వరుసగా నాలుగవ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు.. ఎలా ఉన్నాయంటే?

భారతదేశంలో ఇంధన ధరలు రోజురోజుకి పైపైకి పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో నిన్న (శుక్రవారం) వరుసగా నాలుగో రోజూ ఇంధన ధరలు అమాంతం పెరిగాయి. శుక్రవారం పెరిగిన ధరల విషయానికి వస్తే, పెట్రోల్ ధర 30 పైసలు, డీజిల్ ధర 35 పైసలు పెరిగినట్లు తెలుస్తోంది. పెరిగిన ఇంధన ధరల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

వరుసగా నాలుగవ రోజు పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు.. ఎలా ఉన్నాయంటే?

ఇటీవల ఇంధన ధరల పెరుగుదల తరువాత దేశ రాజధాని నగరం ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 103.54 కాగా, ముంబైలో లీటరు ధర రూ. 109.54 గా ఉంది. అయితే డీజిల్ ధరలు కూడా ఢిల్లీలో రూ. 92.12 కాగా ముంబైలో రూ. 99.92. ఇంధన ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగింది.

వరుసగా నాలుగవ రోజు పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు.. ఎలా ఉన్నాయంటే?

ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 82 డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర నెల క్రితం 72 డాలర్లుగా ఉంది. ఈ పెంపు ఫలితంగా దేశంలో ఇంధన ధరలు కూడా పెరిగాయి. భారతదేశం దాదాపు 85% ఇంధనాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ఈ కారణంగానే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగితే దేశంలో కూడా ఇంధన ధరలు పెరుగుతాయి.

వరుసగా నాలుగవ రోజు పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు.. ఎలా ఉన్నాయంటే?

భారతదేశంలో ఇటీవల పెరిగిన ధరల తరువాత ప్రధాన నగరాలైన బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై మరియు చెన్నైలలో లీటరు బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై మరియు చెన్నైలలో లీటరు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

పెట్రోల్ ధర (లీటరు)

  • బెంగళూరు - రూ. 107.46
  • ఢిల్లీ - రూ. 103.54
  • ముంబై - రూ. 109.54
  • చెన్నై - రూ. 101.01
  • కోల్‌కతా - రూ. 104.23
  • వరుసగా నాలుగవ రోజు పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు.. ఎలా ఉన్నాయంటే?

    డీజిల్ ధర (లీటరు)

    • బెంగళూరు - రూ. 98.15
    • ఢిల్లీ - రూ. 92.12
    • ముంబై - రూ. 99.92
    • చెన్నై - రూ. 96.60
    • కోల్‌కతా - రూ. 95.23
    • వరుసగా నాలుగవ రోజు పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు.. ఎలా ఉన్నాయంటే?

      భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్‌పై అధిక పన్నుల భారం వల్ల వీటి ధరలు చాలా పెరుగుతున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెంపుతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన వ్యాట్, డీలర్ కమిషన్ మరియు సరుకు ఛార్జీలు వంటి వాటి వల్ల కూడా ఈ ధరలు పెరుగుతున్నాయి. గత రెండేళ్లలో ఇంధనంపై ఎక్సైజ్ టాక్స్ కూడా గణనీయంగా పెరిగింది.

      వరుసగా నాలుగవ రోజు పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు.. ఎలా ఉన్నాయంటే?

      పెరిగిన టాక్స్ కూడా ఇంధన ధరల పెరుగుదలకు దారితీసింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఏకంగా రూ. 100 దాటింది. డీజిల్ ధరలు కూడా ఏ మాత్రం తగ్గకుండా, లీటర్ డీజిల్ ధర రూ. 100 ల వరకు చేరింది. అయితే ఇప్పుడు డీజిల్ మరియు పెట్రోల్ ధరలు దాదాపు ఒకే స్థాయికి చేరాయి.

      వరుసగా నాలుగవ రోజు పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు.. ఎలా ఉన్నాయంటే?

      ఇంధన ధరలు GST పరిధిలోకి వస్తే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు గణనీయంగా తగ్గుతాయి. అయితే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ధరలను GST పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే GST పరిధిలోకి వస్తే వాటి ధరలు తగ్గడం వల్ల రాష్ట్ర ఆదాయాలు బాగా తగ్గుతాయి. పెరుగుతున్న ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదు.

      వరుసగా నాలుగవ రోజు పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు.. ఎలా ఉన్నాయంటే?

      ప్రపంచంలో ఇంధన ధరలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. దేశంలో అధిక పన్నుల కారణంగా ఈ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలను నిరసిస్తూ భారతదేశంలో అనేక సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగానే పెళ్లిళ్లు మరియు ఇతర శుభ సందర్భాలలో పెట్రోల్ లేదా డీజిల్ వంటివి బహుమతులుగా అందించారు.

      వరుసగా నాలుగవ రోజు పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు.. ఎలా ఉన్నాయంటే?

      ఇవి మాత్రమే కాకుండా దేశంలో చాలా చోట్ల డీజిల్ మరియు పెట్రోల్ వంటివి కూఆ దొంగలించబడిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. పెట్రోల్ మరియు డీజిల్ దొంగతనాల సంఘటనలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక ఇతర దేశాలలో జరుగుతున్నాయి.

      వరుసగా నాలుగవ రోజు పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు.. ఎలా ఉన్నాయంటే?

      ఇలాంటి సంఘటన ఇటీవల ఇంగ్లాండ్ లో జరిగినట్లు నివేదికల ద్వారా తెలిసింది. ఇప్పుడు ఇంగ్లాండ్‌లో ఇంధన కొరత చాలా ఎక్కువగా ఉంది. ఇంధన ట్యాంకర్లకు తగినంత సంఖ్యలో డ్రైవర్లు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అని చెబుతున్నాయి. ఈ కారణంగా ఇంధన సరఫరా తగ్గిపోయింది, తద్వారా ఇంగ్లాండ్‌లోని పెట్రోల్ బంకర్‌ల ముందు వాహనాలు వరుసలో నిలిచిపోయాయి.

      ఇదే సందర్భంలో ఇంగ్లాండ్‌లో ఇంధన దొంగతనం జరిగిన సంఘటన నివేదించబడింది. ఇంగ్లాండ్‌లోని పోర్ట్స్‌మౌత్ అనే పార్కింగ్ స్థలం నుండి రూ. 45 లక్షల విలువైన సుమారు 30,000 లీటర్ల ఇంధనం దొంగలించబడినట్లు తెలిసింది. ఏది ఏమైన పెరుగుతున్న ఈ ఇంధన ధరలు తగ్గించడానికి ప్రభుత్వాలు సహకరించాలి, లేకుంటే ఈ ధరలు వాహన వినియోగదారులపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి.

Most Read Articles

English summary
Petrol diesel price increases for the fourth consecutive day details
Story first published: Saturday, October 9, 2021, 14:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X