దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా.. ఎంత ధర తగ్గే అవకాశం ఉంది.. ప్రకటన ఎప్పుడు?
దేశంలో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు ( Petrol and Diesel Prices ) తగ్గనున్నాయని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుందని సమాచారం. అయితే ప్రకటన ఎప్పుడు వస్తుందనే విషయం వెల్లడి కాలేదు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. లీటర్ పెట్రోల్, డీజిల్ ధర రూ.10 చొప్పున తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.
స్థిరంగా ముడి చమురు ధరలు : భారత్‌లో సాధారంగా చమురు సంస్థలు రోజువారి ధరలను సవరించి వెల్లడిస్తాయి. అయితే గత కొన్ని నెలలుగా ఈ ధరల్లో ఎటువంటి వ్యత్యాసం లేదు. అయితే గత మూడు నెలలుగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 70-80 డాలర్లుగా ఉంది. ఫలితంగా వాటి ఆధారంగా ఇంధన ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

రష్యా- ఉక్రెయిన్ యుద్దం కారణంగా : రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో చమురు సంస్థలు పెట్రోల్‌పైన రూ.17, లీటర్ డీజిల్‌పైన రూ.35 చొప్పున నష్టపోయినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆయా సంస్థలు లీటర్ పెట్రోల్‌పైన రూ.8-10, అదే లీటర్ డీజిల్‌పైన రూ.3-4 వరకు లాభం పొందుతున్నట్లు తెలుస్తోంది.
లాభాల్లో ప్రభుత్వ ఇంధన సంస్థలు : ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇంధన సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా లాభాలు సంపాదించినట్లు తెలుస్తోంది.

పెట్రోల్, డీజిల్ ప్రస్తుత ధరలు : ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, లీటర్ డీజిల్ ధర రూ.94.27గా ఉంది. అదే హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, అదే లీటర్ డీజిల్ ధర రూ.97.82గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.10గా ఉంది. అదే డీజిల్ ధర రూ.97.29గా ఉంది.
ఏపీలో ప్రస్తుతం ఇంధన ధరలు : అదే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.92గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.99.65గా ఉంది. విశాఖపట్టణంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.92 గా ఉంది. అదే లీటర్ డీజిల్ ధర రూ.99.65గా ఉంది. అదే తిరుపతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.16గా ఉంది. అదే లీటర్ డీజిల్ ధర రూ.98.90గా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








