జపాన్ హై స్పీడ్ బుల్లెట్ రైల్లో మోదీ హవా
ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో హై స్పీడ్ శింకాన్సెన్ బుల్లెట్ రైలును నిర్మించబోతోంది.
భారత్-జుపాన్ మధ్య ద్వైపాక్షిక వార్షిక సదస్సు కోసం భారత ప్రధాని మూడు రోజుల పాటు జపాన్‌లో పర్యటించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మరియు జపాన్ ప్రధాని షింజో అబే జపాన్‌లోని హై స్పీడ్ శింకాన్సెన్ బుల్లెట్ రైలులో ప్రయాణించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా హై స్పీడ్ బుల్లెట్ రైళ్ల నిర్మాణంలో చైనా మరియు జపాన్ దేశాల మద్య పోటీ అధికంగా ఉంది.

ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య నిర్మించిన తలపెట్టిన హై స్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌కు సంభందించిన సాధ్యాసాధ్యాలను శింకాన్సెన్స్ సంస్థ ప్రతినిధులతో చర్చించి తెలుసుకున్నారు. దేశీయంగా అనేక మార్గాల మధ్య బుల్లెట్ రైళ్లను నడిపే ఆలోచనలో భారత్ ఉన్నట్లు మోదీ తెలిపారు.

ఇరు దేశ ప్రధానులు కలిసిన సందర్భంగా కాస్త ఉల్లాసంగా గడిపారని చెప్పవచ్చు. మోదీ మరియు జపాన్ ప్రధాని షింజో అబే ఇద్దరూ బుల్లెట్ రైలులోని డ్రైవర్ క్యాబిన్‌లో కూర్చుని సందడి చేసారు.

ఇరు ప్రధానులు ఈ బుల్లెట్ రైలులో జపాన్ రాజధాని టోక్యో నుండి ఒసాకా బే వరకు ప్రయాణించారు.

నరేంద్ర మోదీ గడిచిన రెండేళ్ల కాలంలో జపాన్‌లో రెండు సార్లు పర్యటించారు. రెండు సార్లు కూడా బుల్లెట్ రైలులో ప్రయాణించి సందడి చేశారు. శింకాన్సెన్ బుల్లెట్ రైలు యొక్క పూర్తి వివరాలను వారి ప్రతినిధులతో అడిగి తెలుసుకున్నారు.

మోదీ ప్రయాణించిన బుల్లెట్ రైలు వేగం యొక్క పరిధి గంటకు 240 నుండి 320 కిలోమీటర్ల వరకు ఉన్నట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.

ముంబాయ్ మరియు అహ్మదాబాద్ మధ్య నిర్మించనున్న హై స్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పనులు 2018 లో ప్రారంభం చేసి 2023 నాటికి పూర్తి స్థాయిలో కార్యచరణలోకి వచ్చే విధంగా ప్రణాళికలు వేస్తున్నారు.
అయితే ప్రముఖ వార్తా పత్రిక తెలిపిన వివరాల ప్రకారం ఇరు దేశాలు ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో కలిసి పనిచేయనున్నట్లు తెలిసింది.

ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మించబోతున్న రైలు ప్రాజెక్ట్ ద్వారా ఇరు దేశాల మధ్యం సంభందం కొత్త కోణాన్ని తలపించనుంది. జపాన్ సహకారంతో ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే దేశ ఆర్థిక పురోగతికి మరింత తోడ్పడనుంది.

జపాన్‍కు చెందిన శింకాన్సెస్ బుల్లెట్ రైలును ముంబాయ్-అహ్మదాబాద్ మధ్య నెలకొల్పితే రెండు నగరాల మధ్య ఉన్న 534 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు గంటల్లో చేరుకోవచ్చు.

భారీ నిధులతో నిర్మించబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజెన్సీ నుండి 97,636 కోట్ల రుపాయల ఆర్థిక సాయాన్ని అప్పుగా తీసుకోనుంది. దీనికి 0.1 శాతం వడ్డీని చెల్లించనుంది.

బుణ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి 50 సంవత్సరాల కాల పరిమితితో 16 వ సంవత్సరం నుండి బుణ చెల్లింపులు ప్రారంభిస్తారు. ప్రతి ఏడాది కూడా 0.1 శాతం వడ్డీ రేటుతో చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ప్రాజెక్ట్ మీద వెచ్చించే మొత్తం ఖర్చులో 20 శాతాన్ని మొదటి 15 ఏళ్లలోపు చెల్లించాల్సి ఉంటుంది. తరువాత వచ్చే 16 ఏడాది నుండి వడ్డీతో కూడిన చెల్లింపులు ప్రారంభించాల్సి ఉంటుంది. ఇండియన్ రైల్వేకి ఇది నిజంగా సవాళుతో కూడుకున్నదని చెప్పవచ్చు.

ఈ ప్రాజెక్ట్‌లో మేకిన్ ఇండియా చొరవతో కేవలం 20 శాతం విడి భాగాలను మాత్రమే జపాన్ నుండి దిగుమతి చేసుకోనున్నారు. బుల్లెట్ రైలు నిర్మాణానికి కావాల్సిన శాస్త్ర సాంకేతికత, నైపుణ్యం గల ఉద్యోగులు, నిర్మాణానికి కావాల్సిన యంత్రాలను దేశీయంగానే సమకూర్చుకోనున్నారు.

జపాన్‌లో మొదటి హైస్పీడ్ రైలు పరిచయం1964 లో జరిగింది. ప్రారంభంలో 515.4 కిలోమీటర్ల పరిధి మేర టొకైడో శింకాన్సెన్ (tokaido shinkansen) బుల్లెట్ రైలు పరిచయం అయ్యింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సుమరుగా 2,387.7 కిలోమీటర్ల మేర బుల్లెట్ రైళ్ల నెట్‌వర్క్ విస్తరించింది.

శింకాన్సెన్ అనగా బుజు మార్గం అని అర్థం. ప్రస్తుతం జపాన్‌లో ఈ పదానికి సరిపోయే విధంగా ఎన్నో బుల్లెట్ రైళ్ల మార్గాలు ఉన్నాయి. అత్యంత రద్దీతో కూడుకున్న హై స్పీడ్ బుల్లెట్ రైలు మార్గాలకు ఇక్కడ కొదవే లేదు.

జపాన్ బుల్లెట్ రైళ్లలో 10 మిలియన్ ప్రయాణికుల తాకిడి ఉంది. ఇందులో టొకైడో శింకాన్సెన్ నెట్‌వర్క్ వారికి యాత్రికుల ద్వారా 5 బిలియన్ డాలర్ల వరకు ధనం చేకూరుతోంది.

ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మించనున్న బుల్లెట్ రైలు మార్గంలో థానే, సూరత్ మరియు వడోదర నగరాలతో పాటు 11 స్టేషన్లను నిర్మించనున్నారు.

- చైనాలో బుల్లెట్ రైలులో ప్రయాణించి, పరీక్షించిన చంద్రబాబు నాయుడు
- ప్రేతాత్మలకు నిలయాలుగా మారిన ఇండియన్ రైల్వే స్టేషన్లు
- ఇండియా నుండి 10 ఇతర దేశాలకు ఉన్న రైలు మార్గాలు


Click it and Unblock the Notifications








