Petrol Diesel Prices Cut వాహనదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు త్వరలో గుడ్‌న్యూస్ అందించే అవకాశం ఉంది. త్వరలో భారీగా పెట్రోల్, డీజిల్(Petrol Diesel Prices Cut) ధరలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఇంధన ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంత మేరకు ధరలు తగ్గనున్నాయి.. పూర్తి సమాచారం ఈ కథనంలో..
చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) తమ 3వ త్రైమాసిక నివేదికను ప్రచురించిన తర్వాత, వచ్చే నెల (ఫిబ్రవరి)లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించవచ్చని సమాచారం. నికర లాభం రికార్డు స్థాయిలో రూ.75,000 కోట్లు దాటే అవకాశం ఉండటంతో.. కంపెనీలు ఇప్పటికే తమ నష్టాలను పూడ్చుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మరియు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (Q1) మరియు రెండవ త్రైమాసికం (Q2)లో భారీ లాభాలను నమోదు చేసుకున్నాయి. కాగా ఈ నెలాఖరులో 3వ త్రైమాసిక నివేదిక విడుదల అవుతుంది.
మూడో త్రైమాసికంలో మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో.. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2023-24 ప్రథమార్ధంలో ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీల నికర లాభం రూ.57,091.87 కోట్లు కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరానికి 4,917 శాతం పెరిగి రూ.1,137.89 నికర లాభానికి చేరుకున్నట్లు వెల్లడిస్తున్నాయి.

రష్యా-ఉక్రెయిన్(Petrol Diesel Prices Decrease) యుద్ధంతో సహా పలు కారణాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు 2022లో లీటర్ పెట్రోల్‌పై రూ.17, లీటర్ డీజిల్‌పై రూ.35 చొప్పున నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే. అనంతరం ధరల పెరుగుదలతో మంచి లాభాలను నమోదు చేసుకున్నాయి.
కాగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలను పరిశీలిస్తే.. తెలంగాణలోని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66 గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ. 97.98 గా నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ. 98.27 వద్ద ఉంది.

కాగా దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించడం వల్ల మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరడంతో పాటు ఆర్థికంగా భారం తగ్గుతుంది. అయితే ఈ ధరలు ఎంత మేర తగ్గుతాయనే దానిపై త్వరలో స్పష్టత రానుంది. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండటంతో భారీగా ధరలు తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








