ఓరుగల్లు రోడ్లపై చక్కర్లు కొడుతున్న గబ్బర్ సింగ్ జీప్

By Ravi

సినిమాల్లో సెలబ్రిటీలు వాడే వస్తువులు, ఆయుధాలు ఎలా పాపులర్ అవుతాయో వారు ఉపయోగించే వాహనాలు కూడా అంతే పాపులర్ అవుతాయి. వీటి క్రేజ్ ఎలా ఉంటుందంటే, ఉదాహరణ ఏదైనా సినిమాలో ఓ స్టార్ హీరో టాటా నానో కారును ఉపయోగించాడనుకుంటే, ఆ తర్వాత ఆ కారును టాటా నానో అని పిలవడం మానేసి, అది ఫలానా హీరో కారు అని పిలిచేస్తుంటారు. సరే ఇదంతా అటుంచితే, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమాలో మన హీరో వాడిన మోడిఫైడ్ జీప్ మీకు గుర్తుండే ఉంటుంది.

ఈ సినిమాలో అసాధారణ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించిన పవన్ కళ్యాన్ దర్శక నిర్మాతలను ఓ జీప్‌ను ప్రత్యేకంగా మోడిఫై చేయించారు. ఈ జీప్ ఫ్రంట్ బానెట్‌పై దేశీ తపంచా (పురాతన హ్యాండ్ మేడ్ పిస్టోల్ లేదా హ్యాండ్ గన్) ఆకారంలో ఉండే ఓ తుపాకీని అమర్చారు. ఈ యాక్షన్ సన్నివేశాలను అడవులు, కొండలు గుట్టలు వంటి ప్రాంతంలో చిత్రీకరించడంతో, ఆఫ్-రోడ్ రైడింగ్‌కు సరిపోయే విధంగా, ఈ జీప్‌కు విశాలమైన, వెడల్పాటి పెద్ద టైర్లను ఉపయోగించారు. ఈ చక్రాలకు 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను కూడా గమనించవచ్చు.

మన పవర్ స్టార్ కోసం ప్రత్యేకంగా మోడిఫై చేయించిన ఈ జీప్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా..? వరంగల్‌లో. అవును, గడచిన సంవత్సరం అక్టోబర్ నెలలో గబ్బర్‌ సింగ్‌ చిత్రనిర్మాత బండ్ల గణేష్‌ ఈ జీపును తెలంగాణ తెదేపా ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, వరంగల్‌ అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు అప్పట్లో బహుమతిగా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ జీప్ ప్రదీప్‌రావ్ గ్యారేజ్‌లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. ఎప్పుడైనా సరదాగా సిటీ రోడ్లపై షికారు చేయాలనుకుప్పుడు ప్రదీప్‌రావ్ ఈ జీప్‌ను ఉపయోగిస్తుంటారని సమాచారం.

గబ్బర్ సింగ్ జీప్

గబ్బర్ సింగ్ జీప్

గబ్బర్ సింగ్ జీప్

గబ్బర్ సింగ్ జీప్

గబ్బర్ సింగ్ జీప్

గబ్బర్ సింగ్ జీప్

గబ్బర్ సింగ్ జీప్

గబ్బర్ సింగ్ జీప్

గబ్బర్ సింగ్

గబ్బర్ సింగ్


వరంగల్‌ అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్‌గా మరియు నెక్‌జోనల్‌ ఛైర్మన్‌గా పనిచేస్తున్న ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, సినీ నిర్మాత బండ్ల గణేష్‌‌లు చాలా కాలం నుంచి మంచి స్నేహితులు. ఆ సాన్నిహిత్యంతోనే తనకు ఈ జీపును బహుకరించారని ఎర్రబెల్లి ప్రదీప్‌రావు చెప్పటం జరిగింది. పవన్‌ కళ్యాణ్ అభిమానుల కోసం నగరంలో ఈ జీపును కొంత కాలం తిప్పుతానని ఆయన ప్రకటించారు. మొత్తంమీద గబ్బర్‌సింగ్ వాహనం వరంగల్ జిల్లాకు చేరడంతో పవన్‌ కళ్యాణ్ అభిమానులే కాకుండా ప్రదీప్‌రావు అనుచరులు సైతం ఆనందించారు.

మరోవైపు 'గబ్బర్‌ సింగ్‌' చిత్రానికి సీక్వెల్ వస్తుందటూ పుకార్లు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఇదే గనుక నిజమైతే, ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కోసం దర్శక నిర్మాతలు ఎలాంటి వాహనాని అందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 30, 2013, 11:43 [IST]
English summary
Did you remembered the Pawan Kalyan's modified Jeep in Gabbar Singh film? Now this jeep hits the Warangal roads. Film Producer Ganesh Babu gifted this modified Jeep to Errabelli Pradeep Rao. The jeep's bonnet has a gun as its emblem and has several modifications including new tyres and alloy wheels.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+