బెంగళూరు - ఉత్తర కొరియాకు ఓలా క్యాబ్: 3.55 లక్షల బిల్లుతో ఖంగుతిన్న కస్టమర్

మొబైల్ ఆధారిత దిగ్గజ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా క్యాబ్స్ గత కొంత కాలంగా సాంకేతిక సమస్యలను ఎదుర్కుంటోంది. ఓ కస్టమర్ ఓలా మొబైల్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేయడానికి ప్రయత్నించగా ఏకంగా ఉత్తర కొరియాకు క్యాబ్ బ

By Anil Kumar

మొబైల్ ఆధారిత దిగ్గజ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా క్యాబ్స్ గత కొంత కాలంగా సాంకేతిక సమస్యలను ఎదుర్కుంటోంది. ఓ కస్టమర్ ఓలా మొబైల్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేయడానికి ప్రయత్నించగా ఏకంగా ఉత్తర కొరియాకు క్యాబ్ బుక్ అయ్యింది.

బెంగళూరు నుండి కొరియాకు ఓలా క్యాబ్

అంతే కాకుండా, మొబైల్ యాప్ ఆధారిత ఓలా క్యాబ్ సర్వీస్ ట్రిప్ వివరాలు, షెడ్యూల్, 3.55 లక్షల రుపాయల బిల్లుతో పాటు బుక్ చేసుకున్న ట్రిప్పుకు ఖరారు అయిన కారు మరియు డ్రైవర్ వివరాలను కూడా పంపించి కస్టమర్‌ను షాక్‌కు గురి చేసింది.

క్యాబ్ బుక్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి రోహిత్ మెండా ఫోన్ నుండి తీసుకున్న స్క్రీన్ షాట్ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. బెంగళూరు నుండి ఉత్తర కొరియాలోని దక్షిణ యోంగాన్ నగరానికి ట్రిప్ ఖాయమైనట్లు స్క్రీన్ షాట్ ఫోటోల ద్వారా గమనించవచ్చు.

బెంగళూరు నుండి కొరియాకు ఓలా క్యాబ్

అంతే కాకుండా, డ్రైవర్ వివరాలు, ట్రిప్ షెడ్యూల్ అయిన సమయం, ట్రిప్ స్టార్ట్ అయ్యే సమయం, కారు వివరాలు మరియు ట్రిప్ ధర వంటి ప్రాథమిక వివరాలను కూడా ఓలా క్యాబ్స్ కస్టమర్‌కు పంపించింది.

బెంగళూరు నుండి కొరియాకు ఓలా క్యాబ్

కస్టమర్ ఈ ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకోవడంతో ఓలా వెంటనే స్పందించింది. సాంకేతికంగా సమస్య కారణంగా ఇలా జరిగినట్లు వివరణ ఇచ్చుకుంది. అంతే కాకుండా, ఈ సమస్యను సంభందిత బృందానికి పంపించినట్లు కూడా తెలిపింది.

బెంగళూరు నుండి కొరియాకు ఓలా క్యాబ్

కేవలం రోహిత్ మెండానే కాదు, క్యాబ్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించిన ఇంకా ఎంతో మంది కస్టమర్లు వివిధ అంతర్జాతీయ గమ్యాలకు రోడ్ ట్రిప్ ఖరారు అయినట్లు పొందిన మెసేజ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Recommended Video

Do Airplanes Have A Reverse Gear? - DriveSpark
బెంగళూరు నుండి కొరియాకు ఓలా క్యాబ్

ఓలా క్యాబ్స్ టెక్నికల్ టీమ్ వెంటనే ఈ సమస్యను పరిష్కరించింది. ఇండియా నుండి పలు అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఉన్న క్యాబ్ సర్వీస్ ఆప్షన్లను వెంటనే తొలగించింది. క్యాబ్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించిన కస్టమర్లకు కొద్దిసేపు ఇబ్బందులు తప్పలేదు.

బెంగళూరు నుండి కొరియాకు ఓలా క్యాబ్

ఇలా జరగడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో ముంబాయ్‌కి చెందిన ఓ కస్టమర్ ఉబర్ ట్యాక్సీ బుక్ చేసుకోగా, అరేబియా సముద్రంలోని ఓ దీవిలో కారు ఉన్నట్లు చూపించింది. అరేబియా సముద్రం నుండి కారు కస్టమర్ పాయింట్ వద్దకు వస్తున్నట్లు కూడా రోడ్డు మ్యాప్ చూపించింది.

బెంగళూరు నుండి కొరియాకు ఓలా క్యాబ్

ఉత్తర కొరియానే కాదు, అమెరికాలోని న్యూ యార్క్, లండన్ ఇంకా ఎన్నో దేశాలకు ఓలా క్యాబ్ మొబైల్ యాప్‌లో గమ్యస్థానాలను చూపించింది. ఒక కస్టమర్‌కు ఏకంగా 3.55 లక్షల బిల్లు వచ్చింది.అయితే, ఈ సమస్య ఓలా కస్టమర్ సర్వీస్ దృష్టికి వెళ్లడంతో సమస్య కాస్త సద్దుమనిగింది.

బెంగళూరు నుండి కొరియాకు ఓలా క్యాబ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు అంతర్జాతీయ నగరాలకు వెళ్లాలని చాలా మంది కళలు కంటుంటారు. అయితే, సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్న ఓలా క్యాబ్స్ దాదాపు విదేశాలకు వెళ్లాలనుకునే వారి కళలను నిజం చేసిందని చెప్పవచ్చు....!

Most Read Articles

English summary
Read In Telugu: Person books ola cabs from bangalore north korea gets billed rs 1.49 lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X