గోపాల గోపాల చిత్రంలో పవన్ కళ్యాన్ బైక్ ఇదేనా..?
బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ ప్రధాన పాత్రలలో నటించిన 'ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులోకి 'గోపాలా గోపాలా' అనే పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ (శ్రీకృష్టుడి) పాత్రను పవన్ కళ్యాన్ చేస్తుండగా, పరేష్ రావల్ (దుకాణదారు) పాత్రను వెంకటేష్ చేస్తున్నాడు.
బాలీవుడ్ వెర్షన్ ఓ మై గాడ్ చిత్రంలో అక్షయ్ కుమార్ కోసం దర్శక నిర్మాతలను ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించిన ఓ చోపర్ స్టైల్ బైక్‌ను ఉపయోగించారు. అలాగే, మన టాలీవుడ్ వెర్షన్ గోపాల గోపాల చిత్రంలో పవన్ కళ్యాన్ కోసం కూడా ఓ కస్టమైజ్డ్ బైక్‌ను ఉపయోగించనున్నారు. ముంబైకి చెందిన కస్టమ్ బైక్ మేకర్ వర్డెంచి (Vardenchi) ఈ బైక్‌ను కస్టమైజ్ చేయనుంది.

ఇప్పటికే ఈ బైక్‌కు సంబంధించిన లీక్డ్ ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, ఆ థీమ్‌కు మ్యాచ్ అయ్యేలా ఈ బైక్‌ను నీలిరంగులో పెయింట్ చేశారు. ఫ్యూయెల్ ట్యాంక్‌పై నెమలి పించాన్ని డిజైన్ చేశారు. ఈ బైక్‌లోని ప్రతి భాగాన్ని ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. మరి ఈ చిత్రంలో పవన్ ఇదే బైక్‌ను ఉపయోగిస్తారా లేక మారుస్తారా అనేది తేలాల్సి ఉంది.
ఇదివరకు నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా, బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన 'లెజండ్' చిత్రంలో బాలయ్య బాబు ఉపయోగించిన లెజెండ్ బైక్‌ను వర్డెంచి కంపెనీనే కస్టమైజ్ చేసిచ్చింది. లెజెండ్ చిత్రంలోని ఆ బైక్ మంచి పాపులరాటీని దక్కించుకుంది.


Click it and Unblock the Notifications








