పవర్ స్టార్ నుంచి సుజీత్‌కు ఖరీదైన కారు గిఫ్ట్.. ఆ కారు ఫీచర్స్ తెలిస్తే షాక్ అవుతారు!
ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ బాగా ఊపందుకుంటోంది. ఒక సినిమా భారీ హిట్‌గా నిలిస్తే, ఆ విజయానికి ప్రధానంగా కారణమైన దర్శకుడికి హీరో లేదా నిర్మాతలు ఖరీదైన కారు బహుమతిగా ఇవ్వడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇటీవల బాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ ఇలాంటి సంఘటనలు వరుసగా వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు అదే ట్రెండ్ తెలుగులో కూడా మరోసారి నిజమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఓజీ' (OG) సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విడుదలైనప్పటి నుంచే భారీ అంచనాల మధ్య థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయాన్ని సాధించింది. యాక్షన్, స్టైల్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు తోడు, సుజీత్ తీసిన మేకింగ్ ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలబెట్టింది.
బాక్సాఫీస్ బరిలో 'ఓజీ' భారీ బ్లాక్‌బస్టర్. ఈ విజయానికి గుర్తింపుగా పవర్ స్టార్ దర్శకుడు సుజీత్‌కు ఖరీదైన లగ్జరీ SUVని బహుమతిగా అందించారు. సుజీత్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ (Land Rover Defender)ను గిఫ్ట్‌గా ఇవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యేకంగా నల్లటి రంగులో ఉన్న ఈ డిఫెండర్ SUVను అందుకున్న సందర్భంలో తీసిన ఫోటోలను సుజీత్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

దీనిపై అభిమానులు, సినీ వర్గాలు పెద్ద ఎత్తున స్పందించాయి. పవన్ కళ్యాణ్ చూపిన ఈ గౌరవం, దర్శకుడిపై ఆయనకు ఉన్న నమ్మకం, అభిమానాన్ని ప్రతిబింబిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ల్యాండ్ రోవర్ డిఫెండర్ విషయానికి వస్తే, ఇది సినిమా తారలు, ప్రముఖులు ఎంతో ఇష్టపడే లగ్జరీ SUVలలో ఒకటి. బలమైన రోడ్ ప్రెజెన్స్, ఆఫ్-రోడ్ సామర్థ్యం, ప్రీమియం లుక్ కారణంగా ఈ వాహనం సెలబ్రిటీల గ్యారేజీల్లో తరచూ కనిపిస్తుంది.
అలాంటి డిఫెండర్ దర్శకుడు సుజీత్ గ్యారేజీలో చేరడం ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ లగ్జరీ SUV ఆన్-రోడ్ ధర సుమారు రూ.1.25 కోట్ల నుంచి రూ.3.07 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. 'ఓజీ' విజయంతో సుజీత్‌కు వచ్చిన గుర్తింపు, భవిష్యత్తులో ఆయన నుంచి మరిన్ని భారీ ప్రాజెక్టులు వచ్చే అవకాశాలను పెంచిందని చెప్పవచ్చు. ఒక సినిమాతో దర్శకుడి జీవితాన్ని మార్చే స్థాయిలో విజయం సాధించడం అరుదైన విషయం.

పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో నుంచి ల్యాండ్ రోవర్ డిఫెండర్ లాంటి లగ్జరీ కారును బహుమతిగా పొందడం సుజీత్ ప్రతిభకు వచ్చిన పెద్ద గౌరవంగా భావిస్తున్నారు. డిఫెండర్ పలు ఇంజన్ ఎంపికలలో ల్యాండ్ రోవర్ అందిస్తోంది. ఇందులో 3.0 లీటర్ పెట్రోల్ ఇంజన్, 3.0 లీటర్ డీజిల్ ఇంజన్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు అత్యంత శక్తివంతమైన 5.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో ఉంది.
పనితీరు విషయంలో ఎంత శక్తివంతంగా ఉంటుందో, లగ్జరీ, టెక్నాలజీ విషయంలో కూడా డిఫెండర్ అంతే ప్రత్యేకంగా నిలుస్తుంది. దీని ఇంటీరియర్ పూర్తిగా ఆధునిక ఫీచర్లతో నిండిపోయి ఉంటుంది. కేబిన్‌లో ప్రధాన ఆకర్షణగా 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించారు, ఇది డ్రైవర్‌కు అవసరమైన అన్ని కనెక్టివిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ సదుపాయాలను సులభంగా అందిస్తుంది.

దీనికి తోడుగా 12.3-అంగుళాల ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా ఇవ్వడం జరిగింది, దీని ద్వారా డ్రైవింగ్‌కు సంబంధించిన అన్ని కీలక సమాచారాన్ని స్పష్టంగా చూడవచ్చు. డ్రైవింగ్ సౌకర్యాన్ని మరింత పెంచేందుకు ల్యాండ్ రోవర్ డిఫెండర్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థను అందించారు. అంతేకాదు, డ్రైవర్‌కు మరింత సురక్షితమైన అనుభవం కోసం హెడ్-అప్ డిస్‌ప్లేను కూడా ఇందులో చేర్చారు. ఇవే కాకుండా మరిన్ని ఫీచర్లు ఉంటాయి.


Click it and Unblock the Notifications








