రూ. 115 కి చేరిన ఇంధన ధరలు: దేశంలో ఈ రోజు ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

భారతదేశంలో గత కొన్ని రోజులుగా వరుసగా పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈరోజు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తారా స్థాయికి చేరాయి. ఇంధన కంపెనీలు వరుసగా ఆరో రోజు రిటైల్ ఇంధన ధరలను భారీగా పెంచేసాయి. తాజా నివేదికల ప్రకారం ధరల పెరుగుదల తరువాత ఈ రోజు కలకత్తా నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110 కి చేరుకోగా, దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ. 115 కి చేరింది.

రూ. 115 కి చేరిన ఇంధన ధరలు: దేశంలో ఈ రోజు ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

అయితే భారత రాజధాని నగరం ఢిల్లోలో ఈ రోజు పెట్రోల్ ధర ధర 35 పైసలు పెరిగి, లీటరుకు పెట్రోల్ ధర రూ.109.34 చేరింది. అదేవిధంగా డీజిల్ ధర ఢిల్లీలో రూ. 98.07 కు చేరింది. అదేవిధంగా ముంబైకి విషయానికి వస్తే, ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. రూ.115.15 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 106.23 కు చేరింది.

రూ. 115 కి చేరిన ఇంధన ధరలు: దేశంలో ఈ రోజు ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

ధరల పెరుగుదల తరువాత కలకత్తా నగరంలో ఇప్పుడు లీటరు పెట్రోల్ ధర రూ. 110.15 కు చేరింది. ఇక డీజిల్ ధరల విషయానికి వస్తే, లీటరు డీజిల్ ధర రూ. 101.56 కు పెరిగింది. ఇక తమిళనాడు (చెన్నై) లో లీటరు పెట్రోల్ ధర రూ. 106.35 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 102.59 గా ఉంది.

రూ. 115 కి చేరిన ఇంధన ధరలు: దేశంలో ఈ రోజు ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

తెలుగు రాష్ట్రమైన తెలంగాణ హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర ఈ రోజు రూ. 114.12 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 107.4 కి చేరింది. ఇక బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.113.15కు విక్రయిస్తుండగా, డీజిల్ ధర రూ. 104.09కి పెరిగింది. అయితే రాజస్థాన్ సరిహద్దు పట్టణమైన శ్రీ గంగానగర్‌లో పెట్రోలు-డీజిల్ అత్యధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇక్కడ పెట్రోలు ధర లీటరుకు రూ. 121.62 అనూహ్య స్థాయికి చేరుకుంది, అయితే డీజిల్ ధర లీటరు రూ. 112.52 కి చేరి, దేశంలోని అనేక ప్రధాన నగరాల్లోకంటే ఎక్కువగా ఉంది.

రూ. 115 కి చేరిన ఇంధన ధరలు: దేశంలో ఈ రోజు ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

సెప్టెంబర్ 28 నుంచి పెట్రోల్ ధర 25 రెట్లు పెరగడంతో లీటరుకు రూ. 8.15 పెరిగింది. సెప్టెంబర్ 24 నుంచి ఇప్పటి వరకు 28 పెంపుదలలో డీజిల్ ధర లీటరుకు రూ. 9.45 పెరిగింది. ఈ ఏడాది మే 4 మరియు జూలై 17 మధ్య, భారతదేశంలో పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 11.44 పెరగగా, డీజిల్ ధర 10 వారాల్లో రూ. 9.14 పెరిగింది.

రూ. 115 కి చేరిన ఇంధన ధరలు: దేశంలో ఈ రోజు ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

రోజురోజుకి చమురు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి, అయితే ఈ పెరుగుదలకు కారణం ఏంటి అనే విషయాన్ని వస్తే,

గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ఒక బ్యారెల్ ధర రూ. $ 85 కి చేరుకుందని, దీని కారణంగా ఇంధన రిటైల్ ధర నిరంతరం పెరుగుతోందని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తుంది. రోజురోజకి పెరుగుతున్న ఇంధన ధరల నుంచి ఉపశమనం కోసం భారత ప్రభుత్వం సౌదీ అరేబియా, రష్యా వంటి చమురు ఎగుమతి దేశాలతో చర్చలు జరుపుతోంది.

రూ. 115 కి చేరిన ఇంధన ధరలు: దేశంలో ఈ రోజు ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

అయితే, ఈ చర్చలు ఇప్పటివరకు ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు, ఒక వేళా ఈ చర్చలు సఫలమైతే దేశంలో ఇంధన ధరలు బాగా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే దీనిపై ఎటువంటి స్పందన రాలేదు, కావున ఇంధన ధరలు తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

రూ. 115 కి చేరిన ఇంధన ధరలు: దేశంలో ఈ రోజు ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

మీ నగరంలో లేటెస్ట్ పెట్రోల్ మరియు డీజిల్ ధరలను టెస్ట్ చేయడం ఎలా?

రోజురోజుకి అమాంతం ధరలు పెరుగుతున్న సమయమూ ఏ నగరంలో ఎంత ధర ఉంది అని మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ పెట్రోల్ మరియు డీజిల్ ధరలను కనుగొనడం చాలా సులభం. మీరు ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ నుండి రోజువారీ ఇంధన ధరలను కూడా సులభంగా తెలుసుకోవచ్చు.

రూ. 115 కి చేరిన ఇంధన ధరలు: దేశంలో ఈ రోజు ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

తాజా ఇంధన ధరలను తెలుసుకోవడానికి మీరు ఇండియన్ ఆయిల్ SMS సర్వీస్ మొబైల్ నంబర్ 9224992249కి SMS పంపి తెలుసుకోవచ్చు. లేదా మెసేజ్ ద్వారా తాజా ధరలను తెలుసుకోవడానికి, మెసేజ్ బాక్స్‌లో - RSPPetrol Pump Dealer Code అని టైప్ చేయండి. మీరు ఇంటర్నెట్‌ని సందర్శించడం ద్వారా మీ ప్రాంతం యొక్క RSP కోడ్‌ని తనిఖీ చేయవచ్చు. సందేశం పంపిన తర్వాత, పెట్రోల్ మరియు డీజిల్ తాజా ధర గురించి మీకు తెలియజేయబడుతుంది. ఇది ఆ రోజు ధరలను మీకు తెలుపుతుంది.

రూ. 115 కి చేరిన ఇంధన ధరలు: దేశంలో ఈ రోజు ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

భారతదేశంలో రోజురోజుకి పెరుగుతున్న ఇంధన ధరలు సాధారణ ప్రజలకు చాలా భారాన్ని మోపుతోంది. అయితే ఈ సమయంలో ఇంధన ధరల నుంచి కొంత ఉపశమనం పొందటానికి ఇప్పుడు ఎక్కుమంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో సాధార వాహనాల వినియోగం కంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎక్కువగా ఉంటుంది.

Most Read Articles

English summary
Petrol diesel price hike latest price delhi mumbai kolkata details
Story first published: Monday, November 1, 2021, 14:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X