ఐస్ క్రీం కోసం నగరం నడిబోడ్డున హెలికాప్టర్ ల్యాండింగ్ చేసిన పైలట్.. ఎక్కడో తెలుసా?

సృష్టిలో ఉన్న జీవరాశుల్లోకెల్లా మనిషి తెలివైన గొప్పవాడు. అయితే మనిషి ఈత గొప్పవాడైనప్పటికీ అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లల శేష్ఠలు చేస్తూ ఉంటాడు. ఇలాంటి శేష్ఠల వల్ల ఇబ్బదుల్లో కూడా పడుతుంటాడు. ఇలాంటి సంఘటన ఇటీవల కెనడాలో జరిగినట్లు తెలిసింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఐస్ క్రీం కోసం నగరం నడిబోడ్డున హెలికాప్టర్ ల్యాండింగ్ చేసిన పైలట్.. ఎక్కడో తెలుసా?

ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో కెనడా ఒకటి. దేశం పెద్దదిగా ఉన్నప్పటికీ జనసాంద్రత ఎక్కువగా లేదు. కావున కెనడాలో జనసాంద్రత తక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల కెనడాలో ఒక హెలికాప్టర్ పైలట్ బహిరంగ ప్రదేశంలో హెలికాప్టర్‌ ల్యాండ్ చేశారు. హెలికాఫ్టర్ బహిరంగ ప్రదేశాల్లో ల్యాండ్ చేయడం వల్ల పోలీసుల చర్యకు గురయ్యాడు.

ఐస్ క్రీం కోసం నగరం నడిబోడ్డున హెలికాప్టర్ ల్యాండింగ్ చేసిన పైలట్.. ఎక్కడో తెలుసా?

స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హెలికాప్టర్ పైలట్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. డిస్టిల్లె కెనడాలోని ప్రధాన నగరాలలో ఒకటి. ఈ నగరంలో దాదాపు 3,000 మంది నివసిస్తున్నారు. ఇటీవల, నగరం నడిబొడ్డున రెడ్ కలర్ హెలికాప్టర్ ల్యాండ్ అయింది. అక్కడ ఉన్న వ్యక్తులకు అక్కడ ఏమి జరుగుతుందో అర్థం కాలేదు.

ఐస్ క్రీం కోసం నగరం నడిబోడ్డున హెలికాప్టర్ ల్యాండింగ్ చేసిన పైలట్.. ఎక్కడో తెలుసా?

హెలికాప్టర్ అకస్మాత్తుగా కిందికి దిగడం వల్ల స్థానికులు కొంత ఆశ్చర్యపోయారు. అయితే కొంతమంది ఈ సంఘటనను మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయడం ప్రారంభించారు. కెనడాలోని ఈ ప్రాంతంలో మెడికల్ ఎయిర్ అంబులెన్స్‌లు ఎరుపు రంగులో పెయింట్ చేయబడ్డాయి.

ఐస్ క్రీం కోసం నగరం నడిబోడ్డున హెలికాప్టర్ ల్యాండింగ్ చేసిన పైలట్.. ఎక్కడో తెలుసా?

అత్యవసర మెడికల్ ఎమర్జెన్సీ కోసం హెలికాప్టర్ ల్యాండ్ అయ్యిన్ది అక్కడి వారు భావించారు. హెలికాప్టర్ కిందికి దిగగానే ఆ ప్రాంతంలో భారీగా దుమ్ము ధూళితో కూడుకున్న వాతావరణం ఏర్పడింది. సమీపంలో ఒక పాఠశాల ఉన్నందున, నివాసితులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించి, ఏదైనా వైద్య అత్యవసర సేవ కోసం హెలికాప్టర్‌ను డిస్టిలరీకి పంపించారా అని విచారించారు.

ఐస్ క్రీం కోసం నగరం నడిబోడ్డున హెలికాప్టర్ ల్యాండింగ్ చేసిన పైలట్.. ఎక్కడో తెలుసా?

అయితే, అంబులెన్స్ పంపబడలేదని కంట్రోల్ రూమ్ సిబ్బంది సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని తనిఖీ చేశారు. పోలీసు విచారణలో హెలికాప్టర్ నడుపుతున్న 34 ఏళ్ల పైలట్ ఐస్ క్రీం తినాలనే ఉద్దేశ్యంతో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా హెలికాప్టర్ ల్యాండ్ చేసాడని తేలింది.

ఐస్ క్రీం కోసం నగరం నడిబోడ్డున హెలికాప్టర్ ల్యాండింగ్ చేసిన పైలట్.. ఎక్కడో తెలుసా?

పైలట్ పై కేసు నమోదు చేసిన పోలీసులు సెప్టెంబర్ 7 న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించారు. హెలికాప్టర్ నడపడానికి పైలట్ డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉన్నాడు. కానీ అతను ఐస్ క్రీం తినడానికి బహిరంగ ప్రదేశంలో హెలికాప్టర్ ల్యాండ్ చేసాడు.

ఐస్ క్రీం కోసం నగరం నడిబోడ్డున హెలికాప్టర్ ల్యాండింగ్ చేసిన పైలట్.. ఎక్కడో తెలుసా?

మెడికల్ ఎమర్జెన్సీలో దిగితే ఎటువంటి చర్య తీసుకోలేరు. కానీ ఐస్ క్రీమ్ తినడం అత్యవసరమేమీ కాదని పోలీసులు చెప్పారు. ఐస్ క్రీం తినడం కోసం పార్కిగ్ ప్రదేశం కానీ ప్రదేశంలో లల్యాండ్ చేయడం వల్ల పోలీసులు చర్య తీసుకోవాల్సి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం అందుబాటులో లేదు.

ఐస్ క్రీం కోసం నగరం నడిబోడ్డున హెలికాప్టర్ ల్యాండింగ్ చేసిన పైలట్.. ఎక్కడో తెలుసా?

ఈ హెలికాప్టర్ ప్రైవేట్‌ వ్యక్తులకు సంబంధించినదా లేదా అత్యవసర వైద్య సేవల కోసం ఉపయోగించే సిబ్బందికి సంబంధించినదా అనే విషయం తెలియదు. బహుశా ఈ హెలికాప్టర్ ప్రభుత్వానికి చెందినది కావచ్చు. ఈ కారణంగా, పోలీసులు పైలట్ వివరాలను కొంత రహస్యంగా ఉంచారు.

ఐస్ క్రీం కోసం నగరం నడిబోడ్డున హెలికాప్టర్ ల్యాండింగ్ చేసిన పైలట్.. ఎక్కడో తెలుసా?

హెలికాప్టర్‌ను పాఠశాల మైదానంలో ప్రమాదకరంగా ల్యాండ్ చేసి, ఐస్ క్రీమ్ తినడానికి వెళ్లిన పైలట్ వైద్య సేవా బృందంలోని ఉద్యోగి అని నివాసితులు చెబుతున్నారు. ఐస్ క్రీం తినాలనే పైలట్ కోరికతో, హెలికాప్టర్ నగరం మధ్యలో దిగడంతో నగరం మొత్తం భయం కలిగింది. ఏది ఏమైనా ఇది చట్ట వ్యతిరేఖ చర్య.

ఐస్ క్రీం కోసం నగరం నడిబోడ్డున హెలికాప్టర్ ల్యాండింగ్ చేసిన పైలట్.. ఎక్కడో తెలుసా?

సాధారణంగా హెలికాఫ్టర్లు వంటివి నిర్దిష్టమైన మరియు వాటికి కేటాయించబడిన ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలి. అలా కాకుండా జన సమూహాలు ఉన్న చోట ల్యాండింగ్ చేసినప్పుడు అనుకోని ప్రమాదం సంభవిస్తే అది భారీ ప్రమాదానికి దారి తీస్తుంది. కావున హెలికాఫ్టర్ నడిపే పైలెట్ వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించాలి. లేకుంటే జరిగే పరిణామాలకు బాద్యుడవుతాడు.

Note: Images are representative purpose only

Most Read Articles

English summary
Pilot lands helicopter in city center to have ice cream details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X