తోటి వ్యక్తి అంత్యక్రియలకు నిరాకరించిన గ్రామస్థులు.. పిఎఫ్‌ఐ టీమ్ రాకతో కథ సుఖాంతం

భారతదేశంలో కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారంణంగా ఎంతోమంది ప్రజలు మరణిస్తున్నారు. అంతే కాకుండా లెక్కకుమించిన ప్రజలు ఈ మహమ్మరి భారిన పడి కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు.

కరోనా వేళ మానవత్వం మంటగలిసిపోయింది.. దీనికిదే నిలువెత్తు నిదర్శనం

కరోనా మహమ్మరి ఎంతోమంది ప్రాణాలు హరిస్తున్న విషాదకరమైన ఈ సమయంలో సాటి మనిషిలో మానవత్వం మంటగలసిపోతోంది. దీనమైన పరిస్థితిలో ఉన్న ప్రజల పట్ల చాలామంది ఏమి పట్టనట్టు ప్రవర్తిస్తున్నారు. అయితే కొన్ని సామజిక సేవా సంస్థలు నిరాడంబరంగా సేవచేయడానికి ముందుకు వస్తున్నాయి.

కరోనా వేళ మానవత్వం మంటగలిసిపోయింది.. దీనికిదే నిలువెత్తు నిదర్శనం

ఇటీవల ఒక వృద్ధుడు మరణించడంతో అతనికి అంత్యక్రియలు చేయడానికి ఆ గ్రామంలో ప్రజలు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషాద సంఘటన చామరాజనగర్ జిల్లా కోల్‌గళ తాలూకాలో జరిగింది. నివేదికల ప్రకారం కోల్‌గళ తాలూకాలోని అలదహళ్లి గ్రామంలో మాధవ అనే 65 సంవత్సరాల వృద్ధుడు మరణించాడు.

MOST READ:బెంగళూరులో కరోనా ఎఫెక్ట్; లాక్‌డౌన్‌లో పట్టుబడ్డ వారికి డిఫరెంట్ పనిష్మెంట్

కరోనా వేళ మానవత్వం మంటగలిసిపోయింది.. దీనికిదే నిలువెత్తు నిదర్శనం

ఆ వృద్ధుడు కరోనా వల్ల మరణించి ఉండవచ్చనే భయంతో అతనికి అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు మరణించిన వృద్ధుడి పెద్ద కుమారుడు, గ్రామ పెద్ద సహాయంతో, కల్లగెల పిఎఫ్‌ఐ యువకులను అంత్యక్రియలకు సహాయం చేయమని కోరతాడు.

కరోనా వేళ మానవత్వం మంటగలిసిపోయింది.. దీనికిదే నిలువెత్తు నిదర్శనం

సమాచారం అందిన వెంటనే పిఎఫ్‌ఐ టీమ్ కి చెందిన 8 మంది పురుషులు అక్కడకు వచ్చారు. అయితే ఆ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి గ్రామానికి చెందిన వారు ఎవరూ వాహనం ఇవ్వలేదు. చివరికి, ఒక ద్విచక్ర వాహనంలో నిచ్చెన సహాయంతో శవాన్ని తీసుకెళ్లడానికి పిఎఫ్‌ఐ నిర్వాహకులు ముందుకు వస్తారు.

MOST READ:వావ్.. ఈ మోడిఫైడ్ టాటా సుమో, నిజంగా సూపర్ గురూ..!

కరోనా వేళ మానవత్వం మంటగలిసిపోయింది.. దీనికిదే నిలువెత్తు నిదర్శనం

ఇది తెలుసుకున్న గ్రామీణ ప్రాంతంలోని పోలీసులు వారికీ మృతదేహాన్ని ఖననం చేయడానికి సరైన స్థానం కూడా చూపిస్తారు. ఈ టీమ్ సరైన జాగ్రత్తలతో పిపిఇ కిట్స్ ఉపయోగించి ఆ మృతదేహాన్ని ఖననం చేస్తారు. ఈ కార్యక్రమంలో పిఎఫ్‌ఐకి చెందిన నూర్ మొహల్లా, మతీన్, ఆసిఫ్, నయీమ్ జియావుల్లా, సిద్దిక్, మొదలైన వారు పాల్గొన్నారు.

కరోనా వేళ మానవత్వం మంటగలిసిపోయింది.. దీనికిదే నిలువెత్తు నిదర్శనం

ఒక గ్రామంలో తోటి వ్యక్తి చనిపోతే అతడికి అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాకపోగా, ఖననం చేయడానికి కూడా అనుమతించకపోవడం నిజంగా అమానుషం అనే చెప్పాలి. ప్రపంచమే తలకిందులవుతున్న ఈ కరోనా వేళలో మనుషులు కూడా ఇంత క్రూరంగా మారటం నిజంగా బాధాకరం.

MOST READ:మీరెప్పుడూ చూడని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ వీడియో.. ఇప్పుడు చూసెయ్యండి

కరోనా వేళ మానవత్వం మంటగలిసిపోయింది.. దీనికిదే నిలువెత్తు నిదర్శనం

ఇటీవల కాలంలో కరోనా వైరస్ వల్ల చనిపోయిన మృతదేహాలకు అంత్యక్రియలు చేయడానికి చాలామంది యువకులు ముందుకు వస్తున్నారు. కానీ సొంతవాళ్ళు ముందుకు రావడం లేదు. ఇదిలా ఉంటే మరోవైపు చాలామంది కరోనా బాధిత కుటుంబాల నుంచి విచ్చలవిడిగా డబ్బు దోచుకుంటున్నారు.

Source: NewsFirstLive

Most Read Articles

English summary
Pfi Workers Carries Dead Bodyo Of Oldman. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X