నీరవ్ మోడీ లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్న ఈడీ

నీరవ్ మోడీ కార్యాలయాల మీద సోదాలు జరుపుతున్న ఈడీ ఆయన నివాసంలో అత్యంత విలాసవంతమైన తొమ్మిది కార్లను స్వాధీనం చేసుకుంది. ఇందులో కోట్ల రుపాయలు విలువ చేసే రోల్స్ రాయిస్ ఘోస్ట్ నుండి అత్యంత ఖరీదైన పోర్షే పాన

By Anil

Recommended Video

2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark

కింగ్ ఫిషర్ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బిజినెస్ పేరుతో వందల కోట్ల రుపాయలు బుుణంగా తీసుకొన్నాడు. చేసిన అప్పు చెల్లించకుండానే గత ఏడాది విదేశాలకు పారిపోయాడు. 2017లో మాల్యా చేసిన మోసంతో దేశం మొత్తం అట్టుడికిపోయింది.

నీరవ్ మోడీ కార్ కలెక్షన్

ఈ ఘటన మరువక ముందే మరో మాల్యాగా నీరవ్ మోడీ వార్తల్లో నిలిచాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ ద్వారా 11,400 కోట్ల రుపాయలు మోసానికి పాల్పడిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ విదేశాలకు చెక్కేశాడు.

నీరవ్ మోడీ కార్ కలెక్షన్

నీరవ్ మోడీ మరియు అతని సమీప బందువు మోహుల్ చోక్సీ ప్రమేయంతో పిఎన్‌పి బ్యాంక్‌లో దాదాపు 11,400 కోట్ల రుపాయల మోసానికి పాల్పడ్డాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జరిగిన భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్ మోడీ ఇళ్లు మరియు కార్యాలయాలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) దాడులు జరుపుతోంది.

నీరవ్ మోడీ కార్ కలెక్షన్

నీరవ్ మోడీ కార్యాలయాల మీద సోదాలు జరిపిన ఈడీ ఆయన నివాసంలో అత్యంత విలాసవంతమైన తొమ్మిది కార్లను స్వాధీనం చేసుకుంది. ఇందులో కోట్ల రుపాయలు విలువ చేసే రోల్స్ రాయిస్ ఘోస్ట్ నుండి అత్యంత ఖరీదైన పోర్షే పానమెరా వరకు ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి.

విజయా మాల్యా తరహా కార్లంటే పడి చచ్చిపోయే నీరవ్ మోడీ నివాసంలో ఎలాంటి లగ్జరీ కార్లు ఉన్నాయో క్రింది కథనంలో చూద్దాం రండి....

నీరవ్ మోడీ కార్ కలెక్షన్

1. రోల్స్ రాయిస్ ఘోస్ట్

నీరవ్ మోడీ లగ్జరీ కార్ల కలెక్షన్‌లో అత్యంత ఖరీదైన మరియు అరుదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ విలాసవంతమైన మోడల్. భారత్‌లో దీని ధర సుమారుగా 5.65 కోట్ల రుపాయలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. సాంకేతికంగా ఇందులో 6.6-లీటర్ కెపాసిటి గల ట్విన్ టుర్బో వి12 ఇంజన్ కలదు.

నీరవ్ మోడీ కార్ కలెక్షన్

2. పోర్షే పానమెరా

నీరవ్ మోడీ వద్ద ఫస్ట్ జనరేషన్ పోర్షే పానమెరా ఉంది. దీని ధర సుమారుగా రూ. 2 కోట్ల వరకు ఉంది. పోర్షే మొదటి తరం పానమెరా స్థానంలోకి సెకండ్ జనరేషన్ వెర్షన్‍‌ను ప్రవేశపెట్టింది.

నీరవ్ మోడీ కార్ కలెక్షన్

3. మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 350 సిడిఐ

మెర్సిడెస్ బెంజ్ ఇండియా యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్ జిఎల్ఎస్ లగ్జరీ ఎస్‌యూవీ. ఇండియాలో ఈ ఎస్‌యూవీ దాదాపు చాలా మంది సెలబ్రిటీల వద్ద ఉంది. మే 2016లో ఇండియాలో తొలిసారిగా మెర్సిడెస్ ఈ ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ధర సుమారుగా రూ. 82.9 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

నీరవ్ మోడీ కార్ కలెక్షన్

భారతదేశపు మోస్ట్ పాపులర్ మెర్సిడెస్ లగ్జరీ ఎస్‌యూవీ జిఎల్ఎస్ 350 సిడిఐలో సాంకేతికంగా, అత్యంత శక్తివంతమైన 3-లీటర్ వి6 ఇంజన్ కలదు. 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 258బిహెచ్‌పి పవర్ మరియు 620ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

నీరవ్ మోడీ కార్ కలెక్షన్

4. మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ విక్రయిస్తున్న విలాసవంతమైన లగ్జరీ సెడాన్ కార్లలో సి-క్లాస్ ఒకటి. మెర్సిడ్ సి-క్లాస్ కూడా నీరవ్ మోడీ లైనప్‌లో ఉంది. మెర్సిడెస్ సి-క్లాస్ లగ్జరీ సెడాన్ ధర సుమారుగా రూ. 45 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

నీరవ్ మోడీ కార్ కలెక్షన్

5. టయోటా ఫార్చ్యూనర్

బిజెనెస్‌లో అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమంలో టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని ఇష్టపడని వారంటూ ఉండరు. వ్యాపారంలో బాగా నిలదొక్కుకున్న ప్రతి ఒక్కరి వద్ద ఫార్చ్యూనర్ ఖచ్చితంగా ఉంటుంది. టయోటా కిర్లోస్కర్ ఇండియా ఫార్చ్యూనర్ ప్రీమియమ్ ఎస్‌యూవీని తొలుత 2009లో విడుదల చేసింది.

నీరవ్ మోడీ కార్ కలెక్షన్

భారత్‌లో ఈ ఎస్‌యూవీకి విపరీతమైన ఆదరణ లభించడంతో పలు మార్లు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ అయ్యింది. అయితే, నీరవ్ మోడీ కార్ల కలెక్షన్‌లో ఉన్న ఎస్‌యూవీ మొదటి తరానికి చెందిన ఫార్చ్యూనర్. ప్రస్తుతం, విపణిలో ఉన్న ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ ధర రూ. 26.02 లక్షల నుండి రూ. 31.99 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరలతో లభ్యమవుతోంది.

నీరవ్ మోడీ కార్ కలెక్షన్

6. టయోటా ఇన్నోవా

నీరవ్ మోడీ కార్ల జాబితాలో మొదటి తరానికి చెందిన ఇన్నోవా ఎమ్‌పీవా ఉంది. 2016లో మునుపటి తరం ఇన్నోవా స్థానంలోకి భారీ మార్పులతో కొత్త తరం ఇన్నోవా వాహనాన్ని ఇన్నోవా క్రిస్టా పేరుతో విడుదల చేసింది. ప్రస్తుతం, ఇన్నోవా క్రిస్టా ధరల శ్రేణి రూ. 14.06 లక్షల నుండి రూ. 22.42 లక్షల మధ్య ఉంది.

నీరవ్ మోడీ కార్ కలెక్షన్

7. హోండా సిఆర్-వి

నీరవ్ మోడీ కార్ కలెక్షన్‌లో ఉన్న మరో ప్రీమియమ్ ఎస్‌యూవీ హోండా సిఆర్-వి. హోండా సిఆర్-వి ప్రీమియమ్ ఎస్‌యూవీ భారత్‌లో ఓ మోస్తారు ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్ దిగ్గజం హోండా మోటార్స్ తొలుత 1995లో సిఆర్-వి ఎస్‌యూవీని పరిచయం చేసింది. భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లో సిఆర్-వి విపరీతమైన ఆదరణ లభించింది. హోండా మోటార్స్ అతి త్వరలో డీజల్ వెర్షన్‌లో భారత్‌లోకి లాంచ్ చేయనుంది.

నీరవ్ మోడీ కార్ కలెక్షన్

Source: Network 18

More from DriveSpark

Article Published On: Thursday, February 22, 2018, 19:03 [IST]
English summary
Read In Telugu: Enforcement Directorate seizes nine luxury cars belonging to Nirav Modi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+