బెంగళూరులో 'వందే భారత్' ట్రైన్ ప్రారంభించిన నరేంద్ర మోదీ.. ఈ ట్రైన్ విశేషాలు ఏమిటంటే?
ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు 'వందే భారత్'.. ఈ వందే భారత్ ట్రైన్లు ఇప్పటికే ఉత్తర భారతదేశంలో ఢిల్లీ నగరంలో ప్రారంభమైంది. కాగా ఈ రోజు బెంగళూరులో ప్రారంభమైంది.
చెన్నై & మైసూరు, బెంగళూరు మీదుగానే వెళ్లే ఈ రైలుని నరేంద్ర మోడీ ఈ రోజు (2022 నవంబర్ 11) జెండా ఊపి ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ రోజు బెంగళూరులో ప్రారంభించబడిన వందే భారత్ ట్రైన్ ఇప్పటికే ప్రారంభించిన వాటితో కలిపి ఐదవది. ఇది ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభించబడింది. అయితే దక్షిణ భారతదేశంలో ఇదే మొదటిది కావడం విశేషం. దీనితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ 'భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలు'ను కూడా జెండా ఊపి ప్రారంభించారు.
ఈ రోజు ప్రారంభమైన ఈ వందే భారత్ ట్రైన్ బెంగళూరు, చెన్నై మరియు మైసూర్ ప్రయాణించే ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్యను తగ్గిస్తుంది. ఇది అత్యధిక వేగంగా ప్రయాణించే ట్రైన్ మాత్రమే కాదు మంది సర్వీస్ మరియు ఆధునిక భద్రతలు కలిగి ఉన్న ట్రైన్ కూడా. కావున ప్రయాణికులు ఈ రోజు నుంచి ఈ ట్రైన్ సేవలను పొందవచ్చు. ఈ వందే భారత్ ట్రైన్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

శతాబ్ది ట్రైన్ మాదిరిగా ఇప్పుడు వందే భారత్ ట్రైన్ కూడా ప్రయాణికులకు సేవలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైన్ 16 కోచ్‌లతో బయలుదేరింది. ఇది ఈ రోజు బెంగళూరు నుంచి ప్రారంభమై కృష్ణరాజపురం, బంగారుపేట్, కుప్పం మీదుగా గమ్యాన్ని చేరుకుంటుంది. రానున్న రోజుల్లో ఇటువంటి ట్రైన్లు ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం భారతదేశం మొత్తమ్ మీదుగా కేవలం 5 వందే భారత్ ట్రైన్స్ మాత్రమే (ఈ రోజు ప్రారంభించిన దానితో కలిపి) అందుబాటులో ఉన్నాయి. కాగా రానున్న మరో మూడు సంవత్సరాల్లో భారతదేశం మొత్తం మీద 400 వందే భారత్ ట్రైన్లు వినియోగంలోకి రానున్నట్లు సమాచారం, దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే 2022 బడ్జెట్ లో వెల్లడించింది. కావున ఇలాంటి వేగవతమైన ట్రైన్లను తీసుకురావడానికి రైల్వే శాఖ తగిన ఏర్పాట్లను చేస్తోంది.
వందే భారత్ ట్రైన్ యొక్క విశేషాల విషయానికి వస్తే, ఇందులో ఆటోమేటిక్ డోర్స్‌తో పాటు జీపీఎస్ బేస్డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ప్రయాణీకులకు వినోదం కోసం ఆన్‌బోర్డ్ హాట్‌స్పాట్, వైఫై కనెక్షన్, సౌకర్యవంతంగా ఉండే సీట్లు ఉన్నాయి. ఈ రైలు 497 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 6 గంటల 40 నిముషాల్లో చేరుకోగలదని అధికారులు తెలిపారు.
ఈ రోజు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బెంగళూరు నగర నిర్మాత అయిన 'నాడ ప్రభు కెంపెగౌడ' 108 అడుగుల విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. బెంగళూరుకు 'కెంపె గౌడ' చేసిన సేవలకు గాను ఈ రోజు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో ఈ భారీ విగ్రహం ఆవిష్కరించబడుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త బైకులు మరియు కార్లను గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి తెలుగు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








