తగ్గిన పెట్రోల్ మరియు డీజల్ ధరలు
ఈ మాసంలో రెండవ సారి పెట్రో ధరలు తగ్గుముఖం పట్టాయి. పెట్రోల్ మీద 3.5 శాతం మరియు డీజల్ మీద 0.8 శాతం ధరలు తగ్గాయి. రుపాయల్లో అయితే లీటర్ పెట్రోల్ మీద 2.25 రూపాయలు మరియు లీటర్ డీజల్ మీద 42 పైసలు చెప్పున ధరలు తగ్గాయి.

ఢిల్లీ మరియు జాతీయ రాజధాని పరిధిలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 62.51 లు మరియు డీజల్ ధర రూ. 64.76 లుగా ఉన్నాయి.
ఇంధన ధరలు తగ్గిన తరువాత ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెలువరించిన ప్రకటనలో, అంతర్జాతీయంగా పెట్రోల్ మరియు డీజల్ ధరలు మరియు రుపాయి డాలర్‌తో మారకం విలువ తగ్గడం వంటి కారణాల వలన పెట్రో ధరలు తగ్గినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications








