నీరజ్ పేరున్న ప్రతి ఒక్కరికీ రూ. 501 పెట్రోల్ ఫ్రీ; ఎక్కడో తెలుసా?

టోక్యో ఒలింపిక్స్‌లో జరిగిన జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించి భారతదేశానికి ఎనలేని కీర్తి తెచ్చిన భారతీయ అథ్లెట్ దిగ్గజం నీరజ్ చోప్రా. గోల్డ్ మెడల్ కైవసం చేసుకోటంతో కొత్త రికార్డ్ సృష్టించాడు. భారతదేశానికి వన్నె తెచ్చిన చోప్రాకు దేశం మొత్తం ఉవ్వెత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా చోప్రాకు చాలా రివార్డ్స్ లభించడంతో పాటు, అనేక బహుమతులు కూడా అందుతున్నాయి.

నీరజ్ పేరున్న ప్రతి ఒక్కరికీ రూ. 501 పెట్రోల్ ఫ్రీ; ఎక్కడో తెలుసా?

ఇందులో భాగంగానే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రెసిడెంట్ ఆనంద్ మహీంద్రా త్వరలో విడుదల చేయనున్న కొత్త ఎక్స్‌యూవీ 700 కారును నీరజ్ చోప్రాకు గిఫ్ట్ గా అందించనున్నట్లు తెలిపారు. నీరజ్ చోప్రా సాధించిన విజయానికి యావత్ భారతదేశంలోని భారతీయులు అందరూ సంబరాలు చేసుకుంటున్నారు.

నీరజ్ పేరున్న ప్రతి ఒక్కరికీ రూ. 501 పెట్రోల్ ఫ్రీ; ఎక్కడో తెలుసా?

ఇప్పుడు గుజరాత్‌లోని పెట్రోల్ బంక్ యజమాని నీరజ్ చోప్రా విజయాన్ని మరో కొత్త పద్దతిలో సంబరాలు జరుపుకున్నారు. నివేదికల ప్రకారం, గుజరాత్‌లోని బరూచ్ సమీపంలోని నీడ్రాంగ్ నగర్ ఎస్ పి అనే పెట్రోల్ బంక్ ఉంది. ఈ పెట్రోల్ బంక్ యజమాని అయూబ్ పఠాన్.

నీరజ్ పేరున్న ప్రతి ఒక్కరికీ రూ. 501 పెట్రోల్ ఫ్రీ; ఎక్కడో తెలుసా?

అయూబ్ పఠాన్ నీరజ్ చోప్రా విజయాన్ని కొత్త పద్దతిలో జరుపుకుని పొంగిపోయాడు, ఇందులో భాగంగానే నీరజ్ అనే పేరు ఉన్న వారికి రూ. 501 పెట్రోల్ ఉచితంగా అందించబడుతుంది. ఈ ఆఫర్‌ను ఆగస్టు 9, తన ఎస్ పి పెట్రోల్ బంక్‌లో కేవలం ఒక రోజు అందుబాటులో ఉంచాడు.

నీరజ్ పేరున్న ప్రతి ఒక్కరికీ రూ. 501 పెట్రోల్ ఫ్రీ; ఎక్కడో తెలుసా?

ఈ ఆఫర్ ప్రకటించిన వెంటనే చాలామంది నీరజ్ పేరున్న వ్యక్తులు SP పెట్రోల్ బంకర్ వద్దకు వెళ్లి ఉచిత పెట్రోల్ అందుకున్నారు. వారి పేరు నీరజ్ అని నిరూపించడానికి వారు కొన్ని డాక్యుమెంట్స్ చూపించవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో, చాలామంది ఆధార్ కార్డు వంటి పత్రాలను చూపించి 501 పెట్రోల్ అందుకున్నారు.

నీరజ్ పేరున్న ప్రతి ఒక్కరికీ రూ. 501 పెట్రోల్ ఫ్రీ; ఎక్కడో తెలుసా?

పెట్రోల్ బంక్ యాజమాన్యం తెలిపిన సమాచారం ప్రకారం, నీరజ్ పేరు కలిగిన 30 మందికి పైగా వ్యక్తులు సరైన పత్రాలను చూపించి ఉచితంగా పెట్రోల్ అందుకున్నారు. SP పెట్రోల్ బంక్ యజమాని అయూబ్ పఠాన్ అందరి దృష్టిని ఆకర్షించారు. దీనిపై అయూబ్ పఠాన్ స్పందిస్తూ, భారతదేశం గర్వపడేలా చేసిన నీరజ్ చోప్రాకు నివాళి అర్పించడమే నా ఉద్దేశం అన్నారు.

నీరజ్ పేరున్న ప్రతి ఒక్కరికీ రూ. 501 పెట్రోల్ ఫ్రీ; ఎక్కడో తెలుసా?

ఈ కారణంగానే తాను 501 రూపాయల ఉచిత పెట్రోల్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ ఆఫర్ నుండి ప్రయోజనం పొందిన ప్రతి ఒక్కరూ సంతోషిస్తున్నారు. ఈ పెట్రోల్ బంక్ ధర రూ. 501 ల ఉచిత పెట్రోల్ పొందిన నీరజ్ అనే వ్యక్తులు తన బంధువులకు కూడా సమాచారం అందించారు.

నీరజ్ పేరున్న ప్రతి ఒక్కరికీ రూ. 501 పెట్రోల్ ఫ్రీ; ఎక్కడో తెలుసా?

ఈ ప్రకటన మొదట్లో అబద్ధం అని అనుకున్నారు. అయితే నీరజ్ అనే పేరుగల వ్యక్తులు సరైన డాక్యుమెంట్స్ చూపించి పెట్రోల్ పొందిన తర్వాత చాలామంది ఇక్కడకు వచ్చారని ఆయన చెప్పారు. భారతదేశంలో పెట్రోల్ ధరలు పెరిగినప్పటికీ, ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాకు నివాళి అర్పించడానికి అయూబ్ పఠాన్ చొరవ తీసుకోవడం గమనార్హం.

నీరజ్ పేరున్న ప్రతి ఒక్కరికీ రూ. 501 పెట్రోల్ ఫ్రీ; ఎక్కడో తెలుసా?

భారతదేశంలో పెట్రోల్ ధరలతో పాటు డీజిల్ ధరలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. అటువంటి సందర్భంలో రూ. 501 ల పెట్రోల్‌ను ఉచితంగా ఇవ్వడం నిజంగా పెద్ద విషయం. భారతదేశంలో ఉచితంగా పెట్రోల్ అందించే అనేక సంఘటనలు ఉన్నాయి.

నీరజ్ పేరున్న ప్రతి ఒక్కరికీ రూ. 501 పెట్రోల్ ఫ్రీ; ఎక్కడో తెలుసా?

గతంలో మీరు కేక్ కొంటే పెట్రోల్ ఫ్రీ మరియు బిర్యానీ కొంటే పెట్రోల్ ఫ్రీ అనే వివిధ ఆఫర్లు ఉండేవి. పెట్రోల్ ధరలు పెరగడంతో ఈ రకమైన ఆఫర్ అందించబడుతోంది. కొన్ని వివాహ వేడుకలు వధూవరులకు బహుమతిగా పెట్రోల్ మరియు డీజిల్ అందిస్తున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు.

నీరజ్ పేరున్న ప్రతి ఒక్కరికీ రూ. 501 పెట్రోల్ ఫ్రీ; ఎక్కడో తెలుసా?

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి కానీ పూర్తి ప్రయోజనాలు భారతీయ వాహనదారులకు అందుబాటులో లేవు. దీనికి కారణం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఎక్కువ టాక్సులు. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఎక్కువవుతున్న కారణంగా ఎక్కువమంది వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువమంది వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతున్న కారణంగా వాహనా తయారీదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయ మార్కెట్లో విడుదల చేస్తున్నారు.

Most Read Articles

English summary
Petrol bunk owner gives free fuel to people who has the name neeraj details
Story first published: Wednesday, August 11, 2021, 11:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X