నేను మోదీ అభిమానిని.. త్వరలో భారత్‌కి టెస్లాతో వస్తున్నాం : ప్రధానితో సమావేశంలో మస్క్
ఈ నెల 24 వరకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో తొలిరోజే టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. భారత్‌లో పెట్టుబడులు, టెక్నాలజీ విషయంలో సహాయం తదితర అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని కలిసిన టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్.. టెస్లా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. న్యూయార్క్‌లో మోదీతో సమావేశం అనంతరం మస్క్ మీడియాతో మాట్లాడుతూ భారత ప్రధానికి దేశాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఉందని తెలిపారు. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి టెస్లాను రమ్మని ఆహ్వానించారని ఆయన అన్నారు.

భారత్‌లో టెస్లాను ఏర్పాటు చేయాలన్న భారతీయుల చిరకాల స్వప్నం సాకారమవుతోందని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాలా కాలంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు టెస్లా ప్రణాళికలు రచిస్తోందని మీడియాతో మస్క్ అన్నారు. వీలైనంత త్వరగా భారత్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పరిశీలిస్తే నివేదికల ప్రకారం ఎలాన్ మస్క్ త్వరలో టెస్లా భారతదేశానికి రాక గురించి అధికారిక ప్రకటన చేయనున్నారు.
టెస్లా భారతదేశంలో పెట్టుబడులు పెడితే, అది భారతీయ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ రంగానికి పెద్ద శక్తిగా మారుతుందనడంలో సందేహం లేదు. సంభాషణ అనంతరం జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సమాధానమిచ్చారు. టెస్లా త్వరలో భారత్‌కు రానుందని తెలిపారు. టెస్లా భారత్‌లోకి ప్రవేశించేందుకు సహకరించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్ ఉందని.. భారత్‌లో చాలా అవకాశాలు ఉన్నాయని మస్క్ అన్నారు. దేశం పట్ల ప్రధాని మోదీకి చాలా శ్రద్ధ ఉందని.. అందుకే భారత్ రావాలని ఆయన ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్ ఇండియాను తలుచుకుంటే చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను మోదీ అభిమానినంటూ జర్నలిస్టుతో తన మనసులోని మాటను పంచుకున్నారు మస్క్.
ఈ సందర్భంగా ఎలాన్ మాస్క్ మాట్లాడుతూ, "నేను వచ్చే ఏడాది భారత్‌లో సందర్శించాలని ప్లాన్ చేస్తున్నాను. టెస్లా భారతదేశంలోకి ప్రవేశించబోతుందని విశ్వసిస్తున్నాను. దీనికి మద్దతు ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో భారతదేశంలో గణనీయమైన పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది." అని అన్నారు.
టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. టెస్లా భారత్‌కు రానుందని గతంలో చాలాసార్లు పుకార్లు వచ్చినా ఏ ఒక్కటీ నిజం కాలేదు. ఇప్పుడు టెస్లా ఇండియాకు వస్తుందని టెస్లా బాస్ స్వయంగా చెప్పారు. ఇది నిజం కావడానికి ఎక్కువ కాలం ఉండదని ప్రధాని మోదీ, టెస్లా సీఈవో మస్క్ సమావేశం ద్వారా తెలుస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








