Just In
- 10 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
- 12 hrs ago
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- 14 hrs ago
భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు
- 15 hrs ago
మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులు అకస్మాత్తుగా ప్రయాణం చేయొచ్చు...!
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Movies
పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
ఇతర దేశాలతో పోలిస్తే, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు అమాంతం పెరుగుతున్నాయి. దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సామాన్య ప్రజలు ఈ మోయలేకపోతున్నారు. ఇంధన ధరల పెరుగుదల నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది.

నిత్యావసరాల ధరలు పెరిగితే సామాన్య ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేయడానికి కూడా ఇది ప్రధాన కారణం. కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రజలకు ఒక శుభవార్త ఇచ్చారు. శీతాకాలం చివరి నాటికి పెట్రోలియం ఉత్పత్తుల ధర తగ్గుతాయని అయన తెలిపారు.

పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పిన ఈ మాటలు ప్రజలలో కొంత ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. దీని గురించి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల ప్రజలను ప్రభావితం చేసిందన్నారు.

శీతాకాలం ముగియడంతో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగేకొద్దీ భారత మార్కెట్లో కూడా ధర కూడా పెరుగుతుంది. శీతాకాలంలో ఇది సాధారణం. శీతాకాలం ముగియడంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఖచ్చితంగా తగ్గుతాయని ఆయన వివరించారు.

పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా తగ్గిస్తారనే దానిపై మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ ఆయన చేసిన ఈ ప్రకటన వాహనదారులలో ఏర్పడిన ఆందోళన తగ్గిస్తుంది. తమిళనాడు, పాండిచేరి, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని వాహనదారులు భావిస్తున్నారు.
MOST READ:సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?

గతంలో చమురు కంపెనీలు భారతదేశంలో అనేక అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలలో పెట్రోల్ మరియు డీజిల్ తగ్గాయి. అన్ని ఇప్పుడు భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ 5 రాష్ట్రాల్లో ఓటింగ్ ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వాహనదారులు అభిప్రాయపడ్డారు.

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో, భారతదేశంలో అధిక మైలేజ్ అందించే బైకుల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పటికీ, కొంతమంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలని చూస్తున్నారు. ఏది ఏమైనా ఇంధన ధరలు ఇలాగె ఉంటె సమీప భవిష్యత్ లో రోడ్లపై తిరిగే ఎల్రక్ట్రిక్ వాహనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]