ట్రాఫిక్ కంట్రోల్ కోసం డ్రోన్లు ఉపయోగిస్తున్న పోలాండ్ పోలీసులు

ప్రపంచంలోని చాలా దేశాల్లో రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ప్రతి సంవత్సరం భారీగా పెరిగిపోతోంది. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పోలీసులు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వీటిని పూర్తి తగ్గించలేకపోతున్నారు.

ట్రాఫిక్ కంట్రోల్ కోసం డ్రోన్లు ఉపయోగిస్తున్న పోలాండ్ పోలీసులు

ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో వాహనదారులు చట్టాన్ని ఉల్లంఘించిన వారికి తప్పకుండా శిక్ష పడుతుంది. కొన్ని సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన డ్రైవర్లు అప్పుడప్పుడూ పోలీసుల కళ్లుకప్పి తప్పించుకునే సంఘనటనలు చాలా చూసాము. అయితే ఇలాంటి వాటిని తొలగించడానికి పోలాండ్ పోలీసులు ఒక కొత్త పద్దతిని ప్రవేశపెట్టారు.

ట్రాఫిక్ కంట్రోల్ కోసం డ్రోన్లు ఉపయోగిస్తున్న పోలాండ్ పోలీసులు

ప్రపంచం టెక్నాలజీ పరంగా చాలా వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఈ సమయంలో పోలాండ్ వంటి దేశాలు ట్రాఫిక్ నివారణకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. హైవేపై ఎగురుతున్న డ్రోన్ దూరం నుండి అధిక వేగంతో నడుస్తున్న వాహనాలను గుర్తిస్తాయి. అంతే కాకుండా ఈ డ్రోన్ అటువంటి వాహనాల లైవ్ వీడియో ఫుటేజీని హైవేపై ఉన్న ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు పంపుతుంది. ఆ తర్వాత పోలీసులు ఆ వాహనాన్ని బారికేడ్లు వేసి ఆపుతారు.

ట్రాఫిక్ కంట్రోల్ కోసం డ్రోన్లు ఉపయోగిస్తున్న పోలాండ్ పోలీసులు

ఈ డ్రోన్ పనితీరుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వెలువడింది. ఇందులో మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలపై చర్య తీసుకుంటున్నారు. డ్రోన్లు రహదారిపైన ఉన్న వాహనాలను పర్యవేక్షిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు.

ట్రాఫిక్ కంట్రోల్ కోసం డ్రోన్లు ఉపయోగిస్తున్న పోలాండ్ పోలీసులు

ఈ డ్రోన్ హైవేపై వేగంగా వెళ్తున్న వాహనాలను మరియు ఓవర్ టేక్ చేసే వాహనాలను గుర్తించి వీడియో రికార్డ్ చేయబడుతుంది. పోలీసులు ఈ డ్రోన్లను పరిశీలిస్తారనే విషయం చాలామంది వాహనాదారులకు తెలియదు. వాహనాలను ఆపడానికి, హైవేపై కొంత దూరంలో ఒక కంట్రోల్ రూమ్ ఉంది, అక్కడ నుండి ఒక ట్రాఫిక్ పోలీసు అధికారి బయటకు వచ్చి ఓవర్ స్పీడింగ్ వాహనానికి స్టాప్ సిగ్నల్ ఇస్తాడు.

డ్రోన్‌లతో ట్రాఫిక్‌ను పర్యవేక్షించే టెక్నాలజీ ఇప్పుడు కొత్తగా వచ్చినదేమీ కాదు. పోలాండ్‌తో పాటు, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని పోలీసులు కూడా ఈ డ్రోన్ల సహాయంతోనే వాహన చట్టాన్ని ఉల్లంఘించే వాహనదారులను శిక్షిస్తున్నారు. అమెరికాలో, నిబంధనలను ఉల్లంఘించే వాహనాలు మరియు నేరస్థులను పట్టుకోవడానికి హెలికాప్టర్ల సహాయం కూడా తీసుకుంటారు.

ట్రాఫిక్ కంట్రోల్ కోసం డ్రోన్లు ఉపయోగిస్తున్న పోలాండ్ పోలీసులు

ట్రాఫిక్ పర్యవేక్షణ డ్రోన్‌లో అధిక రిజల్యూషన్ ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా రాత్రి చీకటిలో కూడా మంచి నాణ్యతతో వీడియోను రికార్డ్ చేస్తుంది. కావున రాత్రి సమయంలో రేసింగ్ వంటివి నిర్వహిస్తే కూడా ఇవి రికార్డ్ చేసి కంట్రోల్ రూమ్ కి పంపుతాయి. అప్పుడు వీరిపై చర్యలు తీసుకుంటారు. ఆస్ట్రేలియా పోలీసులు కూడా డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ పర్యవేక్షిస్తున్నారు.

Most Read Articles

English summary
Police In This Country Uses Drones To Bust Driving Violations And Fine Drivers. Read in Telugu.
Story first published: Tuesday, July 27, 2021, 19:22 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X