గోపాల గోపాల చిత్రంలో పవన్ కళ్యాన్ కోసం ప్రత్యేకమైన బైక్
బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ ప్రధాన పాత్రలలో నటించిన 'ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులోకి 'గోపాలా గోపాలా' అనే పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ (శ్రీకృష్టుడి) పాత్రను పవన్ కళ్యాన్ చేస్తుండగా, పరేష్ రావల్ (దుకాణదారు) పాత్రను వెంకటేష్ చేస్తున్నాడు.
కాగా.. బాలీవుడ్ వెర్షన్ ఓ మై గాడ్ చిత్రంలో అక్షయ్ కుమార్ కోసం దర్శక నిర్మాతలను ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించిన ఓ చోపర్ స్టైల్ బైక్‌ను ఉపయోగించారు. అలాగే, మన టాలీవుడ్‌లో పవన్ కళ్యాన్ కోసం 'హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650' అనే క్రూజర్ బైక్‌ను ఉపయోగించనున్నారు. అయితే, ఈ బైక్‌ను కస్టమైజ్ చేస్తారా లేక అలానే ఉపయోగిస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
మరి మన పవర్ స్టార్ ఉపయోగించబోతున్న ఈ బైక్ సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో హ్యాసంగ్ ఆక్విలా ప్రో జివి650 బైక్ మరియు గోపాలా గోపాలా చిత్రాలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోండి.

కొరియన్ బైక్ కంపెనీ హ్యోసంగ్ గడచిన సంవత్సరం జనవరి నెలలో తమ సరికొత్త హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650 క్రూయిజ్ మోటార్‌సైకిల్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది. అప్పట్లో దీని ధర రూ.4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లుగా ఉండేది.

సరికొత్త హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650 క్రూయిజ్ మోటార్‌సైకిల్‌లో హ్యోసంగ్ జిటి650ఆర్‌లో ఉపయోగించే 650సీసీ లిక్విడ్-కూల్డ్, వి-ట్విన్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఇది గరిష్టంగా 72 బిహెచ్‌పిల శక్తిని, 62 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

డిజిటల్ డిస్‌ప్లే, లైట్-వెయిట్ అల్లాయ్ వీల్స్, రియర్ డిస్క్ బ్రేక్, అడ్జస్టబల్ 43 ఎమ్ఎమ్ అప్‌సైడ్-డౌన్ ఫోర్క్ వంటివి ఈ బైక్‌లో చెప్పుకోదగిన ఫీచర్లు. దీని స్టయిలింగ్‌ను చూస్తే ఇది హ్యార్లీ డేవిడ్‌సన్ అందిస్తున్న వి-రాడ్ మోటార్‌సైకిల్‌ను పోలి ఉంటుంది.

ఇక గోపాలా గోపాల చిత్రం విషయానికి వస్తే.. ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. వెంకటేష్, ఇతర తారాగణంపై సీన్లు చిత్రీకరిస్తున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ కూడా షూటింగులో జాయిన్ అవుతారు.

ఈ సినిమాలో వెంకీ పాత్ర పేరు గోపాల్. పవన్ పోషించేది కూడా గోపాలుడి (కృష్ణుడి) పాత్రే కాబట్టి ‘గోపాల గోపాల' టైటిల్ ఫైనల్ చేసారు. వెంకటేష్ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్ పార్థసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్ నిర్మాతలు.

ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్, అంజు అస్రాని తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా
ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్
సంగీతం: అనూప్ రూబెన్స్
కూర్పు: గౌతంరాజు
కళ: బ్రహ్మ కడలి.

హిందీ వెర్షన్ ఓ మై గాడ్‌లో హీరో అక్షయ్ కుమారు కోసం తయారు చేయించిన కస్టమైజ్డ్ చోపర్ స్టైల్ బైక్.

హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650

హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650

హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650


Click it and Unblock the Notifications








