వాహనదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు త్వరలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నుంచి వాహనదారులకు(Petrol Diesel Price Reduce) ఉపశమనం కలగనుంది. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలను కేంద్రం భారీగా తగ్గించనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే...
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత ఏడాది కాలంగా మారడం లేదు. ఈ నేపథ్యంలో త్వరలో వాహనదారులకు ఫ్యూయెల్ ధరల నుంచి ఉపశమనం కలగనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు 'ఈటీ నౌ' నివేదికలు వెల్లడించింది. 'ఈటీ నౌ' నివేదిక ప్రకారం గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. దాని లాభాన్ని వాహనదారులకు బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని నివేదిక వెల్లడించింది.

2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సహా వివిధ కారణాల వల్ల, దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు (Oil Marketing Companies - OMCలు) 2022లో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా లీటరు పెట్రోల్‌పై రూ.17 మరియు డీజిల్‌పై రూ. 35 గరిష్ఠ నష్టాలను ఎదుర్కొన్నాయి.
కాగా ఇప్పుడు 1 లీటర్ పెట్రోల్‌పై రూ.8 నుంచి రూ.10, డీజిల్‌పై రూ.3-రూ.4 వరకు లాభం పొందుతున్నాయి. ప్రస్తుతం లాభాల కారణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంచి లాభాలను ఆర్జిస్తుండటంతో.. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ అధికారులతో చర్చలు ప్రారంభించినట్లు ఈటీ నౌ నివేదిక వెల్లడించింది.

గత మూడు త్రైమాసికాల్లో చమురు మార్కెటింగ్ కంపెనీల నష్టాలు గణనీయంగా తగ్గాయి. మొత్తంగా ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కంపెనీలు రూ. 28,000 కోట్ల లాభాన్ని ఆర్జించాయి. ఈ క్రమంలో ఇకపై వచ్చే లాభాలను వాహనదారులకు మళ్లించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.72 గా ఉంది. డీజిల్ ధర రూ.89.62 గా నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబయిలో లీటరు పెట్రోలు ధర రూ.106.31 కాగా, డీజిల్ ధర రూ.94.27గా విక్రయిస్తున్నారు. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03 కాగా, డీజిల్ ధర రూ.92.76గా ఉంది.

హైదరాబాద్‌లో ఫ్యూయెల్ ధరల విషయానికొస్తే.. లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66 గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 97.82 గా నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.88 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 99.62 గా ఉంది.
ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. త్వరలో ప్రారంభం కానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించబోతుండటం హర్షించదగ్గ పరిణామం. అయితే ధరలు ఏ మేరకు తగ్గనున్నాయనే దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








