పెట్రోల్‌కి బంగారం వలె రేటింగ్స్.. కల్తీ పెట్రోల్‌తో మీ జేబులకు చిల్లు పడినట్లే!!

దేశంలో ప్రస్తుతం లభించే ప్రతీ వస్తువు కల్తీమయం అయిపోయింది. కొతమంది కేటుగాళ్లు ఒరిజినల్‌కి ఏమాత్రం తేడా లేకుండా కల్తీ ప్రొడక్ట్స్‌ని ఉత్పత్తి చేస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు, అధికారం యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నా.. కొత్తగా కేటుగాళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయిదే మన రోజువారి జీవితంలో భాగంగా ఉన్న ఫ్యూయెల్స్‌ (Fuels) కూడా కల్తీకి గురయ్యే ఆస్కారం ఉంది. మన వాహనాల్లో పట్టించే పెట్రోల్‌లో ఆక్టేన్ రేటింగ్ అనేది చాలా కీలకం. ఈ రేటింగ్ ఇంధనం కల్తీ దాని క్వాలిటీని సూచిస్తుంది. అధిక ఆక్టేన్ కలిగిన ఇంధనాలు ఇంజిన్ లోపల మండడానికి ముందు జరిగే అధిక పీడనాన్ని తట్టుకోగలవు. హై ఫర్ఫామెన్స్‌ కలిగిన యంత్రాలకు ఇది చాలా అవసరం. అసలు ఈ రేటింగ్‌ ఏంటి దాని ఉపయోగాలకు సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం.

భారతదేశంలో పెట్రోల్ ప్రధానంగా రెండు ఆక్టేన్ రేటింగ్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి 91 & 95 రేటింగ్‌ చేయబడ్డాయి. సాధారణ పెట్రోల్ ఆక్టేన్ 91 రేటింగ్ ఉండగా.. ప్రీమియం పెట్రోల్ ఆక్టేన్‌ రేటింగ్‌ 95 ఉంది. కొన్ని కంపెనీల ఆక్టేన్‌ రేటింగ్‌ 97 లేదా 99 వంటి వరకు రేటింగ్‌ని కలిగి ఉన్నాయి. అయితే ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి.

Petrol-Octane Ratings

ప్రస్తుతం ఎక్కువగా ఆక్టేన్‌ 91 & 93 రేటింగ్‌లో లభిస్తున్నాయి. అయితే మీరు మీ వాహనానికి మంచి ఆక్టేన్ రేటింగ్‌ కలిగిన ఇంధనాన్ని ఉపయోగించాలి. ముఖ్యంగా హై-పెర్ఫార్మెన్స్ కార్లు సమర్థవంతంగా నడవడానికి అధిక ఆక్టేన్ రేటింగ్ ఇంధనం అవసరం. ఇటువంటి కార్లలో తక్కువ ఆక్టేన్ ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల ఇంజిన్ దెబ్బతింటుంది. ఇది కాలక్రమేణా ఇంజిన్‌ పనితీరుని తగ్గిస్తుంది. దీంతో మీ కారు ‌ఊహించిన మైలేజీ మరియు ఫర్ఫామెన్స్‌ని అందించదు.

మీ ఇంజిన్ సిలిండర్లలోని ఇంధనం అసమానంగా మండినప్పుడు ఇంజిన్ స్టాలింగ్ (ఇంజిన్‌ ఆగిపోవడం) జరుగుతుంది. ఇది ఇంజిన్ పేలవమైన పనితీరుని కనబరుస్తుంది. పదే పదే ఇంజిన్‌ స్టాలింగ్‌ వల్ల వాహనం పనితీరు కూడా తగ్గుతూ వస్తుంది. దీనిని పట్టించుకోకపోతే అలానే కొనసాగిస్తే మీ ఇంజిన్‌కి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మీ వాహనానికి సరైన ఇంధనాన్ని ఎంచుకోవడానికి ముందు మాన్యువల్‌ని తనిఖీ చేయండి.

Petrol-Octane-Ratings

ఇందుకోసం ప్రాథమికంగా మీరు క్వాలిటీని తనిఖీ చేసేందుకు ఫోటోనిక్‌ క్రిస్టల్‌ ఫైబర్‌ (Photonic Crystal Fiber) పేపర్‌ని ఉపయోగించి కల్తీ గురించి తెలుసుకోవచ్చు. ఆ తర్వాత సిఫార్సు చేయబడిన రేటెడ్ ఫ్యూయల్ ఉపయోగించడం వల్ల మీ ఇంజిన్ అత్యుత్తమ పనితీరు మరియు కారు లైఫ్‌ పెరుగుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడ్డ రేటింగ్‌ల వద్ద లభించే ఇంధనాన్ని మాత్రమే ఉపయోగించండి.

మీరు తక్కువ ఆక్టేన్ రేటింగ్ ఉన్న కారును నడిపితే మంచి రిజల్స్ట్‌ రాకపోవచ్చు. పనితీరులో ఎలాంటి మెరుగుదల ఉండదు. ఇది మీకు అనవసరమైన ఖర్చుగా మారవచ్చు. ఈ విషయం తెలియక చాలా మంది విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. కాబట్టి కీలకమైన పెట్రోల్‌ విషయంలో రాజీ పడవద్దు. ముఖ్యంగా మీరు అధిక ఫర్ఫామెన్స్‌ గల వాహనాన్ని నడుపుతున్నట్లయితే, ప్రీమియం పెట్రోల్‌ ఉపయోగించడం తప్పనిసరి.

అధిక ఆక్టేన్ ఇంధనాలు నిర్దిష్ట రకాల వాహనాలకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి అధిక శక్తి ఉత్పత్తి మరియు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్పోర్ట్స్ కార్లు, లగ్జరీ వాహనాలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అధిక ఆక్టేన్ రేటింగ్ ఉన్న ఇంధనాలు మీ ఇంజిన్‌ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. మంచి ఫ్యూయెల్‌ వల్ల కాలుష్యాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా పెట్రోల్‌పై ఆధారపడి నడిచే ఫీచర్లను మెరుగుపరిచే విధంగా ఉంటుంది.

లేదంటే ఇంజిన్ స్టాలింగ్ జరిగితే దానిని రిపేర్ చేయడం మీ జేబులకు చిల్లు పడినట్లే అవుతుంది. ‌అందువల్ల పెట్రోల్ ఆక్టేన్ రేటింగ్ మీ వాహనానికి సరైన ఇంధనాన్ని అందించానికి సహాయపడుతుంది. సిఫార్సు చేయబడ్డ ఆక్టేన్ రేటింగ్ పెట్రోల్‌ వినియోగం వల్ల మీ వెహికల్ మంచి లైఫ్‌ని అందిస్తుంది. అంతే కాకుండా మీ ఇంజిన్‌ దీర్ఘకాలికంగా మంచి ఫర్ఫామెన్స్‌తో పని చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, June 24, 2024, 9:40 [IST]
English summary
Petrol octane ratings vehicle performance full details in telugu
Read more on: #off beat #petrol #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+