ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్! ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సల్.. ఇన్సూరెన్స్ డబుల్..

భారతదేశంలో రోడ్డు భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారికి కఠినమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం పలు ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే జరిమానాలు విధించడం మాత్రమే ఉండగా, ఇప్పుడు మరింత కఠినమైన చర్యలను తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం, ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన ఇ-చలాన్లు చెల్లించనట్లయితే, సంబంధిత వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేసే విధానం అమల్లోకి రావచ్చు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త డ్రాఫ్ట్ నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇంతకుముందు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఫైన్ విధించే వారు.

అయితే చాలా మంది వీటిని తరువాత కట్టుదాం అనే ధోరణిలో ఉండేవారు. దేశవ్యాప్తంగా వసూలు కాని చలాన్లు భారీగానే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రికవరీ సానుకూలంగా ఉండగా, మరికొన్పి రాష్ట్రాల్లో అయితే ఎవరు ఇ-చలాన్లు కట్టడానికి ముందుకు రావట్లేదు. దీంతో ట్రాఫిక్ నియంత్రణను మరింత కఠినతరం చేయడానికి ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఇప్పుడు కొత్త ముసాయిదా చట్టాన్ని ప్రవేశపెట్టింది.

Pending E Challans Not Paid

ప్రస్తుత నిబంధనల ప్రకారం, ట్రాఫిక్ చలాన్లు చెల్లించకపోతే వాహనదారులు కేవలం లేటు ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. అయితే, కొత్త ముసాయిదా నియమాల ప్రకారం, వాహన యజమానులు మూడునెలల్లోపు తమ ఇ-చలాన్లను చెల్లించకపోతే, వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయడం జరుగుతుంది. చలాన్ జారీ చేసిన మూడు నెలల్లోపు ఈ-చలాన్‌లో డబ్బు చెల్లించడం తప్పనిసరి అని కొత్త ముసాయిదా చట్టం పేర్కొంటుంది. ఆలస్యం చేస్తే వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తారు.

అలగే, ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు సార్లు రెడ్ సిగ్నల్ దాటడం లేదా ప్రమాదకరమైన డ్రైవింగ్ చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్‌ను కనీసం మూడు నెలల పాటు సస్పెండ్ చేయనున్నారు. దీని వల్ల వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. మరో విషయం ఏమిటంటే, వాహన ఇన్సూరెన్స్ ప్రీమియంను ట్రాఫిక్ చలాన్లతో అనుసంధానించాలని కూడా ఈ కొత్త నిబంధనలు సూచిస్తున్నాయి.

Pending E Challans

అంటే, గత ఆర్థిక సంవత్సరంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇ-చలాన్లు పెండింగ్‌లో ఉంటే, వాహన యజమానులు ఎక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంబధనలతో రోడ్డు భద్రతను మెరుగుపరిచే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ, వాహనదారులపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం కనిపిస్తోంది. కానీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా జరిమానాల నుంచి బయటపడవచ్చు.

ఇంతకుముందు, కొన్ని నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ, వాహనదారులు జరిమానా చెల్లించకుండా తప్పించుకునే పరిస్థితి ఉండేది. అయితే, కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, ట్రాఫిక్ చలాన్లను నిర్లక్ష్యం చేస్తే కేవలం అధిక మొత్తంలో జరిమానాలు మాత్రమే కాదు, డ్రైవింగ్ హక్కును కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. డేటా ప్రకారం, కొన్ని రాష్ట్రాలు ట్రాఫిక్ చలాన్ల రికవరీ రేటులో ముందంజలో ఉన్నాయని, మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం వెనుకబడి ఉన్నాయి.

New Traffic Rules

చలాన్ల రికవరీ పరంగా, దేశ రాజధాని ఢిల్లీలో కేవలం 14 శాతం ఈ-చలాన్లే వసూలు చేయబడ్డాయి. తరువాత కర్ణాటక 21 శాతం, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలో పరిస్థితి కొంచెం మెరుగ్గా 27 శాతం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో మాత్రం ఈ-చలాన్ల వసూలు శాతం 62-76% వరకు ఉంది. ఇక తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కూడా చలాన్ల రికవరీ డ్రైవ్స్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 1, 2025, 17:25 [IST]
English summary
Pending e challans if not paid govt suspend the driving licenses new rule drafted central
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+