మెర్సిడెస్ బెంజ్ జి55 ఎస్‌యూవీని సొంతం చేసుకున్న పవన్

Ram Charan Teja-Pawan Kalyan
అటువైపు మరికొద్ది రోజుల్లో అబ్బాయ్ రామ్ చరణ్ తేజ్ పెళ్లికి సిద్ధమవుతుండగా, ఇటువైపు బాబాయ్ పవన్ కళ్యాణ్ ఓ సరికొత్త మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసినట్లు సమాచారమ్. జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తాజాగా జి-క్లాస్‌లో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన "మెర్సిడెస్ బెంజ్ జి55" ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం)ను కొనుగోలు చేశారు.

మెర్సిడెస్ బెంజ్ 1970వ సంవత్సర కాలంలో ఆర్మీ కోసం ఈ వాహనాన్ని రూపొందించింది. ఆ తర్వాతి కాలంలో ఇందులో సాధారణ ప్రజలకు కూడా ఉపయోగపడేలా ఈ మోడల్‌ను డిజైన్ చేసింది. ఆల్-వీల్ (ఫోర్-వీల్) డ్రైవ్ కలిగిన ఈ మెర్సిడెస్ బెంజ్ జి55 ఎస్‌యూవీ గంటకు గరిష్టంగా 250-260 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది కేవలం 5.4 సెకండ్ల వ్యవధిలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

ఇందులో ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), అన్ని వైపుల నుండి రక్షణ ఇచ్చేలా అమర్చిన ఎయిర్‌బ్యాగ్స్, వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని ధర సుమారు రూ.1.5 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Wednesday, November 30, 2011, 8:22 [IST]
English summary
Tollywood power star Star Pawan Kalyan has purchases a brand new Mercedes G55 SUV (sport utility vehicle) worth around Rs 1.5 crores. Mercedes G55 is latest offering SUV from German carmaker Mercedes-Benz in G-class in domestic market. This all-wheel drive SUV will touch a top speed around 250-260 kmph and it is capable to reach 100 kmph in just 5.4 seconds.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+