేషన్‌కు లైన్ క్లియర్ కావడంతో జనంలోకి వచ్చిన వారాహికి.. అన్ని అనుమతులు ఉన్నాయని తెలంగాణ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (Telangana Road Transport) అధికారులు స్పష్టం చేశారు. పవన్ వారాహి వాహనానికి ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్ నెంబర్‌ను కూడా కేటాయించారు.

వారాహికి రిజిస్ట్రేషన్ నెంబర్ TS 13 EX 8384 కేటాయించారు. వారాహి కలర్ ఆలివ్ గ్రీన్ కాదని.. ఎమరాల్డ్ గ్రీన్ అని అధికారులు వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఈ వాహనం నిబంధనల మేరకు ఉన్నందునే రిజిస్ట్రేషన్ చేశామని అధికారులు వివరణ కూడా ఇచ్చారు.
తాజాగా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వారాహి వాహనం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇక ఈ వాహనానికి నెంబర్ రిజిస్ట్రేషన్ కోసం రూ. 5000 ప్రభుత్వానికి చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆయన తెలిపారు.

సాధారణంగా వాహనాలకు ప్రత్యేక నెంబర్స్ అనేవి ఈజీగా ఎవరికి కేటాయించబడవు. అలాంటి నంబర్లు కావాలంటే ప్రభుత్వానికి రూ. 5000 కట్టి మనకు కావాల్సిన నెంబర్స్ తీసుకోవచ్చు. వారాహి వెహికల్‌కి కూడా రూ. 5000 కట్టి 8384 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకున్నారని డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు.
అంతే కాకుండా డిఫెన్స్ శాఖకు చెందిన వాహనాలకు తప్ప అగ్రికల్చర్ ట్రాక్టర్లతో పాటు ఇతర ఏ వాహనాలకూ ఆలివ్ గ్రీన్ కలర్ పెయింటింగ్‌గా వేయకూడదని మోటారు చట్టం నిబంధనల్లో స్పష్టంగా ఉంది. ప్రస్తుతం పవన్ ప్రచార రథం వారాహికి ఎమరాల్డ్ గ్రీన్ పెయింటింగ్ వేసినట్లు స్పష్టంగా తెలియడంతో వివాదం సద్దుమణిగింది.

పవన్ కళ్యాణ్ గత రోడ్‌షోలను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనం రూపకల్పన చేశారు. వారాహి వాహనం చుట్టూ ప్రత్యేక లైటింగ్‌తో పాటు వెరీ హైఎండ్ సెక్యూరిటీ సిస్టమ్‌ను ఫిట్ చేశారు. సభల్లో పవన్ ప్రసంగం స్పష్టంగా వినిపించేలా లేటెస్ట్ సౌండ్ సిస్టం, వాహనం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
రికార్డయ్యే ఫుటేజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వర్‌కి రియల్ టైంలో వెళ్లేలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించారు. వాహనం లోపల పవన్ కల్యాణ్‌తో పాటు మరో ఇద్దరు కూర్చొని చర్చించుకునేలా ఏర్పాటు చేశారు. అలాగే హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా పవన్ వాహనంపైకి చేరుకునేలా సిస్టం అమర్చారు.

ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తున్న ఈ వాహనానికి వారాహి అని పేరు పెట్టడం వెనుక ఓ ఆసక్తికరమైన కారణం ఉంది. వారాహి అంటే అమ్మవారి పేరు. వారాహి అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు పేర్కొంటున్నాయి. దుర్గాదేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించారు.



Click it and Unblock the Notifications








