కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లను నుజ్జు నుజ్జు చేశారు [వీడియో]

అక్కడ స్మగ్లింగ్ అయినా... మరే ఏ ఇతర అనధికారిక పనులైనా... ప్రభుత్వం దృష్టికి వస్తే, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకు ఇవాళ్టి స్టోరీ చక్కటి ఉదాహరణ. అనధికారికంగా, స్మగ్లింగ్ చేసి మరియు ప్రభుత్వం కళ

By Anil Kumar

దేశ ఆదాయానికి గండికొడుతున్న అనధికారి కార్యకలాపాల్లో స్మగ్లింగ్ ఒకటి. స్మగ్లింగ్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల ఆర్థిక ఎదుగులకు అడ్డుపడుతోంది. కొన్ని దేశాల్లో కఠినమైన చట్టాలుంటే, మరికొన్ని దేశాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తాయి. కానీ, ఫిలిప్పీన్స్ ఇందుకు పూర్తిగా విభిన్నం.

కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లను నుజ్జు నుజ్జు

అక్కడ స్మగ్లింగ్ అయినా... మరే ఏ ఇతర అనధికారిక పనులైనా... ప్రభుత్వం దృష్టికి వస్తే, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకు ఇవాళ్టి స్టోరీ చక్కటి ఉదాహరణ. అనధికారికంగా, స్మగ్లింగ్ చేసి మరియు ప్రభుత్వం కళ్లుగప్పి దిగుమతి చేసుకున్న అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను నిర్ధాక్షిణ్యంగా నుజ్జు నుజ్జు చేశారు.

కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లను నుజ్జు నుజ్జు

ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూట్రెట్, ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి నెలలో అనధికారికంగా ప్రభుత్వం కళ్లుగప్పి దిగుమతి చేసుకున్నారనే నెపంతో సుమారుగా 10 లక్షల డాలర్లు విలువ చేసే అత్యంత విలాసవంతమైన లగ్జరీ మరియు సూపర్ కార్లను నుజ్జు నుజ్జు చేయించాడు.

కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లను నుజ్జు నుజ్జు

మళ్లీ ఇలాంటి తప్పు చేయాలంటే ప్రజల్లో భయాన్ని పుట్టించేందుకు డ్యూట్రెట్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. అయితే, తాజాగా ల్యాంబోర్ఘిని, మస్టాంగ్ మరియు పోర్షే వంటి అత్యంత ఖరీదైన సుమారుగా 40 కోట్ల రుపాయలు విలువ చేసే 68 సూపర్ కార్లను జేసీబీల సాయంతో మళ్లీ నుజ్జు నుజ్జు చేశాడు.

కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లను నుజ్జు నుజ్జు

ఫిలిప్పీన్స్‌లో స్మగ్లింగ్ నివారించేందుకు రోడ్రిగో డ్యూట్రెట్ అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అనధికారికంగా దిగుమతి చేసుకోవడం మరియు స్మగ్లింగ్ కార్యకలాపాల పట్ల డ్యూట్రెట్ తీసుకునే నిర్ణయాలు ఇతర దేశ ప్రధానులకు కనువిప్పు కలిగిస్తున్నాయని చెప్పవచ్చు.

కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లను నుజ్జు నుజ్జు

తాజాగా అధికారులు మరియు పత్రికా ప్రతినిధుల సమక్షంలో కోటాను కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లను నాశనం చేయించే సందర్భంగా, డ్యూట్రట్ మాట్లాడుతూ, "మీరు ఉన్న చోట పెట్టుబడులు మరియు వ్యాపారం అత్యంత పారదర్శకంగా, ఆచరణీయంగా ఉన్నట్లు ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాని తెలిపాడు."

కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లను నుజ్జు నుజ్జు

నిజానికి అనధికారికంగా సంపాదించిన, దొంగలించిన మరియు స్మగ్లింగ్ చేసిన వ్యక్తుల నుండి రికవరీ చేసిన ఇలాంటి కార్లను వేలం వేసి, దాని ద్వారా వచ్చిన సొమ్మును పోలీస్ శాఖ ఆర్థిక అవసరాలకు ఉపయోగిస్తారు. అయితే, స్మగ్లర్లకు కఠినమైన మేసేజ్ ఇచ్చేందుకు ఆ దేశ అధ్యక్షుడు మరో అడుగు ముందుకేసి ఈ నిర్ణయం తీసుకున్నాడు.

కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లను నుజ్జు నుజ్జు

వివాదాస్పద నిర్ణయాలు తీసుకునో రోడ్రిగో డ్యూట్రెట్ మోటార్‌సైకిల్ ప్రేమికుడు. డ్యూట్రెట్‌కు హ్యార్లీ డేవిడ్సన్ క్రూయిజ్ మోటార్‌సైకిళ్లు అంటే చాలా ఇష్టం. గతంలో ఇల్లీగల్ బైకులను ఎక్సకవేటర్ ద్వారా నాశనం చేస్తున్నపుడు అందులో ఉన్న హ్యార్లీ బైకును చూసి, దానిని నుజ్జునుజ్జు చేస్తుంటే నా మెడను నలిపేస్తున్నట్లు అనిపించిందని చెప్పడం గమనార్హం.

అసాధారణ కార్యకలాపాలకు వ్యతిరేఖంగా అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఫిలిఫ్పీన్స్ ప్రభుత్వం పెట్టింది పేరు.

మరి మన దేశంలో కూడా ఇలాంటి చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నారా...? ఈ కథనం పట్ల మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి...

కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లను నుజ్జు నుజ్జు

1.సెలబ్రిటీలనే ఔరా అనిపిస్తున్న రాజకీయ నాయకుల కార్లు

2.డ్యూటీ పక్కన పెట్టి ఈ పోలీసులు ఏం చేశారో చూడండి: వీడియో

3.సుల్తాన్ ఆఫ్ బ్రునెయి, ఇతని వైభోగం చూస్తే అంబానీ సైతం ఆశ్చర్యపోవాల్సిందే!!

4.స్కూటర్ నడుపుతూ ఇలాంటి పనులు ఎప్పటికీ చేయకండి

5.కొడుకుని పోగొట్టుకున్న ఈ తండ్రి చేస్తున్న పనిని అందరూ అభినందించాల్సిందే..!!

Most Read Articles

English summary
Read In Telugu: Philippines President Rodrigo Duterte Destroys 68 Supercars Worth Rs 40 Crore
Story first published: Thursday, August 2, 2018, 18:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X