మహిళా ఆటో డ్రైవర్లపై వేదింపులు, 'పింక్ లైన్' సర్వీసులు బంద్

By Ravi

పురుషుల లైంగిక దాడుల నుంచి మహిళలకు భద్రత కల్పించేందుకు సాటి మహిళలు ముందుకు వస్తున్నప్పటికీ, వారికి సైతం వేదింపులు తప్పడం లేదు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కువైపోతున్న నేపథ్యంలో, జార్ఖండ్ ట్రాఫిక్ పోలీసులు రాంచీలో గడచిన మహిళల భద్రత కోసం 'పింక్ లైన్' అనే ఆటో రిక్షా సేవలను కేవలం ప్రత్యేకించి మహిళల కోసం ప్రారంభించిన సంగతి తెలిసినదే.

అయితే, ఇప్పుడు ఆ సేవలు నిలిచిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం.. సదరు పింక్ లైన్ ఆటోరిక్షాలను నడుపుతున్న మహిళా ఆటో డ్రైవర్లను పురుష ఆటో డ్రైవర్లు వేదింపులకు గురిచేయటమే. మహిళా ఆటో డ్రైవర్లు స్టాండ్ల వద్ద ప్యాసింజర్ల కోసం ఎదురుచూస్తున్నప్పుడు, సాటి పురుష ఆటో డ్రైవర్లు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయటం, కొన్నిసార్లు హద్దులు మీరి ప్రవర్తించడం చేస్తుంటారని మహిళా ఆటో డ్రైవర్లు వాపోతున్నారు.

హీరా దేవి అనే మహిళా ఆటో డ్రైవర్ తెలిపిన సమాచారం ప్రకారం.. పురుష డ్రైవర్లు తరచూ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారని, నోటికి వచ్చినట్లు భూతులు తిడతారని, కొన్నిసార్లు అస్సలు ఇది (ఆటో నడపటం) మీరు చేయాల్సిన పని కాదని వెక్కిరిస్తుంటారని తెలిపింది. అయితే, తాము మాత్రం ఇలాంటి వ్యాఖ్యలను లెక్క చేయకుండా తమ పని చేసుకుపోతున్నప్పటికీ, కొన్నిసార్లు వారు (పురుష డ్రైవర్లు) హద్దులు మీరి ప్రవరిస్తుంటారని, పోటీ నేపథ్యంలో ఒక్కోసారి బెదిరింపులు కూడా చేస్తుంటారని పేర్కొన్నారు.

Pink Line Auto Rickshaw

పింక్ లైన్ ఆటోరిక్షాలు ఆటోలు పింక్ కలర్ రూఫ్‌ను కలిగి ఉండి, మహిళలకు మాత్రమే అనే బోర్డును కలిగి ఉంటాయి. పింక్ లైన్ ఆటో రిక్షాలను మహిళలే డ్రైవ్ చేస్తారు. ఒకవేళ మహిళా ఆటో డ్రైవర్లు అందుబాటులో లేని నేపథ్యంలో, పురుష ఆటో డ్రైవర్లను ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేసి, వారికి ఐఢి కార్డులను జారీ చేస్తారు. అంతేకాకుండా, ఇలాంటి ఆటో పింక్ లైన్ ఆటో రిక్షాలు జిపిఎస్‌ ద్వారా శాటిలైట్‌కు అనుసంధానం చేయబడి ఉంటాయి.

ఈ సదుపాయం వలన సదరు ఆటో రిక్షాలు ఏ రూట్‌లో ప్రయాణిస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయనే సమాచారన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. పింక్ లైన్ ఆటో రిక్షాలలో జిపిఎస్ కెనెక్టివిటీతో పాటుగా, మహిళా ప్యాసింజర్ల కోసం ప్యానిక్ బటన్ కూడా ఉంటుంది. అత్యవసర సమయాల్లో మహిళా ప్రయాణికులు ఈ బటన్ ప్రెస్ చేసినట్లయితే ట్రాఫిక్ అధికారులకు సందేశం వెళ్లి ఈ ఆటో ట్రాక్‌ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, February 28, 2014, 15:28 [IST]
English summary
In an irony that played out on the streets of Ranchi, women-driven 'pink autos', which were launched just last week to provide safety to the fairer sex, have shut their services because of harassment by male auto drivers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+