ప్రైవేట్‌ బస్సు నడుపుతున్న పైలట్‌.. వీడియో చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.!!

బస్సుకి డ్రైవర్, రైలుకి లోకో పైలట్‌, విమానానికి పైలట్‌ ఇలా ఒక్కో రకమైన వాహనానికి ప్రత్యేకంగా ఉంటారు. కానీ ఈ స్టోరీ చదివితే మాత్రం.. ఇతనిని ఏమని పిలవాలా అనే డౌట్‌ మాత్రం వస్తుంది..

సాధారణంగా చిన్న వయసులో పిల్లల్ని మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు.. అని తరచూ పెద్దలు అడుగుతుంటారు. అప్పుడు చాలా మంది చెప్పే సమాధానం పైలట్. విమానాల్లో పైలట్‌గా పనిచేస్తూ గాల్లో విహరిస్తూ ఆ సంతోషాన్ని ఆస్వాదించాలనుకుంటారు. అయితే అందులో కొద్ది మంది మాత్రమే తమ కలను నెరవేర్చుకుంటారు.

Pilot-Driving-Bus

కేరళకు చెందిన శ్రీహరి కూడా ఆ కేటగిరీలోకే వస్తాడు. శ్రీహరికి చిన్నప్పటి నుంచి విమానం నడపాలనే కోరిక ఉంది. అందుకే పైలట్‌ కావాలని నిశ్చయించుకుని తన కలను నెరవేర్చుకున్నాడు. కేరళలోని కాసర్‌గోడ్‌ శ్రీహరి స్వస్థలం. ఇప్పుడు పైలట్‌గా ఆ రంగంలో రాణిస్తున్నాడు. ఇప్పుడు అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు ట్రెండ్‌ అవుతున్నాయి.

శ్రీహరి నాల్గవ తరగతిలో ఉన్నప్పుడే కారు నేర్చుకున్నాడట... ఇంకో ఆశ్చర్యకరమైన.. ఏడో తరగతిలోనే బస్సు నడపడం కూడా నేర్చుకున్నాడు. శ్రీహరి తండ్రి ప్రైవేట్ బస్సు యజమాని కావడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఈ కారణంగానే అతను కార్లు మరియు బస్సులు సునాయాసంగా నడుపుతూ.. తన ధ్యాసను క్రమంగా విమానం వైపు మళ్లించాడు.

Pilot-Driving-Bus

కాగా శ్రీ హరి 22 ఏళ్ల వయసులోనే కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందారు. దీని తర్వాత అతను ఎయిర్‌బస్ A320 విమానాన్ని నడిపేందుకు సిద్ధమయ్యాడు. కానీ కొవిడ్ -19 కారణంగా అతను పైలట్‌ అయ్యే అవకాశం కొద్దిలో చేజారింది. దీంతో మరికొంత కాలం వేచి ఉండాల్సి వచ్చింది.

ఏడాదిన్నర తర్వాత శ్రీహరి పూర్తి పైలట్‌గా అయ్యాడు. అవును, సుమారు ఏడాదిన్నర నిరీక్షణ తర్వాత, అతను మొదటిసారి విమానంలో పైలట్‌గా అడుగుపెట్టాడు. శ్రీ హరి పైలట్ కెరీర్ ఢిల్లీ-బెంగళూరు డొమెస్టిక్ సర్వీస్‌తో ప్రారంభమైందట. మొదట్లో ఎయిర్ ఏషియాలో పనిచేసిన అతను ఇప్పుడు విస్తారాలో పనిచేస్తున్నట్లు శ్రీహరి చెప్పారు.

Pilot-Driving-Bus

ప్రస్తుతం శ్రీహరి దేశీయంగానే కాకుండా సింగపూర్, సౌదీ అరేబియా వంటి విదేశాలకు కూడా విమానాలు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. సుదీర్ఘ నిరీక్షణ, శ్రమ అనంతరం శ్రీహరి పైలట్‌ అవ్వాలనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాక కూడా అతను తన పాత విషయాలను మరచిపోలేదు.

శ్రీహరి సెలవుల్లో తన సొంత ఊరికి వచ్చినప్పుడు తన తండ్రి ప్రైవేట్ బస్సు నడుపుతున్నాడు. అయితే బస్సు డ్రైవర్ సీటులో పైలట్ కూర్చున్నాడని తెలియడంతో ప్రయాణికులు ఒకింత షాక్‌కు గురవడంతో పాటు అతని సింప్లిసిటీకి ఫిదా అయ్యారు. ప్రస్తుతం అతనికి బైక్, కారు, ఆటో రిక్షా, బస్సు, విమానాలు నడపడానికి లైసెన్స్ ఉండటం ఆశ్చర్యం.

ప్రస్తుతం శ్రీ హరికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. పైలట్ అయ్యాక కూడా శ్రీహరి బస్సులు నడుపుతుండడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. వాహనాలు నడపడంపై తనకున్న ప్యాషన్‌ను తెలియజేస్తుంది. పైలట్‌గా ఉన్న శ్రీహరి బస్సు నడుపుతుండటంతో తనతో ఫొటో దిగేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, October 25, 2023, 9:10 [IST]
English summary
Pilot driving private bus video gone viral here is know why
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+