పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే: విమానాలు సైతం ల్యాండ్ అవ్వొచ్చు.. గ్రేట్ కదా..!!

ఇటీవల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 341 కి.మీ పొడవైన న్యూ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రారంభోత్సవానికి నరేంద్ర మోడీ భారత వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ సి-130జె సైనిక రవాణా విమానాన్ని ఉపయోగించి సుల్తాన్‌పూర్‌ చేరుకున్నాడు. హెర్క్యులస్ సి-130జెలో మోడీ వచ్చిన తర్వాత ఐఎఎఫ్ వైమానిక ప్రదర్శన నిర్వహించింది.

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే: విమానాలు సైతం ల్యాండ్ అవ్వొచ్చు.. గ్రేట్ కదా..!!

ఈ ఎక్స్‌ప్రెస్‌వే విమానాల కోసం కూడా ఉపయోగించబడుతుంది. లక్నో జిల్లాలోని చౌదసరాయ్ నుండి ప్రారంభమయ్యే పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే ఉత్తరప్రదేశ్ - బీహార్ సరిహద్దుకు సమీపంలోని హైదరియా గ్రామంలో ముగుస్తుంది. వాహనాల రద్దీ పెరిగితే భవిష్యత్తులో ఆరు లేన్ల పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే, ఎనిమిది లేన్‌లకు విస్తరించే అవకాశం ఉంది.

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే: విమానాలు సైతం ల్యాండ్ అవ్వొచ్చు.. గ్రేట్ కదా..!!

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం మొత్తం 22,500 కోట్ల రూపాయల వ్యయంతో జరిగింది. ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌వే ఘాజీపూర్ న్యూఢిల్లీ నుండి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు 3.50 గంటలు తగ్గిస్తుంది. ఇది ప్రయాణికులకు చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. కావున ఇది ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్ స్ట్రిప్‌గా ఉపయోగించేందుకు రూపొందించబడింది.

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే: విమానాలు సైతం ల్యాండ్ అవ్వొచ్చు.. గ్రేట్ కదా..!!

ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ప్రత్యేక డిజైన్ ఏదైనా అమలు చేయబడిందో లేదో తెలియదు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే, ప్రయాణీకుల నుండి ఫ్రీ యాక్సెస్ కంట్రోల్, హై స్పీడ్ వెహికల్ సేఫ్టీ వంటి వాటిని నిర్ధారిస్తుంది.

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే: విమానాలు సైతం ల్యాండ్ అవ్వొచ్చు.. గ్రేట్ కదా..!!

ఈ ఎక్స్‌ప్రెస్‌వే శంకుస్థాపన చేసిన మూడేళ్ల తర్వాత తాను విమానంలో దిగుతానని ఎప్పుడూ అనుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రారంభోపన్యాసంలో చెప్పారు. ప్రధాని రాకకు ముందు ఎయిర్ ఫోర్స్ పైలట్లు రిహార్సల్ చేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ కూడా ఉపయోగించారు.

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే: విమానాలు సైతం ల్యాండ్ అవ్వొచ్చు.. గ్రేట్ కదా..!!

నివేదికల ప్రకారం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ దాదాపు 3 కి.మీ పొడవు మరియు పెద్ద వాటితో సహా వివిధ రకాల విమానాలను ల్యాండింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఉత్తరప్రదేశ్ ఇప్పుడు మూడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్‌లను కలిగి ఉంది, ఇది ప్రస్తుతం ఆ రాష్ట్రానికైనా అత్యధిక సంఖ్య అనే చెప్పాలి.

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే: విమానాలు సైతం ల్యాండ్ అవ్వొచ్చు.. గ్రేట్ కదా..!!

జాతీయ రహదారిపై విమానం దిగడం ఇదే తొలిసారి కాదు. గతంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైనప్పుడు అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్‌లను రూపొందించడానికి ఎక్స్‌ప్రెస్‌వేల సారూప్య సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. 2017 లో మొదటి యుద్ధ విమానం యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దిగింది.

రాజస్థాన్‌లో నితిన్ గడ్కరీ మరియు రాజ్‌నాథ్ సింగ్ అదే హెర్క్యులస్ C130J లో ఎక్స్‌ప్రెస్‌వేపై బార్మర్‌లో దిగారు. దేశవ్యాప్తంగా అనేక ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నప్పటికీ, దాని ప్రారంభోత్సవం కోసం ఎక్స్‌ప్రెస్‌వేపై దిగే పద్ధతి ఇటీవల ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ ల్యాండింగ్ తర్వాత 45 నిమిషాల ఎయిర్ షోలో, రాఫెల్, మిరాజ్ మరియు సుఖోయ్ వంటి వివిధ యుద్ధ విమానాలు ప్రారంభోత్సవానికి హాజరైన రాజకీయ అతిథుల కోసం ఎయిర్ షో చేశాయి.

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే: విమానాలు సైతం ల్యాండ్ అవ్వొచ్చు.. గ్రేట్ కదా..!!

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే అనేది ఉత్తర ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే అనేక హై-స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వేలకు లేటెస్ట్ వెర్షన్. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే ప్రధాన హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వేలు అయిన యమునా ఎక్స్‌ప్రెస్ వే, ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే, ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వే అలాగే రాబోయే గంగా ఎక్స్‌ప్రెస్ వే వంటివి కూడా ఉన్నాయి.

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే: విమానాలు సైతం ల్యాండ్ అవ్వొచ్చు.. గ్రేట్ కదా..!!

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే కేవలం వాహన వినియోగదారులకు మాత్రమే కాకుండా, ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే వంటి భారత వైమానిక దళ విమానాలకు ఎమర్జెన్సీ రన్‌వేగా కూడా ఉపయోగించబడుతుంది. కావున ఈ ఆధునిక ఎక్స్‌ప్రెస్‌వే అన్ని విధాలుగా చాలా అనుకూలంగా ఉంటుంది.

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ వే ను ఉపయోగించే ప్రయాణికులు మొదట్లో ఎలాంటి టోల్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా ప్రభుత్వం ఏటా రూ. 202 కోట్లను టోల్ ట్యాక్స్‌గా వసూలు చేస్తుంది. ప్రతి కిలోమీటరుకు టోల్ రేటు మరియు రెండు చివర్లలోని టోల్ ప్లాజాల నుండి తరలింపుపై టోల్ టాక్స్ వంటివి విధించబడుతుంది. అయితే ఈ ఎక్స్‌ప్రెస్‌వే లో టోల్ చార్జీలు లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే ధరల మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నారు.

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే: విమానాలు సైతం ల్యాండ్ అవ్వొచ్చు.. గ్రేట్ కదా..!!

ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న ఈ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ వే ద్వారా రోజూ 15 నుంచి 20 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఈ సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది. తూర్పు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ నుండి వచ్చే ప్రజలు ఢిల్లీ నోయిడాకు వెళ్లడానికి ఈ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు లక్నో ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే మరియు యమునా ఎక్స్‌ప్రెస్‌వేలను ఉపయోగించాలని సంబంధింత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే: విమానాలు సైతం ల్యాండ్ అవ్వొచ్చు.. గ్రేట్ కదా..!!

ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉండటమే కాకుండా వారి ప్రయాణ సమయాన్ని కూడా బాగా తగ్గిస్తుంది.అంతే కాకుండా ప్రభుత్వ ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాల గుండా వెళుతుంది. వీటిలో లక్నో, సుల్తాన్‌పూర్, ఫైజాబాద్, అంబేద్కర్ నగర్, అజంగఢ్, బారాబంకి, అమేథి, మౌ మరియు ఘాజీపూర్ ఉన్నాయి.

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే: విమానాలు సైతం ల్యాండ్ అవ్వొచ్చు.. గ్రేట్ కదా..!!

ఈ కొత్త పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే ను తరువాత దశలో బల్లియా వరకు విస్తరించే అవకాశం కూడా ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే వారణాసి, అయోధ్య, గోరఖ్‌పూర్ మరియు అలహాబాద్ వంటి ముఖ్యమైన నగరాలను లింక్ రోడ్‌ల ద్వారా కలుపుతుంది. కావున ఆ ప్రాంతాల్లోని ప్రయాణికులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Most Read Articles

English summary
Pm narendra modi lands on purvanchal expressway through hercules c130j plane details
Story first published: Friday, November 19, 2021, 15:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X