ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన రోడ్డుపై ప్రయాణం 'ఫ్రీ' కాదు
వేగం అంటే చాలా మందికి ఇష్టమే. అలాంటి వారి కోసమే ప్రత్యేకంగా జర్మనీలో ఏర్పాటు చేయబడిన హై-స్పీడ్ రోడ్ నెట్‌వర్క్ 'ఆటోబాన్' (Autobahn). ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన రోడ్లలో కెల్లా అటోబాన్ మొట్టమది. కాగా.. ఇప్పటి వరకు విదేశీయులకు కూడా ఉచితంగా ఉన్న ఈ హై-స్పీడ్ రోడ్ ప్రవేశం ఇకపై కాస్ట్లీగా మారనుంది.
జర్మనీ 2016 నుంచి ఈ ఆటోబాన్ హై-స్పీడ్ రోడ్డు పైకి ప్రవేశించే అన్ని విదేశీ రిజిస్టర్డ్ వాహనాలకు టోల్ చార్జ్ వసూలు చేయాలని యోచిస్తోంది. ఈమేరకు ప్రతిపాదనలు కూడా చేశారు. తాజా ప్రతిపాదన ప్రకారం.. అన్ని కార్లు, అవి ఏ దేశంలో రిజిస్టరై ఉన్నాయన్న దానితో సంబంధం లేకుండా, రోడ్డును వాడుకున్నందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఏజెన్స్ ఫ్రాన్స్-ప్రెస్ (ఏఎఫ్‌పి) పేర్కొన్న సమాచారం ప్రకారం, పది రోజుల పాస్ కోసం 10 యూరోలు (14.50 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది, రెండు నెలల పాటు చెల్లుబాటులో ఉండే స్టిక్కర్ కోసం 20 యూరోలు (29 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. అదే సంవత్సరానికి సరిపడా పర్మిట్ తీసుకోవాలంటే 100 యూరోలు (145 డాలర్లు) చెల్లించాలి.

అయితే, ఇందుకు ఖచ్చితమైన ధర అనేది కారు వయస్సును బట్టి, దాని ఇంజన్ సామర్థ్యాన్ని మరియు కాలుష్య నిబంధన రేటింగ్‌ను బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ, ఈ కొత్త విధానం ద్వారా జర్మనీ ఈ ఆటోబాన్ రోడ్ నుంచి సంవత్సరానికి 600 మిలియన్ యూరోలు (870 మిలియన్ డాలర్లు) ఆదాయాన్ని ఆర్జించవచ్చని అంచనా.
ఇలా వచ్చిన ఆదాయాన్ని జర్మనీ అధికారులు తిరిగి రోడ్లపై వెచ్చించినున్నారు. ప్రస్తుత రోడ్లను ఇంకా మెరుగుపరచడం, కొత్త రోడ్లను ఏర్పాటు చేయటం వంటి పనుల కోసం ఉపయోగిస్తారు. కాగా.. జర్మనీలో రిజిస్టర్ అయిన వాహనాల విషయంలో వసూలు చేసిన రుసుము, వాహన పన్ను రాయితీ రూపంలో తిరిగి వారికే ఇచ్చేయనున్నారు.


Click it and Unblock the Notifications








