ఊపిరాడక కారులో చనిపోయిన పెంపుడు కుక్క.. కారులో లాక్ చేసి 'తాజ్ మహల్' చూడటానికి వెళ్లిన ఓనర్, తిరిగి వచ్చేసరికి
రోడ్డు పైన నిత్యం ప్రమాదాలు జరగడం చూస్తూనే ఉంటాం. ఇతరులు చేసిన తప్పిదానికి అనవసరంగా అమాయకులు బలైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది మనుషులకే కాదు, పెంపుడు జంతువులకు కూడా వర్తిస్తుంది. అందుకు ఉదాహరణే.. ఆగ్రాలో జరిగిన ఓ విషాదకర సంఘటన, పూర్తి వివరాల్లోకి వెళితే..
చాలాసార్లు ఎవరో చేసిన తప్పునకు మరొకరు శిక్ష అనుభవించాల్సి రావడం చాలా ఆవేదనను కలిగిస్తుంది. యజమాని చేసిన తప్పిదానికి తన పెంపుడు కుక్క ఒకటి ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనకు కారకులైన యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

హర్యానాకు చెందిన ఓ కుటుంబం తాజ్ మహల్ చూసేందుకు ఆగ్రాకు వెళ్లారు. కారులో తమతోపాటు పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్లారు. అయితే పర్యాటక ప్రాంతాలకు పెంపుడు జంతువులను తీసుకురాకూడదని నియమం ఉన్నప్పటికీ, ఆ కుటుంబ సభ్యులు తమ పెంపుడు కుక్కను తమతో పాటు కారులో తీసుకువచ్చారు.
ఆ సమయంలో తాజ్‌మహల్‌ను చూసేందుకు వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యులు తమ పెంపుడు కుక్కను కారులో వదిలేసి డోర్ లాక్ చేసి సందర్శనకు వెళ్లిపోయారు. ఈ సందర్భంలో కుక్క ఒక్కటే కారులో ఉండిపోయింది. కారు అద్దాలు మూసివేసి ఉండటంతో ఊపిరి ఆడకపోవడంతో ఆ శునకం చనిపోయినట్లుగా తెలుస్తోంది.

అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ సంఘటనను గమనించి తన మొబైల్‌లో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. కుక్క యజమానిపై విపరీతంగా నిప్పులు చెరుగుతున్నారు. పెంపుడు జంతువు ఇంత క్రూరంగా చనిపోయేలా చేసిన అతనికి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
ఈ దుర్ఘటన తర్వాత ట్విటర్‌లో ఈ వీడియో చక్కర్లు కొడుతుండగా, ఆ వీడియోలో కుక్క చనిపోయినట్లు కనిపిస్తోంది. హర్యానా రిజిస్ట్రేషన్ ఉన్న హ్యుందాయ్ కారు వెనుక సీటు కింద ఓ కుక్క ఊపిరాడక చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఎండకు కారులోనే ఊపిరాడక శునకం చనిపోయినట్లుగా నిర్ధారణ అయింది.
అమీర్ ఖాద్రీ అనే వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి ఆగ్రా, ఉత్తరప్రదేశ్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ కారు తాజ్ మహల్ పశ్చిమ ద్వారం వద్ద పార్క్ చేయబడింది. అంతే కాకుండా కారు నంబర్ వీడియోలో కనిపిస్తోంది. దీనిపై పోలీసులు స్పందిస్తే.. ఇది పోలీసుల దర్యాప్తులో సహాయపడుతుంది. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








