భారతదేశపు మొట్టమొదటి సీప్లేన్ సర్వీస్ ప్రారంభించిన నరేంద్ర మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ నేడు భారతదేశపు మొదటి సీప్లేన్ సర్వీసును ప్రారంభించారు. ఈ సీప్లేన్ అహ్మదాబాద్ రివర్ ఫ్రంట్ నుండి కెవాడియాకు సేవలు అందిస్తుంది. ఈ సీప్లేన్ రోజుకు రెండుసార్లు ప్రయాణిస్తుంది. ఈ సర్వీస్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారతదేశపు మొట్టమొదటి సీప్లేన్ సర్వీస్ ప్రారంభించిన నరేంద్ర మోడీ

ఈ సీప్లేన్ స్పైస్ జెట్ చేత నిర్వహించబడుతుంది. ఈ సర్వీస్ పొందాలనుకునే వారు రూ. 1,500 చెల్లించలి. ఈ సీప్లేన్ సర్వీస్ ప్రయాణికులు అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ నుండి కేవలం 30 నిమిషాల్లో విగ్రహాన్ని చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది.

భారతదేశపు మొట్టమొదటి సీప్లేన్ సర్వీస్ ప్రారంభించిన నరేంద్ర మోడీ

ఈ విమానం అక్టోబర్ 26 న మాల్దీవుల నుండి భారతదేశానికి చేరుకుంది. గుజరాత్ రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ సీప్లేన్ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది.

ఈ సీప్లేన్ సర్వీస్ కోసం స్పైస్ జెట్ 15 సీట్ల ట్విన్ ఓటర్ 300 ను ఉపయోగిస్తుంది. ఈ విమానం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించబడుతోంది. దాని డిజైన్, పేలోడ్ సామర్ధ్యం మరియు షార్ట్ టేకాఫ్‌కు పేరుగాంచిన ఈ విమానం భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది.

MOST READ:ఇష్టమైన కారు ఆకారంలో వాటర్ ట్యాంక్ నిర్మించిన కారు ప్రేమికుడు.. ఎక్కడో తెలుసా ?

భారతదేశపు మొట్టమొదటి సీప్లేన్ సర్వీస్ ప్రారంభించిన నరేంద్ర మోడీ

ఈ విమానం రెగ్యులర్ మెయింటెనెన్స్, ఓవర్‌హాల్, కొత్త సీట్లు, అలాగే ఎయిర్ క్వాలిటీ రివ్యూ సర్టిఫికెట్‌తో పరిచయం చేయబడింది. ఈ సీప్లేన్ ఎగరడానికి అన్ని నియమాలు మరియు మార్గదర్శకాలను అనుసరిస్తున్నారు.

భారతదేశపు మొట్టమొదటి సీప్లేన్ సర్వీస్ ప్రారంభించిన నరేంద్ర మోడీ

ఈ సీప్లేన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. ఈ విమానాన్ని భారత్‌కు తీసుకురావడం గురించి చాలాకాలంగా చర్చలు జరిగాయి. ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం సబర్మతి రివర్ ఫ్రంట్ లో ప్రయాణించారు. ఇప్పుడు ఈ విమానం ప్రజలకు అందుబాటులో ఉంచబడింది.

MOST READ:కార్ ప్రయాణికులకు లైఫ్‌గార్డ్ అయిన 'సీట్ బెల్ట్' గురించి మీకు తెలియని నిజాలు

భారతదేశపు మొట్టమొదటి సీప్లేన్ సర్వీస్ ప్రారంభించిన నరేంద్ర మోడీ

విమానం సులభంగా టేకాఫ్ మరియు ల్యాండింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సీప్లేన్ ఫీచర్ ల్యాండింగ్ స్ట్రిప్ లేదా రన్‌వేతో సంబంధం లేకుండా ఉపయోగించవచ్చు. ఈ సీప్లేన్ తక్కువ ఖర్చుతో విమాన సేవలను అందిస్తుంది.

భారతదేశపు మొట్టమొదటి సీప్లేన్ సర్వీస్ ప్రారంభించిన నరేంద్ర మోడీ

ఈశాన్య భారతదేశం, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, అండమాన్, లక్షద్వీప్ మరియు భారతదేశంలోని ఇతర తీర ప్రాంతాలకు రాబోయే కొద్ది రోజుల్లో సీప్లేన్ ప్రయాణించే అవకాశం ఉంది. దీనిని సాధారణ వినియోదారులు కూడా ఉపయోగించుకోవచ్చు.

MOST READ:మీకు తెలుసా.. బస్సు అమ్మకాలు భారీగా తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఇదే

Most Read Articles

English summary
India's First Seaplane Service Launched. Read in Telugu.
Story first published: Saturday, October 31, 2020, 17:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X