రాంగ్ రూట్‌లో వెళ్లకుండా టైర్ కిల్లర్స్ ఏర్పాటు.. ఈ లాజిక్‌తో అదే రూట్‌లో దర్జాగా ప్రయాణం..!
సమయంలో కలిగి వస్తుందని, దూరం తగ్గుతుందనే ఉద్దేశంతో కొందరు వాహనదారులు రాంగ్ రూట్‌లలో ప్రయాణం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన వీడియోల ఆధారంగా జరిమానాలు విధిస్తున్నా కొందరు వాహనదారుల్లో మార్పు రావడం లేదు.
ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులు వినూత్న చర్యలు చేపడుతున్నారు. ఎవరైతే రాంగ్ రూట్‌లో ప్రయాణం చేస్తారో వారి వాహన టైర్లు డ్యామేజీ అయ్యే విధంగా టైర్ల కిల్లర్‌లను రోడ్లపై ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ తరహా టైర్ల్ కిల్లర్‌లు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఇస్కార్ ప్లైఓవర్ ప్రమాదం తర్వాత.. రాంగ్ రూట్‌లో ప్రయాణించే వాహనదారులపై అధికారులు చర్యలు ప్రారంభించారు. నగరంలోని చాలా ప్రాంతాల్లోని రోడ్లపై టైర్ కిల్లర్‌లను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టైర్ కిల్లర్ వంటి చిన్న పరికరాలతో ప్రజలు రాంగ్ రూట్‌లలో ప్రయాణించకుండా నియంత్రించడం వీలుకాదని తెలుస్తోంది. అయితే ఈ టైర్ కిల్లర్‌లను అమర్చినా వాహనదారులు దర్జాగా రాంగ్ రూట్‌లోనే ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ టైర్ కిల్లర్‌లోని లొసుగులను తెలుసుకున్న ప్రయాణికులు ఎప్పటిలాగే రాంగ్ రూట్‌లోనే ప్రయాణం చేస్తున్నారు.
బైక్ రైడర్లు.. టైర్ కిల్లర్ మధ్య ఉన్న గ్యాప్‌లో నుంచి తమ వాహన టైర్లు వెళ్లేలా చూసుకుంటున్నారు. ఫలితంగా రాంగ్ రూట్‌లోనే వెళ్లిపోతున్నారు. అయితే కార్లు, ఆటో డ్రైవర్లు కూడా టైర్ కిల్లర్ కారణంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. సరిగ్గా టైర్ కిల్లర్ వద్దకు వచ్చేసరికి వాహనాలను నెమ్మదిగా డ్రైవింగ్ చేస్తున్నారు. ఫలితంగా టైర్లు దెబ్బతినకుండా దర్జాగా రాంగ్ రూట్‌లో ప్రయాణం చేస్తున్నారు.
భారత్‌లో అహ్మదాబాద్‌లోనే కాకుండా.. ఈ తరహా టైర్ కిల్లర్లు నోయిడా, పూణే, ముంబయి సహా మరిన్ని నగరాల్లో ఏర్పాటుచేశారు. అయితే ఈ టైర్ కిల్లర్లు పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. కొన్ని చోట్ల వీటిని ధ్వంసం చేసి లేదా వాటి లొసుగులు తెలుసుకొని.. దర్జాగా అదే రూట్‌లో ప్రయాణం చేస్తున్నారు.
గుజరాత్‌లో ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. లగ్జరీ జాగ్వార్ కారు.. ఓ రోడ్డుపై వెళ్తున్నవారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. మరియు 13 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం, అధికారులపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘిస్తున్నవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ట్రాఫిక్ నియమాలను ఎందుకు సక్రమంగా అమలుచేయలేకపోతున్నారని ప్రశ్నించింది. దీంతో అధికారులు టైర్ కిల్లర్లను ఏర్పాటుచేశారు.
2018 సంవత్సరంలో పూణే ట్రాఫిక్ పోలీసులు రాంగ్ రూట్‌లో రాకపోకలు నిరోధించడానికి అమనోరా టోన్‌షిప్ సమీపంలో టైర్ కిల్లర్లను ఏర్పాటుచేశారు. అనంతరం వాటిని ప్రమాదకరంగా భావించి తొలగించారు. నోయిడా పోలీసులు కూడా నగరం చుట్టు హెవీ ట్యూటీ టైర్ కిల్లర్లను ఏర్పాటుచేశారు. వాహనదారులు వాటి పైనుంచి వెళ్లకుండా భారీ సంకేతాలను కూడా అమర్చారు. అయితే ఆ టైర్ కిల్లర్ల మీదుగా భారీ వాహనాలు ప్రయాణించడం వల్ల అవి కాస్త డ్యామేజీ అయ్యాయి. దీంతో నోయిడాలో టైర్ కిల్లర్లు లేవు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








