వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు

భారతదేశంలో రోజురోజుకి పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న సోమవారం ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం మళ్ళీ వరుసగా ఐదవ వారంలో పెరిగాయి. ఈ ధరల పెరుగుదల కారణంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ. 100 దాటింది.

వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు

ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు విడుదల చేసిన ధర నోటిఫికేషన్ ప్రకారం లీటరు పెట్రోల్ ధర ఇప్పుడు 26 పైసలు, లీటర్ డీజిల్ ధర 33 పైసలు వరకు పెరిగింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు 18 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలను ఏ మాత్రం పెంచలేదు.

వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు

కానీ ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీయే ఎన్నికలు ముగిశాక పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ప్రారంభమైంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వరుసగా ఇది ఐదవరోజు. మహారాష్ట్రలోని పర్భానిలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 100.20 గా ఉంది. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 100 దాటింది.

MOST READ:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి

వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వ్యాట్ మరియు సరుకు వంటి స్థానిక పన్నులను బట్టి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. గత ఒక వారంలో పెట్రోల్ ధర లీటరుపై రూ. 1.14, డీజిల్ ధర లీటరుపై రూ. 1.33 పెరిగినట్లు తెలిసింది. ఈ ధరలు సామాన్యుడిపై పెనుభారాన్ని మోపనున్నాయి.

వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు

ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మారుతాయి. కావున ఉదయం 6 నుండి కొత్త ధరలు అమలులోకి వస్తాయి. ఎక్సైజ్ టాక్స్ మరియు ఇతర టాక్స్ కలిపిన తరువాత పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచబడతాయి. వీటన్నిటిని కలిపిన తర్వాత కొత్త ధర అమల్లోకి వస్తుంది.

MOST READ:ఆనంద్ మహీంద్రా ట్వీట్; బహుశా.. ఇదోరకమైన సామజిక దూరమేమో

వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు

దేశంలో అనేక పన్నుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అంతే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో విదేశీ మారక రేట్లు మరియు ముడి చమురు ధరల ఆధారంగా రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి. ఇవన్నీ ఈ పెరిగే ధరలపై ప్రభావితమవుతాయి.

వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు

ప్రతి రోజూ పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలను ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం, పెట్రోల్ మరియు డీజిల్ ధర తెలుసుకోవటానికి, మొబైల్‌లో ఆర్‌ఎస్‌పి టైప్ చేసి, సిటీ పిన్ కోడ్ ఎంటర్ చేసి 9224992249 కు ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా పెరిగిన పెట్రోల్ ధరలు తెలుస్తాయి.

MOST READ:గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 118 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం, ఇంకో 20 స్టేషన్స్ అక్కడ కూడా..

వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు

ఒక పక్క కరోనా మహమ్మారి మరో పక్క పెరుగుతున్న పెట్రోల్ ధరలు ప్రజలకు చాలా కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఇవన్నీ సమయుడికి మోయలేని భారంగా మారుతున్నాయి. ప్రభుత్వాలు దీనిపై స్పందించి వీలైనంతవరకు ప్రజలకు సానుకూలంగా ఉండే చర్యలు తీసుకోవాలి.

Most Read Articles

English summary
Petrol Diesel Price Increases For The Fifth Consecutive Day. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X