తారాజువ్వలా పైకి లేస్తున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

భారతదేశంలో రోజురోజుకి ఇంధన (పెట్రోల్ మరియు డీజిల్) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అమాంతం పెరుగుతున్న ఈ ఇంధన ధరలు సామాన్య మానవుడిపై పెనుభారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే భారతదేశంలో దాదాపు చాలా నరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు 100 రూపాయలు దాటేసింది. ఈ వారంలో చమురు కంపెనీలు వరుసగా నాలుగవ రోజు పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచాయి.

తారాజువ్వలా పైకి లేస్తున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

ఈ రోజున (శుక్రవారం) ఒక లీటరుపై 35 పైసలు పెరిగినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అసలే రోజురోజుకి పెరుగుతున్న ధరలు, మళ్ళీ ఇప్పుడు వరుసగా పెరిగిపోతున్న ఇంధన ధరలు సామాన్యులపై భారాన్ని మోపుతున్నాయి.

తారాజువ్వలా పైకి లేస్తున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

ప్రస్తుతం భారతదేశ రాజధాని నగరం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 106.89 కి పెరిగింది, అంతే కాకుండా ఢిల్లోలో డీజిల్ ధర రూ. 95.62 వద్ద ఉంది. ఇక ముంబైలో, లీటర్ పెట్రోల్ ధర రూ .112.78 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ .103.63. కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ఈ రోజు పెట్రోల్ ధర కూడా రూ .110.61 కాగా, డీజిల్ ధర రూ. 101.49 కి చేరుకుంది.

తారాజువ్వలా పైకి లేస్తున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

ఈ రోజు కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 107.44 మరియు డీజిల్ ధర రూ .98.73 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ లీటరుకు రూ. 103.92 మరియు డీజిల్ రూ. 99.92 కి విక్రయిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో కూడా లీటరు పెట్రోల్ ధర రూ. 111.18 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 104.32. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ పై 36 పైసలు మరియు డీజిల్ పై 38 పైసలు పెరిగింది.

తారాజువ్వలా పైకి లేస్తున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు:

  • ఢిల్లీ - రూ. 106.89
  • ముంబై - రూ .112.78
  • కోల్‌కతా - రూ. 107.44
  • చెన్నై - రూ. 103.92
  • హైదరాబాద్ - రూ. 111.18
  • తారాజువ్వలా పైకి లేస్తున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

    ప్రధాన నగరాల్లో డీజిల్ ధరలు:

    • ఢిల్లీ - రూ .95.62
    • ముంబై - రూ. 103.63
    • కోల్‌కతా - రూ .98.73
    • చెన్నై - రూ .99.92
    • హైదరాబాద్ - రూ. 104.32
    • తారాజువ్వలా పైకి లేస్తున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

      ఇంధన ధరలు పెరగడానికి కారణాలు:

      అరబ్ ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాల సంస్థ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినందున రోజుకు 4 లక్షల బ్యారెల్స్ కంటే ఎక్కువ ముడి చమురు ఉత్పత్తి చేయకూడదని నిర్ణయించింది. భారతదేశం తన ఇంధన అవసరాలలో 85 శాతం అరబ్ దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది కాబట్టి, అంతర్జాతీయ మార్కెట్లో ధరల మార్పు గత కొన్ని నెలలుగా భారతదేశంలో వినియోగదారుల ఇంధన ధరలు బాగా పెరగడానికి దారితీసింది.

      తారాజువ్వలా పైకి లేస్తున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

      ముడి చమురు ధర అంతర్జాతీయం మార్కెట్లో బ్యారెల్‌కు $ 82 దాటింది. ఒక నెల క్రితం, ముడి చమురు ధర బ్యారెల్‌కు $ 72. అయితే ఈ ధర ఇప్పుడు $82 డాలర్లకు చేరింది. భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అంతర్జాతీయ ధరలతో సమానంగా ఉన్నాయి. దీనికి కారణం ఎక్కువ ఇంధన వినియోగం కూడా.

      తారాజువ్వలా పైకి లేస్తున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

      భారతదేశంలో కొత్త ఇంధన ధరలు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు అమలులోకి వస్తాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు సెప్టెంబర్ 24 నుండి డీజిల్ ధరలను మరియు సెప్టెంబర్ 28 నుండి పెట్రోల్ ధరలను పెంచుతున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్‌పై అధిక పన్నులు పెరుగుతున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెంపుతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన వ్యాట్, డీలర్ కమిషన్ మరియు సరుకు ఛార్జీలు కూడా దీనిపైనా ఉంటాయి, వీటన్నింటి కారణంగా ఇంధన ధరలకు రెక్కలొస్తున్నాయి.

      తారాజువ్వలా పైకి లేస్తున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

      అయితే భారతదేశంలో ఇంధన ధరలు GST పరిధిలోకి వస్తే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు గణనీయంగా తగ్గుతాయి. అయితే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ధరలను GST పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నాయి, ఇంధన దార్ల GST కిందికి వస్తే, రాష్ట్రాలకు వచ్చే ఆదాయం చాలా వరకు తగ్గుతుంది. కావున ఇంధన ధరలు GST కిందికి రావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. అంతే కాకుండా మరోవైపు ఇంధనంపై ఎక్సైజ్ టాక్స్ తగ్గించే అవకాశం ఏ మాత్రం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

      తారాజువ్వలా పైకి లేస్తున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

      పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్న దేశాల్లో, భారతదేశం ఒకటి. ఈ ధరల పెరుగుదల అధిక పన్నుల కారణంగానే పెరుగుతోంది. ఏది ఏమైనా ఈ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు భవిష్యత్ లో కూడా ఏమాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈకారణంగానే వాహన కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

      తారాజువ్వలా పైకి లేస్తున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

      పెట్రోల్ మరియు డీజిల్ ధరను ఇలా చెక్ చేయండి:

      రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ యొక్క తాజా రేటును కనుగొనడం చాలా సులభం. మీరు ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ నుండి రోజువారీ ఇంధన ధరలను కూడా తనిఖీ చేయవచ్చు. దీని కోసం మీరు ఇండియన్ ఆయిల్ SMS సర్వీస్ మొబైల్ నంబర్ 9224992249 కు SMS పంపవచ్చు. ఈ విధంగా చేస్తే మీ నగరంలో ఆ రోజు ఇంధన ధర ఎంత ఉందొ తెలుస్తుంది.

Most Read Articles

English summary
Petrol diesel price latest 22 october 2021 delhi mumbai chennai details
Story first published: Friday, October 22, 2021, 12:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X