ఇక వాహనాలపై స్టిక్కరు వేస్తే కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు, ఎక్కడంటే..

భారతదేశంలో వాహనాదారుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా వాహనదారుల రక్షణను దృష్టిలో ఉంచుకుని కఠినమైన రోడ్డు నిబంధనలను ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఒక కొత్త నియమాన్ని ప్రవేశపెట్టారు. దీని గురించి మరింత తెలుసుకుందాం!

ఇక వాహనాలపై స్టిక్కరు వేస్తే కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు, ఎక్కడంటే..

సాధారణంగా చాలమంది వాహనదారులు తమ వాహనాలపై తమ కులం, మతం వంటి వివిధ స్టిక్కర్స్ వేసుకోవడం మనం చూస్తూనే ఉంటాము. ఇప్పుడు అటువంటి స్టిక్కర్లు వాహనాలపై వేసుకోవడం చట్టరీత్యా నేరం అని ఉత్తరప్రదేశ్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దీని వల్ల వాహనాలపై స్టిక్కర్లు వేసుకున్న వాహనాదారులపై చండీఘర్ పోలీసులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.

ఇక వాహనాలపై స్టిక్కరు వేస్తే కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు, ఎక్కడంటే..

న్యూస్ 18 దీనికి సంబంధించిన ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో వాహనాలపై స్టిక్కర్లు వేసుకున్న వాహన యజమానులపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. కోర్టు యొక్క ఆదేశాల ప్రకారం వాహనాలపై కుటుంబాల పేర్లు, కులం, మతం, వారు చేసే జాబ్ పేరు వంటి స్టిక్కర్లు వేసుకోరాదు. ఇవే కాకుండా పోలీస్, నేవి, ఆర్మీ, ప్రెస్, చైర్మన్ వంటి వారు కూడా ఇలాంటి స్టిక్కర్లను వేసుకోరాదని కొన్ని ఉత్తర్వులు తెలియజేస్తాయి.

ఇక వాహనాలపై స్టిక్కరు వేస్తే కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు, ఎక్కడంటే..

ఇకపై వాహనాలపై కేవలం రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఒక వేళా నిబంధనలను వ్యతిరేకించిన వారికి కఠినమైన చర్యలు తప్పవు అని హెచ్చరించింది. స్టిక్కర్స్ వేసుకున్న వాహనదారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా అక్కడికక్కడే స్టిక్కర్లు తొలగించబడతాయి.

ఇక వాహనాలపై స్టిక్కరు వేస్తే కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు, ఎక్కడంటే..

కోర్ట్ ఆదేశించిన ఈ చట్టాన్ని కచ్చితంగా పాటించాలని పోలీసులు నివేదించారు. ఈ విధంగా స్టిక్కర్లను తొలగించడానికి వాహనదారులకి 72 గంటల సమయం ఇచ్చింది. ఈ కొత్త నిబంధన ప్రజలకి తెలిసిన తర్వాత ఉత్తర్వులు అమలు చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు.

వీడియోలో మనం గమనించినట్లయితే మహీంద్రా బొలెరో వాహనానికి ఉన్న గుజ్జర్ అనే స్టిక్కర్ ని పోలీసులు తొలగించారు. అదే విధంగా టాటా నానోకి వేసిన నేవి లోగోని కూడా తొలగించడం జరిగింది.

ఇక వాహనాలపై స్టిక్కరు వేస్తే కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు, ఎక్కడంటే..

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని వ్యతిరేకించినవారికి మొదటి సారిగా 500 పైన్ వేయడం జరుగుతుంది. ఇది మళ్ళీ పునరావృతమైతే శిక్షగా 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఈ చట్టం కేవలం అక్కడ ఉన్న వాహనదారులకు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి ప్రవేశించే వారికి కూడా వర్తిస్తుంది. ఇటువంటి స్టిక్కర్లు మరియు పోస్టులను ప్రదర్శించడం చట్టం ప్రకారం అనుమతించబడదని కోర్టు తెలిపింది.

ఇక వాహనాలపై స్టిక్కరు వేస్తే కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు, ఎక్కడంటే..

గత శుక్రవారం కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసిన తరువాత, జస్టిస్ శర్మ యొక్క అధికారిక వాహనంపై ‘హైకోర్టు' స్టిక్కర్‌ను తొలగించారు. ఇవే కాకుండా ప్రభుత్వం ప్రైవేట్ వాహనాలపై సైరన్లు మరియు హూటర్లను నిషేధించబడింది. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా వాటిని ఉపయోగించలేరు.

ఇక వాహనాలపై స్టిక్కరు వేస్తే కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు, ఎక్కడంటే..

అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు వంటి అత్యవసర వాహనాలు మాత్రమే భారతదేశంలో వాహనాలపై సైరన్లు మరియు హూటర్లను ఉపయోగించడానికి అనుమతిస్తుంది.

Most Read Articles

English summary
Police officials begin fining cars with stickers after High Court order. Read in Telugu.
Story first published: Saturday, February 1, 2020, 10:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X