ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గం ‘సేలా' టన్నెల్‌ను ప్రారంభించిన మోదీ.. డ్రాగన్‌కు చెక్‌.!!

ప్రపంచంలోనే అత్యంత పొడవైన డబుల్‌-లేన్ టన్నెల్‌(Sela Double Lane Tunnel)ను మన దేశంలో నిర్మించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సొరంగాన్ని శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కాగా కొన్ని నెలల క్రితం.. అరుణాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సేలా సొరంగం ఇదే. ఈ టన్నెల్‌ ఇప్పుడు ప్రారంభమైంది.

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో శనివారం ఉదయం 'వికసిత్‌ భారత్‌- వికసిత్‌ ఈస్ట్‌' కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రధాని మోదీ సెలా టన్నెల్‌(Modi Inaugurates Sela Tunnel)ను ప్రారంభించారు. దీనిని జాతికి అంకితం చేశారు. భారత్‌- చైనా సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు మోదీ ప్రభుత్వం ఈ కీలక ప్రాజెక్టును చేపట్టింది.

Sela-Tunnel-In-Arunachal-Pradesh

ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ టన్నెల్(Sela Tunnel Arunachal Pradesh) ఇండియన్ ఆర్మీకి చాలా రకాలుగా దోహదపడనుంది. శత్రువులకు తెలియకుండా సొరంగ మార్గంలో అతి వేగంగా సరిహద్దులకు సైన్యాన్ని చేర్చేందుకు ఈ టన్నెల్‌ను నిర్మించారు. కాగా ప్రపంచంలోనే పొడవైన రెండు వరుసల టన్నెల్ ఇది. దీంతో ఈ సేలా టన్నెల్ రికార్డు సృష్టించింది.

భారత్‌- చైనా సరిహద్దులోని అరుణాచల్‌ప్రదేశ్‌ తవాంగ్‌ సెక్టార్‌లో ఈ సేలా టన్నెల్‌ను నిర్మించగా.. సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో పర్వత కొండల మధ్య ఈ సొరంగ మార్గం ఉంటుంది. సేలా టన్నెల్ అందుబాటులోకి రావడంతో తవాంగ్‌-దిరాంగ్‌ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అధికారులు తెలిపారు. దీంతో వాహనదారులకు 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.

Sela-Tunnel-In-Arunachal-Pradesh

2019 ఫిబ్రవరి 9 వ తేదీన ఈ సేలా టన్నెల్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేపట్టగా.. ఈ టన్నెల్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.825 కోట్లు ఖర్చు చేసింది. అధునాతన సదుపాయాలు, ఫుల్‌ సెక్యూరిటీ కెపాసిటీతో ఈ టన్నెల్‌ను సుందరీకరించారు. వెంటిలేషన్‌, లైటింగ్‌, ఫైర్ సేఫ్టీ సహా అనేక జాగ్రత్తలతో సొరంగ నిర్మాణం జరిగింది.

ఈశాన్య రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వాహనదారులు.. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రయాణికులు ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఎదురైనా సరే.. సులభంగా ప్రయాణించేలా బాలిపారా-చారిదౌర్‌-తవాంగ్‌ రహదారిలో ఈ సేలా టన్నెల్‌ నిర్మాణం జరిగింది.

Sela-Tunnel-In-Arunachal-Pradesh

సేలా టన్నెల్‌ ద్వారా ముఖ్యంగా భారత ఆర్మీకి ఎక్కువ రక్షణగా ఉంటుంది. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు సైన్యం.. త్వరితగతిన భారత్‌ సరిహద్దులకు చేరుకోవచ్చు. అంతేకాకుండా ఆయుధాలు, సామగ్రిని కూడా రిస్క్‌ లేకుండా తరలించవచ్చని సంబంధింత అధికారులు తెలిపారు.

అయితే ఇక్కడ భారత్‌ బోర్డర్స్‌తో పోల్చితే.. చైనా సరిహద్దులు ఎత్తులో ఉంటాయి. దీంతో మన దేశ సైన్య కార్యకలాపాలను వాళ్లు ఈజీగా తెలుసుకోగలుగుతున్నారు. త్వరలో ఈ సేలా టన్నెల్‌ అందుబాటులోకి వచ్చినట్లయితే ఇక చైనా ఆట కట్టినట్లే. బోర్డర్స్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌(BRO) ఆధ్వర్యంలో ఈ 2 లేన్ల సేలా టన్నెల్‌ను నిర్మించారు.

Sela-Tunnel-In-Arunachal-Pradesh

దీంట్లో ఉండే రెండు సొరంగాల్లో మొదటి టన్నెల్‌ సింగిల్‌ ట్యూబ్‌తో 1003 మీటర్ల పొడవు ఉండగా.. రెండో టన్నెల్‌ రెండు సొరంగ మార్గాలతో 1595 మీటర్ల పొడవుతో నిర్మించారు. కాగా ఈ రెండింటినీ కలిపే రోడ్డు పొడవు 1200 మీటర్లు ఉంది. టన్నెల్‌-2 సొరంగమార్గాల్లో ఒకటి సాధారణ ట్రాఫిక్‌ కోసం నిర్మించారు. మరొకటి ఎమర్జెన్సీ సర్వీసుల కోసం కేటాయించారు.

పర్వతాల మధ్య సేలా అండర్‌పాస్‌కు 400 మీటర్ల దిగువన సేలా టన్నెల్‌ నిర్మాణం జరిగింది. చలికాలంలో కూడా ఈ టన్నెల్‌ మార్గంలో వాహనదారుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా పకడ్బందీగా నిర్మించారు. కాగా ఈ టన్నెల్‌ మార్గంలో గరిష్ఠ వేగ పరిమితి గంటకు 80 కి.మీ.

More from DriveSpark

Article Published On: Sunday, March 10, 2024, 8:10 [IST]
English summary
Pm modi inaugurates worlds longest bi lane tunnel sela in arunachal pradesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+