చదివేది డాక్టరేట్, చేసేది దొంగతనం.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 300 పైనే

దేశంలో వాహన దొంగతనాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. పోలీసులు ఈ దొంగతనాలను పూర్తిగా రూపుమాపడానికి ఎన్ని కఠినమైన చర్యలు తీనుకుంటున్నప్పటికీ వాహన దొంగతనాలను మాత్రం పూర్తిగా నిలువరించలేకపోతున్నారు. అంతే కాకుండా వాహన తయారీదారులు కూడా దొంగతనాలు జరగకుండా ఉండటానికి లేటెస్ట్ ఫీచర్స్ కూడా వాహనాల్లో పొందుపరుస్తున్నారు. దొంగలు కూడా అధునాతన పరికరాలను వినియోగించి సులభంగా దొంగతనాలు చేస్తున్నారు.

చదివేది డాక్టరేట్, చేసేది దొంగతనం.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 300 పైనే

ఇటీవల వెల్లడైన ఒక నివేదిక ప్రకారం, ఇద్దరు దొంగలు ఏకంగా 300 కార్లు దొంగలించినట్లు తెలిసింది. ఈ దొంగతనాలకు పాల్పడిన వారు ఉన్నత చదువు చదువుకున్న వారే. ఇందులో ఒకరు పీహెచ్‌డీ గ్రాడ్యుయేట్ కాగా మరొకరు ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి అని తెలిసింది.

చదివేది డాక్టరేట్, చేసేది దొంగతనం.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 300 పైనే

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, ఒకరు మెహతాబ్‌గా మరొకరు తాద్రిష్ గా గుర్తించారు. మెహతాబ్‌ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయిన నెట్ పాసయ్యాడు, అంతే కాకుండా డాక్టరేట్ (పీహెచ్‌డీ) చేస్తున్నట్లు తెలిసింది. తాద్రిష్ ఢిల్లీ యూనివర్సిటీ వంటి గొప్ప కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. అంతే కాదు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ కూడా పొందాడు.

చదివేది డాక్టరేట్, చేసేది దొంగతనం.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 300 పైనే

వీరిద్దరూ సుమారు 300 కార్లను దొంగలించినట్లు పోలీసుల కథనం ప్రకారం తెలిసింది. కార్లు మాత్రమే కాదు బైకులు కూడా దొంగతనం చేసినట్లు తెలిసింది. దొంగలించబడిన చాలా వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు.

చదివేది డాక్టరేట్, చేసేది దొంగతనం.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 300 పైనే

అయితే పోలీసులు ఏ వాహనాలను పట్టుకున్నారు అనేదాని గురించి మాత్రం ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. ప్రస్తుతం వాహన దొంగతనం ముఠాలోని ఇద్దరు సభ్యులు మాత్రమే పట్టుబడ్డారు. దొంగతనానికి సంబంధించి మణిపూర్ నుంచి 12 ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చదివేది డాక్టరేట్, చేసేది దొంగతనం.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 300 పైనే

ముఠాలోని ఇతర సభ్యులను అరెస్టు చేయడానికి మణిపూర్ పోలీసులు శోధిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో మణిపూర్ పోలీసులతో ఢిల్లీ పోలీసులతో చేతులు కలిపారు. త్వరలో వీటిని కూడా పట్టుకునే అవకాశం ఉంది.

చదివేది డాక్టరేట్, చేసేది దొంగతనం.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 300 పైనే

పోలీసులు విడుదల చేసిన ఫోటోలలో టయోటా ఫార్చ్యూనర్, హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో, మారుతి సుజుకి విటారా బ్రెజ్జ వంటి వాటితో సహా పలు కార్లు ఉన్నాయి. ఈ కార్లన్నీ దేశీయ మార్కెట్లో ప్రాచుర్యం పొందిన కార్లు, ఈ కార్లను పోలీసులు విడుదల చేసిన ఫొటోలో చూడవచ్చు.

Most Read Articles

English summary
PhD Scholar, Friend Steal 300 Cars. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X