హెల్మెట్‌లో పాము.. కాసేపైతే ఏమయ్యేదో.!!

హెల్మెట్‌ ధరించి ద్విచక్ర వాహనం నడపండి.. సురక్షితంగా ప్రయాణించండి అంటూ ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు. కానీ ఇక్కడ హెల్మెట్‌ ధరించి ఉంటే ఆ వ్యక్తి ప్రాణాలు నిజంగానే గాల్లో కలిసిపోయేవి. అదేంటి హెల్మెట్‌ ధరిస్తే ప్రాణాలు పోవడం ఏంటి అని ఆలోచిస్తున్నారా. అది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

బైక్‌లు, స్కూటర్లు, కార్లు ఇలా పలు వాహనాల్లో పాములు దూరడం చూసుంటాం. స్నేక్‌ క్యాచర్ల సాయంతో వాటిని సురక్షితంగా బయటకు తరలించేవారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు పాములు జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తాయి. వెచ్చని వాతావరణం కోసం వెతుకుతూ ఇలా వాహనాల్లో దాక్కుంటాయి. కానీ ఇక్కడ ఓ పాము ఏకంగా హెల్మెట్‌లోకి దూరింది.

Snake-Hides-Inside-a-Helmet

గత కొన్ని రోజులుగా దేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అధిక వర్షాల కారణంగా రోడ్లపై వరద వచ్చి చేరుతోంది. దీంతో అడవిలోని జంతువులు రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో పాములు వంటి రెప్టైల్స్‌ కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వెచ్చని వాతావరణం వెతుక్కుంటూ హెల్మెట్‌లోకి విషపూరిత పాము దూరింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

అయితే పాము హెల్మెట్‌లోకి దూరడాన్ని అదృష్టవశాత్తు ఓ వ్యక్తి గమనించడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించడంతో అతను వచ్చి పామును హెల్మెట్‌ నుంచి బయటకు తీశాడు. అందుకు సంబంధించిన దృశ్యాలను వీడియోలో చూడవచ్చు. అది చిన్నదైనా విషపూరిత కోబ్రా పాముగా గుర్తించారు.

Snake-Hides-Inside-a-Helmet

నాగుపాము చిన్నగా ఉన్నప్పటికీ అది ఉన్నప్పటికీ విషపూరితంగానే ఉంటుంది. చివరగా, హెల్మెట్ నుంచి పామును జాగ్రత్తగా తీసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. పాములు తరచుగా చీకటి ప్రదేశాల్లో తల దాచుకుంటాయని స్నేక్ క్యాచర్‌ పేర్కొన్నారు. హెల్మెట్‌ లోపల చీకటిగా ఉండటంతో పాము అందులోకి వెళ్లి ఉండవచ్చని తెలిపారు. అదృష్టవశాత్తూ, పాము హెల్మెట్‌లోకి ప్రవేశించిన తర్వాత ఎవరూ ఉపయోగించకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

మీరు పాములు ఎక్కువగా ఉండే ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే, మీరు బయటకు వెళ్లేటప్పుడు మీ వాహనాలు, హెల్మెట్‌ను ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవడం చాలా అవసరం. వర్షాకాలంలో ఇలా పాములు బయటకు వచ్చే సందర్భాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి.

అయితే ఇలాంటి ఘటను జరగడం మొదటిసారి కాదు. కొండచిలువలు, కింగ్ కోబ్రా వంటి పెద్ద పాములు కార్లలో చేరినట్లుగా పలు వీడియోలు వైరల్‌ అయ్యాయి. అంతే కాకుండా స్కూటర్లు, బైక్‌లలోకి చేరడాన్ని చూశాం. స్కేక్‌ క్యాచర్లు వాటిలో నుంచి పాములను బయటకు తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

గతంలో కేరళలోనే ఓ ఉపాధ్యాయుడికి వింత అనుభవం ఎదురైంది. అతడి హెల్మెట్‌లోకి పాము దూరింది. అది గమనించని ఆ వ్యక్తి ఏకంగా తలపైనే విష సర్పాన్ని పెట్టుకొని 11 కిలోమీటర్లు ప్రయాణించాడు. గమ్యం చేరుకునేదాక దానిని చూసుకోలేదు. తీరా స్కూలుకు చేరుకున్నాక చూసుకుని అవాక్కయ్యాడు. తనకేం కానందుకు బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు.

మీరు ఎప్పుడైనా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లయితే మొదటగా ప్రశాంతంగా ఉండండి. దాని నుంచి దూరంగా వెళ్లడం ఉత్తమం. తర్వాత స్నేక్‌ క్యాచర్‌ సహాయంతో పామును అడవిలో వదిలేయండి. మీరు పాము కాటుకు గురైతే, వైద్య చికిత్స తీసుకోండి. అంతే కానీ మీ స్వంతంగా పామును పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించకూడదు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 19, 2023, 9:40 [IST]
English summary
Poisonous snake hides inside a helmet rescued video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+