పవన్ కళ్యాణ్ 'వారాహి' వాహనానికి గ్రీన్ సిగ్నెల్.. తెలంగాణలో రిజిస్ట్రేషన్ పూర్తి

ఇటీవల జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' ఎన్నికల ప్రచారానికి ఒక ప్రత్యేకమైన వాహనాన్ని తయారు చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వెహికల్ యొక్క కలర్ మీద కొన్ని అభ్యంతరాలు పుట్టుకొచ్చాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.. రండి.

సాధారణంగా భారతదేశంలో చాలామంది రాజకీయ నాయకులు మరియు రాజకీయ ప్రముఖులు ఎక్కువగా వైట్ కలర్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే జనసేన పార్టీ అధినేత మరియు తెలుగు సినీ నటుడు మాత్రం ఆలీవ్ గ్రీన్ కలర్ కలిగిన వాహనాన్ని ఉపయోగించడానికి సిద్ధమయ్యాడు. నిజానికి ఆలీవ్ గ్రీన్ కలర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ఈ కలర్ కేవలం ఇండియన్ ఆర్మీకి మాత్రమే పరిమితం.

పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి గ్రీన్ సిగ్నెల్

ఇండియన్ ఆర్మీ కోసం ప్రత్యేకించిన ఈ ఆలీవ్ గ్రీన్ కలర్ తన ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవడం వల్ల రాష్ట్రంలోని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అయితే పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో రీప్లే ఇస్తూ ఇటువంటి కలర్ కార్లు, బైకులు వినియోగంలో ఉన్నాయని, నేను మాత్రం ఎందుకు ఉపయోగించుకోకూడదు అని అడిగాడు. అయితే ఈ వాహనాన్ని తెలంగాణ రవాణా శాఖ పరిశీలించి చివరకు రిజిస్ట్రేషన్ కూడా చేసింది.

పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం అయిన 'వారాహి' రిజిస్ట్రేషన్‌పై ఎటువంటి అభ్యంతరాలు లేవని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధృవీకరించారు. ఈ వాహనం రిజిస్ట్రేషన్‌కు ముందు బాడీని క్షుణ్ణంగా పరిశీలించి అది 'ఎమరాల్డ్ గ్రీన్' రంగు కోడ్ 445C44 తో నిర్థారించారు. అయితే ఇండియన్ మిలిటరీ కలర్ ఆలీవ్ గ్రీన్ కోడ్ 7B8165. కావున రెండు కలర్స్ స్వల్ప వ్యత్యాసం ఉన్నట్లు తెలిసింది.

తెలంగాణ రవాణా శాఖ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లో కూడా అదే పేర్కొంది. అంతే కాకూండా 'వారాహి' అనేక సౌకర్యాలతో కూడిన ప్రైవేట్ ఉపయోగం కోసం వినియోగించే క్యాంపర్ వ్యాన్‌గా నమోదు చేయబడిందని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ధృవీకరించారు. అదే సమయంలో వారు ఈ వెహికల్ కలర్ మీద కూడా ఎటువంటి సమస్య లేదని క్షుణ్ణంగా నిర్థారించారు. మొత్తానికి వారాహి కలర్ గొడవ సద్దుమణిగింది.

ఇది వరకు చెప్పుకున్నట్లుగా వారాహి అనేది పవన్ కళ్యాణ్ యొక్క ఎన్నికల ప్రచార వాహనం. 2023 జనవరి నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్రలో ఇది ఉపయోగించనున్నారు. ఈ వాహనం ద్వారానే రాష్ట్రం మొత్తం పర్యటించనున్నారు. ఈ వాహనానికి వారాహి అని పేరు పెట్టడం వెనుక కూడా ఒక స్టోరీ ఉంది. సప్త మాతృకల్లో ఒకరైన వారాహి (దుర్గాదేవి) అమ్మవారు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ వాహనానికి వారాహి అని పేరు పెట్టారు.

వారాహి వాహనం చాలా కట్టుదిట్టమైన భద్రతలు కలిగి ఉంది. పవన్ కళ్యాణ్ కి భద్రతను అందించడంలో భాగంగానే ఇది మరింత దృఢంగా తయారుచేయబడింది. ఇందులో పవన్ కళ్యాణ్‌తో సహా మరో ముగ్గురు వ్యక్తులు కూర్చోవడానికి కావాల్సిన స్థలం ఉంటుంది. ప్రచార సమయంలో విద్యుత్ అంతరాయాన్ని నిరోధించడానికి ఇందులో లైటింగ్ సెటప్ మరియు సౌంత్ సిస్టం వంటి వాటితో పాటు రియల్ టైమ్ రికార్డింగ్ మరియు ప్లే ఫంక్షన్లతో కూడిన CCTV కెమెరాలు కూడా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి సంబంధించిన ఒక వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో వాహనం చుట్టూ బాడీ గార్డ్స్ నడుచుకుంటూ, వాహనానికి రెండువైపులా ఇద్దరు నిల్చుని ఉండటం గమనించవచ్చు. ఈ ప్రచార రథం సోషల్ మీడియాలో కనిపించగానే చాలామంది అభిమానులు అప్పుడే విజయం సాధించిన ఆనందాన్ని పొందుతున్నారు. అయితే ఏ రాష్ట్ర రాజకీయ ఫలితాలను ఎవరూ అప్పుడే నిర్దేశించే అవకాశం లేదు. ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, December 14, 2022, 15:16 [IST]
English summary
Pawan kalyans campaign vehicle varahi approves telangana transport minister
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+