సుమారు రూ. 8 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన 21 సూపర్ కార్లు నుజ్జునుజ్జు.. కారణం మాత్రం ఇదే

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహన ప్రియులకు లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాహన ప్రియులు లగ్జరీ కార్లను ఎంతో ఇష్టంతో కొనుగోలుచేసి చాలా అపురూపంగా చూసుకుంటారు. ఇలాంటి ఖరీదైన మరియు విలాసవంతమైన కార్లకు చిన్న గీతపడితే కూడా ఎంతో బాధపడతారు.

అయితే ఇటీవల ఫిలిప్పీన్స్ లో ఏకంగా 1.2 మిలియన్స్ ఖరీదైన కార్లను అక్కడి ప్రభుత్వం తుక్కు తుక్కు చేసింది. ఇంతకు అక్కడి ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనే దాని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

నుజ్జునుజ్జయిన 21 సూపర్ కార్లు.. కారణం మాత్రం ఇదే

ఫిలిప్పీన్స్ లోకి అక్రమంగా చొరబడ్డాయి అనే కారణంగా కోట్ల రూపాయలను విలువ చేసే లగ్జరీ కార్లను వరుసగా పార్క్‌ చేసి ఆ తర్వాత బుల్డోజర్‌తో వాటిని తుక్కుతుక్కుగా చేయడం జరిగింది. కార్‌ స్మగ్లర్స్‌ను గట్టిగా హెచ్చరించడం కోసం ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

నుజ్జునుజ్జయిన 21 సూపర్ కార్లు.. కారణం మాత్రం ఇదే

తుక్కు తుక్కు చేయబడిన 21 లగ్జరీ కార్ల మొత్తం విలువ 1.2 మిలయన్‌ డాలర్లుగా పరిగణించారు. అంటే మన భారత కరెన్సీ ప్రకారం వీటి ధర రూ. 8 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ న్యూస్ లగ్జరీ కార్ ప్రేమికులకు నిజంగా ఒక షాకింగ్ న్యూస్.

నుజ్జునుజ్జయిన 21 సూపర్ కార్లు.. కారణం మాత్రం ఇదే

ధ్వంసం చేయబడిన మొత్తం 21 కార్లలో మెక్‌లారెన్ 620 ఆర్, పోర్స్చే 911, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతేకాకుండా వీటితో పాటు, మెర్సిడెస్ ఎస్‌ఎల్‌కే, లోటస్ ఎలిస్, మాడిఫైడ్‌ హ్యుందాయ్ జెనెసిస్ కూపే, టయోటా సోలారా, 14 మిత్సుబిషి జీపులు ఉన్నాయి.

నుజ్జునుజ్జయిన 21 సూపర్ కార్లు.. కారణం మాత్రం ఇదే

నివేదికల ప్రకారం ఈ లగ్జరీ కార్లన్నీ వేర్వేరు మార్గాల ద్వారా దేశంలోకి చొరబడ్డాయని తెలిసింది. 2018 నుంచి 2020 వరకు వేర్వేరు సందర్భాల్లో వీటిని స్వాధీనం చేసుకుని ఇటీవల వీటిని మొత్తం ధ్వంసం చేశారు. ఫిలిప్పైన్ ప్రభుత్వం కార్ల స్మగ్లర్ల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందని తెలుపడానికి ఇది నిలువెత్తు నిదర్శనం అని ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో రో డ్యూటెర్టే తెలిపారు.

నుజ్జునుజ్జయిన 21 సూపర్ కార్లు.. కారణం మాత్రం ఇదే

ఫిలిప్పీన్స్ దేశంలోకి అక్రమంగా చొరబడ్డ లగ్జరీ కార్లను ఇలా తుక్కుగా మార్చడం ఇది మొదటి సారి కాదు. గతంలో ఇలాంటి సంఘటన జరిగింది. ఆ సమయంలో బీఎమ్‌డబ్ల్యూ జెడ్ 1, ఫెరారీ 360 స్పైడర్, లంబోర్ఘిని గల్లార్డోతో సహా మొత్తం 17 వాహనాలను తుక్కుతుక్కు చేసినట్లు కూడా తెలిసింది.

నుజ్జునుజ్జయిన 21 సూపర్ కార్లు.. కారణం మాత్రం ఇదే

గతంలో ఇలా తుక్కుతుక్కు చేసిన కార్లలో రెనాల్ట్ 5 టర్బో, మెర్సిడెస్ ఎస్‌ఎల్ 55 ఏఎమ్‌జి, ఒపెల్ మాంటా, మసెరటి క్వాట్రోపోర్ట్ తో పాటు వివిధ బ్రాండ్లకు సంబంధించిన లగ్జరీ కార్లు ఉన్నాయి. అయితే ఈ విధమైన చర్యలు తీసుకున్న ప్రభుత్వంపై కొంతమంది సానుకూలంగా ప్రతిస్పందించగా మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నుజ్జునుజ్జయిన 21 సూపర్ కార్లు.. కారణం మాత్రం ఇదే

ఎందుకంటే ఇంత ఖరీదైన కార్లను తుక్కు తుక్కు చేసేబదులు వాటిని వేలం వేసి డదని ద్వారా మంచి పనులకోసం ఉపయోగిస్తే బాగుంటుందని అంటున్నారు. ఈ విధంగా తుక్కు తుక్కు చేయడంకంటే కూడా ఈ విధంగా చేయడం కూడా ఒకరకంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Luxury Cars Worth $1.2 Million Crushed To Pieces In Philippines. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X