ఖాళీ స్థలం ఉందని పక్కింటి ముందు కారు పార్క్ చేశాడు.. ఆ కాసేపటికే..
దేశంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల సర్వసాధారణమే. బైక్ లేదా కారు తీసుకుని బయటకు వెళ్లినప్పుడు మొదటగా ఎదురయ్యేది పార్కింగ్ సమస్య. నో పార్కింగ్ ఉన్న చోట కాకుండా పార్కింగ్ జోన్‌లో మాత్రమే వాహనాలు నిలపాల్సి ఉంటుంది. కొంతమంది ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ పార్క్ చేస్తారు.
పట్టణ, నగర ప్రాంతాల్లో పార్కింగ్ విపరీతమైన సమస్యగా మారుతోంది. నగరాల్లో స్థల కొరత ఉండటంతో, వాహనదారులు తమ వాహనాలను సురక్షితంగా పార్క్ చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ పార్కింగ్ చేయడం చేస్తున్నారు. అదే ఇప్పుడు ఓ వాహనదారుడికి సమస్య తెచ్చి పెట్టింది.

ఈ కథనం చదివిన తర్వాత ఇకపై మీ వాహనాలను ఇలా ఎక్కడైనా పార్క్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. లేదంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఎందుకంటే స్థలం ఖాళీగా ఉందని ఓ వ్యక్తి పొరుగింటి ఎదుట కారు పార్క్ చేయడంతో పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ వ్యక్తికి పోలీసులు వచ్చి జరిమానా విధించారు.
ఖాళీ స్థలం ఉందని పక్కింటి గేటు ముందు కారును పార్క్ చేసిన వ్యక్తిపై ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. అవును, ఇది వింతగా అనిపించినా, నమ్మి తీరాల్సిందే. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సదరు ఇంటి యజమాని ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారును మరొకరి ఇంటి ముందు పార్క్ చేసి వారికి ఇబ్బంది కలిగించినందున కారు యజమానికి రూ. 500 జరిమానా విధించారు. చెన్నై పోలీసుల ఈ చర్య కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. కొందరు దీనిపై మంచి స్పందనను వ్యక్తం చేయగా, మరికొందరు చెన్నై పోలీసుల చర్యను వ్యతిరేకించారు. మొత్తం మీద ఈ ఘటనపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఏదేమైనా ఖాళీ ఉంది కదా పక్కింటి ఎదుట వాహనం పార్క్ చేయడం ఎంత పొరపాటో ఈ సంఘటన ద్వారా అర్థమవుతోంది.
మరొకరి ఇంటి పార్కింగ్ స్థలంలో వాహనాలను పార్కింగ్ చేసే ముందు వాహనదారులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఇంటి యజమానుల అనుమతి లేకుండా వారి ఇంటి ముందు మీ వాహనం పార్క్ చేయడం సరైంది కాదు. ఎందుకంటే ఇది వారి వాహనాలను పార్క్ చేసేందుకు ఇబ్బందిగా మారుతుంది.
ఇతరులకు అడ్డుగా వాహనాలను రోడ్లపై పార్క్ చేయడం చట్ట ప్రకారం నేరం. అయితే అలాంటి చట్టం ఉందని చాలా మందికి తెలియదు. చాలా మంది తమ కార్లను రోడ్డు పక్కన పార్క్ చేస్తుంటారు. రాత్రిపూట కూడా రోడ్డుపైనే వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నారు. ఈ విధంగా పార్కింగ్ చేసిన వాహనాలు తమకు ఇబ్బంది కలిగిస్తున్నాయని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాహన యజమానిపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం పోలీసులకు ఉంటుంది.
ఇటీవల పోలీసులు కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు, ఇందుకోసం సోషల్ మీడియా సాయం కూడా తీసుకుంటున్నారు. సాధారణంగా పోలీసులే రోడ్లపై వాహనాల తనిఖీల్లో రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించడం, కేసులు పెట్టడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, అతివేగంగా నడపడం, హెల్మెట్ ధరించకుండా బైక్ నడపడం లాంటి వాటికి పాల్పడితే జరిమానాలు తప్పవు.


Click it and Unblock the Notifications








